Upcoming Electric Cars 2026: దేశంలో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. దీనికి తగ్గట్టుగానే కార్ల కంపెనీలు కొత్త కొత్త ఈవీ మోడళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. వచ్చే ఏడాది కాలంలో టాటా, మహీంద్రా, ఎంజీ, హ్యుందాయ్, మారుతి సుజుకి లాంటి సంస్థల నుంచి పలు కొత్త ఎలక్ట్రిక్ కార్లు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. SUVలతో పాటు MPV, కాంపాక్ట్ SUV విభాగాల్లో కూడా కొత్త మోడళ్లు రానున్నాయి.
ఎంజీ నుంచి రానున్న హెక్టర్ టోమాహాక్ ఈవీ మూడు వరుసల SUVగా మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఆగస్టు 26, 2026న దీనిని విడుదల చేయనున్నట్లు సమాచారం. వులింగ్ స్టార్‌లైట్ 560 ఆధారంగా ఈ మోడల్‌ను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో సుమారు 56.7kWh LFP బ్యాటరీ ఉండవచ్చని అంచనా. ఒకసారి ఛార్జ్ చేస్తే దాదాపు 500 కిలోమీటర్ల వరకు ప్రయాణించే అవకాశం ఉంది.
టాటా టిగోర్ ఈవీకి కంపెనీ పెద్ద అప్‌డేట్ తీసుకురావడానికి సిద్ధమవుతోంది. కొత్త వెర్షన్‌లో హెడ్‌ల్యాంప్స్, బంపర్లు, ఫ్రంట్ గ్రిల్‌లో మార్పులు ఉండే అవకాశం ఉంది. క్యాబిన్‌లో కూడా డ్యాష్ బోర్డ్ తో పాటు కొన్ని ఫీచర్లను అప్‌డేట్ చేయవచ్చు.
టాటా మోటార్స్ పాపులర్ SUV సఫారీకి ఎలక్ట్రిక్ వెర్షన్‌ను తీసుకురానుంది. హారియర్ ఈవీతో బ్యాటరీ, ఎలక్ట్రిక్ టెక్నాలజీని పంచుకునే అవకాశం ఉంది. సఫారీ ఈవీని స్టాండర్డ్ రేంజ్ RWD, లాంగ్ రేంజ్ RWD, లాంగ్ రేంజ్ AWD వెర్షన్లలో అందించే అవకాశం ఉంది. కొన్ని వేరియంట్లు సుమారు 600 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇవ్వవచ్చని తెలుస్తోంది.
హ్యుందాయ్ కూడా కాంపాక్ట్ ఎలక్ట్రిక్ SUVపై పనిచేస్తోంది. ప్రస్తుతం దీనిని HE1i అనే పేరుతో పిలుస్తున్నారు. మార్కెట్లోకి వచ్చిన తర్వాత టాటా నెక్సాన్ EV, మహీంద్రా XUV 3XO EV వంటి మోడళ్లతో పోటీ పడే అవకాశం ఉంది.
మారుతి సుజుకి నుంచి రానున్న YMC మూడు వరుసల ఎలక్ట్రిక్ MPVగా ప్రత్యేకంగా నిలవనుంది. 2027 ఫస్ట్ హాఫ్ లో భారత మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ కారు దాదాపు 500 కిలోమీటర్ల రేంజ్ అందించే అవకాశం ఉంది.
మహీంద్రా ఎలక్ట్రిక్ ఫ్యామిలీలోకి BE 07 మరో కీలక మోడల్. BE 6, XEV 9S మధ్య స్థానంలో ఉండనుంది. RWDలో స్టాండర్డ్, ఎక్స్ టెండెడ్ రేంజ్ వెర్షన్లు రావచ్చని తెలుస్తోంది. సుమారు 650 కిలోమీటర్ల వరకు రేంజ్ అందించే అవకాశం ఉండటంతో, మహీంద్రా EVలలో కీలక మోడల్ కానుంది.
కొత్త మోడళ్ల రాకతో భారత ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో పోటీ మరింత పెరగనుంది. ముఖ్యంగా ఎక్కువ రేంజ్, పెద్ద బ్యాటరీలు, ఆధునిక ఫీచర్లు, SUV డిజైన్‌పై కంపెనీలు దృష్టి పెడుతున్నాయి. రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ కారు కొనాలనుకునే వినియోగదారులకు మరిన్ని ఆప్షన్స్ అందుబాటులోకి రానున్నాయి.
Read Also: 27 కి.మీ మైలేజ్, సూపర్ సన్ రూఫ్.. మిడిల్ క్లాస్ ఫేవరెట్ టాటా కారు ఇదే!