E-Paper
Advertisement

‘అమరుల భూమి.. అసురుల భూమి’.. అమరావతిపై పాటతో విరుచుకుపడ్డ అంబటి!

‘అమరుల భూమి.. అసురుల భూమి’.. అమరావతిపై పాటతో విరుచుకుపడ్డ అంబటి!
Advertisement

Ambati Amaravati Song: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై వైసీపీ నేతల విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. కూటమి ప్రభుత్వం.. దేశమే కాదు ప్రపంచమే గర్వించతగ్గ రాజధానిని నిర్మిస్తామంటూ ప్రకటనలు చేస్తోంది. అందుకు తగ్గట్లే రాజధాని ప్రాంతంలో చకచకా నిర్మాణాలు, ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయి. ఇటీవల సీఎం చంద్రబాబు.. సీడ్ యాక్సెస్ రోడ్డును సైతం ప్రారంభించారు. అయితే వైసీపీ నేతలు మాత్రం రాజధానిపై తమ వ్యతిరేక స్వరంగా వినిపిస్తూనే ఉన్నారు. తాజాగా వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఏకంగా పాటనే విడుదల చేశారు. ప్రస్తుతం ఇది ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది.

వైసీపీ నేత అంబటి రాంబాబు.. తాజాగా తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. దానికి యూట్యూబ్ లో రిలీజ్ చేసిన సాంగ్ లింక్ ను జత చేశారు. ‘నాటి అమరావతి అమరులు సంచరించిన పుణ్య భూమి.. నేటి అమరావతి అసురులు సంచరిస్తున్న పాపపు భూమి’ అంటూ అంబటి ఈ పోస్ట్ కు క్యాప్షన్ ఇచ్చారు. ఇవే వ్యాఖ్యలను లిరిక్స్ గా చేసుకొని యూట్యూబ్ లో పాట ఉండటం గమనార్హం.

Advertisement

Also Read: నేను తొలిసారి ఎమ్మెల్యే అయినప్పుడు.. అమిత్ షా చిన్నపిల్లాడు.. మల్లికార్జున ఖర్గే ఘాటు వ్యాఖ్యలు

Advertisement

అంబటి విడుదల చేసిన అమరావతి సాంగ్ లో పంట పొలాల విధ్వంసం, వాటని అడ్డుకుంటున్న రైతులు కనిపించారు. పోలీసులు వారిని బలవంతంగా లాక్కుతున్న దృశ్యాలను వీడియోలో హైలెట్ చేశారు. అదే విధంగా కృష్ణానది వరదల సమయంలో అమరావతి ప్రాంతం నీట మునిగినట్లుగా ఉన్న దృశ్యాలను సైతం అందులో చూపించారు. గొప్ప చరిత్రకు సాక్షిగా నిలిచిన అమరావతి భూమి.. ప్రస్తుతం కాసుల కోసం పరితపించే భూమిగా మారిపోయిందని, దోపిడి దందాలకు నిలయమైందని, రైతులకు వెన్నుపోటు పొడిచిందని పాట రూపంలో విమర్శలు చేశారు.

Also Read: ఉరిశిక్షపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. ప్రత్యామ్నాయ మార్గాల పిటిషన్ కొట్టివేత

Tags

Related News

విజయవాడలో సైకో ప్రేమికుడు వీరంగం.. ఏం చేశాడంటే?

తిరుపతిలో ముగ్గురు వైద్యులపై ఉన్నతాధికారులు వేటు

ఏకపక్షంగా 14 ఆదేశాలా.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై వైఎస్ షర్మిల ఫైర్!

దేశంలో తొలిసారి ఏపీలో 3 డీ హౌసింగ్ ప్రాజెక్ట్.. సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి శంకుస్థాపన, జగన్‌పై విసుర్లు!

కదలికలు తెలుసుకుంటున్నారు.. మా వాళ్లను ట్రాప్ చేశారు, కేతిరెడ్డి పెద్దారెడ్డి హాట్ కామెంట్స్

జీడిపప్పుపై నాణ్యత పరీక్షలు.. తిరుమల నుంచి 12 టన్నుల వెనక్కి, అసలు ఏం జరిగింది?

ప్రపంచ నగరాలకు ధీటుగా.. అమరావతికి మహర్దశ, కొత్త రైల్వే లైన్ కోసం టెండర్లు ఆహ్వానం

రన్నింగ్ ట్రైన్ ఎక్కుతుండగా.. ఓ ప్రయాణికుడ్ని రక్షించిన ట్రాఫిక్ కానిస్టేబుల్, అనంతపూర్ జిల్లాలో ఘటన

Big Stories

Advertisement
×