BigTV English

AP Assembly Session: ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా.. స్పీకర్ పదవికి అయ్యన్నపాత్రుడు నామినేషన్..

AP Assembly Session: ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా.. స్పీకర్ పదవికి అయ్యన్నపాత్రుడు నామినేషన్..

AP Assembly Session Adjournment: ఏపీ అసెంబ్లీ సెషన్ రేపటికి వాయిదా పడింది. అంతకుముందు ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించారు ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి. శుక్రవారం ఉదయం 9:46 గంటలకు అసెంబ్లీ ప్రారంభమయ్యింది.


ముందుగా సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేగా ప్రమాణం చేయగా ఆ తరువాత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. వీరి తర్వాత మంత్రులు ఒక్కొక్కరిగా ప్రమాణాన్ని పూర్తి చేశారు. మంత్రుల ప్రమాణ స్వీకారం పూర్తి కాగానే మాజీ సీఎం, వైసీపీ అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణం చేశారు.

ఆ తరువాత ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తం 175 మంది ఎమ్మెల్యేలు ఉండగా 172 మంది ఇవాళ ప్రమాణం చేయగా వ్యక్తిగత కారణాలతో ముగ్గురు సభ్యులు సభకు హాజరుకాలేకపోయారు. దీంతో జీవీ ఆంజనేయులు, వనమాడి వెంకటేశ్వరరావు, పితాని సత్యనారాయణ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక ప్రమాణం పూర్తి చేసిన ఎమ్మెల్యేలకు శాసనసభ వ్వవహారాల కార్యాలయం రూల్స్ బుక్, రాజ్యాంగ పుస్తకాలతో కూడిన కిట్ బ్యాగును అందజేసింది.


 

ఇదిలా ఉండగా అసెంబ్లీ స్పీకర్ పదవికి చింతకాయల అయ్యన్నపాత్రుడు నామినేషన్ దాఖలు చేశారు. అతని తరఫున కూటమి సభ్యులు నామినేషన్ దాఖలు చేయగా.. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు లోకేశ్, పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, సత్యకుమార్, నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు.

Also Read: శపథం నెరవేరింది, రెండున్నరేళ్ల తర్వాత సభలో సీఎం చంద్రబాబు

రేపు సభ్యులందరి ప్రమాణం పూర్తయ్యాక స్పీకర్‌ను ఎన్నుకోనున్నారు ఎమ్మెల్యేలు. కాగా రేపు ఉదయం 10.30 గంటలకు అసెంబ్లీ ప్రారంభంకానుంది.

Related News

TTD Warning: టీటీడీ స్ట్రాంగ్ వార్నింగ్.. ఇకపై కేసుల నమోదు.. కటకటాలే!

Visakhapatnam: వైజాగ్‌కు టీసీఎస్ వచ్చేసింది.. 2000 మందితో త్వరలోనే..?

Pawan Kalyan Gifts: టీచర్స్ డే.. అదిరిపోయే కానుక ఇచ్చిన పవన్.. అదేమిటంటే?

Deepam-2 Scheme: ఏపీ గిరిజనులకు బంపర్ గిఫ్ట్.. చిన్న సిలిండర్‌కు గుడ్‌బై.. పెద్ద సిలిండర్‌తో ఫుల్ లాభం!

Disney World AP: అమెరికా నుంచి డైరెక్ట్ షిఫ్ట్.. డిస్నీ వరల్డ్ కోసం రెడీ అవుతున్న.. ఏపీలోని ఆ నగరం!

Vizag Updates: విశాఖకు స్పెషల్ గెస్ట్ వచ్చేశారు.. అలా వెళ్లి ఇలా చూసి రండి!

Big Stories

×