AP News : సీఎం చంద్రబాబుకు రాజకీయ చాణక్యుడు అనే పేరుంది. పాలిటిక్స్‌తో పాటు పాలనపైనా మంచి పట్టుంది. పెట్టుబడులను ఆకర్షించడంలోనే కాదు.. అక్రమాలను ఫిక్స్ చేయడంలోనూ ఎక్స్‌పర్ట్. ఏ మేటర్‌నైనా నీట్‌గా, స్మూత్‌గా హ్యాండిల్ చేస్తారు. తిరుమల ప్రక్షాళన నుంచి విశాఖ రామానాయుడు స్టూడియో భూమి వరకు.. చంద్రబాబు పాలనా దక్షతకు నిదర్శణాలెన్నో.
విశాఖ రామానాయుడు స్టూడియోపై కుట్ర?
ప్రముఖ నిర్మాత, మాజీ ఎంపీ, దివంగత టీడీపీ నేత.. డాక్టర్ రామానాయుడు గురించి ప్రత్యేకంగా చెప్పనవరం లేదు. వైఎస్సార్ హయాంలో విశాఖ సాగరతీరంలో.. స్టూడియో నిర్మాణం కోసం 34.44 ఎకరాల భూమిని కేటాయించారు. అందులో 15 ఎకరాల భూమిని రద్దు చేస్తూ, ఆ స్థలాన్ని వెనక్కి తీసుకుంటూ చంద్రబాబు సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇది నిజంగా సంచలనమే. ఎందుకంటే సీఎం చంద్రబాబు పరిశ్రమలు, కంపెనీలు, స్టూడియోలను ప్రోత్సహిస్తుంటారు. అంతేకానీ, ఇలా ఇచ్చిన భూమిని అంత ఈజీగా తిరిగి తీసుకోరు. అందులోనూ గతంలో తమ పార్టీకే చెందిన రామానాయుడు కుటుంబానికి కేటాయించిన ల్యాండ్‌ను ఇప్పుడు రిటర్న్ తీసుకోవడం మామూలు విషయం కానే కాదు. మరి, ముఖ్యమంత్రి అలాంటి షాకింగ్ డెసిషన్ ఎందుకు తీసుకున్నారా? దాని వెనుక ఉన్న రీజనేంటి? అనేది ఇంట్రెస్టింగ్.
ఆ 15 ఎకరాలే ఎందుకంటే..?
స్టూడియోకు కేటాయించిన మొత్తం ల్యాండ్ 34 ఎకరాలైతే.. అందులోంచి 15 ఎకరాలు మాత్రమే విత్‌డ్రా చేసింది ప్రభుత్వం. ఇప్పటికే స్టూడియో నిర్మించిన స్థలం జోలికి వెళ్లలేదు. విశాఖలోని రామానాయుడు స్టూడియో అలానే ఉంటుంది. అదెక్కడికీ వెళ్లిపోదు. కానీ… స్టూడియోలో భాగంగా ఉన్న మిగతా 15 ఎకరాల ఖాళీ స్థలాన్నే ప్రస్తుతం వెనక్కి తీసుకుంటూ ఉత్తర్వులు ఇచ్చారు. అందుకో బలమైన కారణం లేకపోలేదని అంటున్నారు.
రామానాయుడు ల్యాండ్ కబ్జా!
రామానాయుడు స్టూడియో హ్యాండోవర్‌లో ఉన్న ఆ 15 ఎకరాలను గతంలో రియల్ ఎస్టేట్ ల్యాండ్‌గా మార్చేశారు. ఆ మేరకు 2023లో GVMC నుంచి పర్మిషన్లు తీసుకున్నారు. అందులో లగ్జరీ విల్లాలు నిర్మిస్తున్నారు. కోర్టులో కేసు వేయడంతో ఆ విల్లాల నిర్మాణం ఆగిపోయింది. ఇదంతా గత ప్రభుత్వ హయాంలో జరిగింది. ఇక్కడే ఉంది ట్విస్ట్.
Also Read : రుషికొండ ప్యాలెస్‌పై చంద్రబాబు సంచలన నిర్ణయం!
ఆనాటి అక్రమాలకు చెక్?
రామానాయుడు ఫ్యామిలీపై ఆనాటి వైసీపీ పెద్దలు బాగా ప్రెజర్ తీసుకొచ్చి.. ఆ 15 ఎకరాల ల్యాండ్‌ను కబ్జా చేశారని అంటుంటారు. అందులో వారికి చెందిన బినామీ సంస్థలే ఆ విల్లాలను కడుతున్నాయని చెబుతుంటారు. ఒక్క రామానాయుడు స్టూడియో భూములే కాదు.. గత ప్రభుత్వ హయాంలో విశాఖ వ్యాప్తంగా అనేక ల్యాండ్ సెటిల్మెంట్లు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. పెద్ద స్థాయి వ్యక్తుల ప్రమేయంతో.. వందలాది ఎకరాలను అక్రమంగా లాక్కున్నారనే విమర్శలు వచ్చాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొలువదీరడంతో.. ఆ అక్రమాల చిక్కుముడులు విప్పుతూ.. ఆనాటి అరాచకాలకు చెక్ పెడుతున్నారని తెలుస్తోంది. అలా రామానాయుడు స్టూడియోకు కేటాయించిన భూమిలో సగం కబ్జాకు గురైన సగం భూమిని మాత్రమే ఇప్పుడు సర్కారు వెనక్కి తీసుకుంది. స్టూడియోకు కేటాయించిన ల్యాండ్ పైనా ప్రభుత్వ నియంత్రణ ఉండేలా చర్యలు తీసుకుంది. సినీ అవసరాలకు కాకుండా.. ఆ స్థలాన్ని మరే ఇతర ప్రయోజనం కోసం వాడినా.. ఆ భూమిని కూడా తిరిగి తీసుకుంటామని స్పష్టం చేసింది. ఇదీ అసలు మేటర్. ఇదంతా తెలీక.. రామానాయుడు స్టూడియో భూములు లాగేసుకున్నారంటూ.. కొందరు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీడీపీ మండిపడుతోంది.