E-Paper
Advertisement

APPSC Update: గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. నోటిఫికేషన్ ఎప్పుడంటే..?

APPSC Update: గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. నోటిఫికేషన్ ఎప్పుడంటే..?
Advertisement
APPSC latest notification 2023

APPSC latest notification 2023(AP news live):

ఏపీలో ఉద్యోగార్ధులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గ్రూప్‌–1, గ్రూప్‌–2 పోస్టుల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. గ్రూప్‌-1లో 89, గ్రూప్‌-2లో 508 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆర్థిక, మున్సిపల్‌, ట్రెజరీ, రెవెన్యూ, బీసీ వెల్ఫేర్‌, ప్రొహిబిషన్‌, రవాణా, సాంఘిక శాఖల్లో గ్రూప్‌-1 పోస్టులు భర్తీ చేయనున్నారు.

గ్రూప్-1 పోస్టులు..
డీఎస్పీ(కేటగిరి-2) పోస్టులు- 25
అసిస్టెంట్‌ కమిషనర్‌-ఎస్టీ (సీటీవో) పోస్టులు-18
డిప్యూటీ కలెక్టర్‌ పోస్టులు-12
అసిస్టెంట్‌ ట్రెజరీ ఆఫీసర్‌/అసిస్టెంట్‌ ఎకౌంట్స్‌ ఆఫీసర్‌ పోస్టులు-6
రీజినల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఆఫీసర్‌ పోస్టులు-6
డిప్యూటీ రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కోపరేటివ్‌ సొసైటీస్‌ లో పోస్టులు- 5
డిస్ట్రిక్ట్‌ ఎంప్లాయిమెంట్‌ ఆఫీసర్‌ పోస్టులు-4
డిస్ట్రిక్ట్‌ సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ పోస్టులు-3
డిస్ట్రిక్ట్‌ రిజిస్ట్రార్‌ పోస్టులు-3
అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్‌ పోస్టులు-2
డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ జైళ్లు (పురుషులు) పోస్టు-1
డిస్ట్రిక్‌ ఫైర్‌ ఆఫీసర్‌ పోస్టు-1
మున్సిపల్‌ కమిషనర్‌ (గ్రేడ్‌-2)- పోస్టు- 1
అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ పోస్టు-1
డిస్టిక్ట్ర్‌ బ్యాక్‌వర్డ్‌ క్లాసెస్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ పోస్టు -1

Advertisement

గ్రూప్‌-2 పోస్టులు..
జీఏడీలో పోస్టులు- 161
ఎక్సైజ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టులు- 150
భూ పరిపాలన శాఖలో – డిప్యూటీ తహసీల్దార్‌ (గ్రేడ్‌-2) పోస్టులు- 114
అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ పోస్టులు-23
అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్ పోస్టులు-‌ 18
సబ్‌రిజిస్ట్రార్‌ (గ్రేడ్‌-2) పోస్టులు- 16
లా డిపార్టుమెంట్ లో పోస్టులు-‌ 12
లెజిస్లేచర్‌ (సచివాలయం) విభాగంలో పోస్టులు- 10
మున్సిపల్‌ కమిషనర్‌ (గ్రేడ్‌-3) కేటగిరిలో పోస్టులు- 4

ప్రభుత్వ ఉత్తర్వులకు ప్రకారం APPSCకి పోస్టుల భర్తీపై రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌, ఇతర వివరాలు పంపారు. ఆ అంశాల పరిశీలన తర్వాత నోటిఫికేషన్లు వెలువడతాయి. నెలరోజుల్లో నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

Related News

తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు, లారీని ఢీ కొన్న ట్రావెల్ బస్సు, స్సాట్‌లో 15 మంది

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం? ఏపీకి వర్ష సూచన, అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

మీ భయానికి నిదర్శనం కాదా? బిగ్‌టీవీ సోషల్ మీడియాపై ఆంక్షలు ఎందుకు?- మాజీమంత్రి రోజా ప్రశ్న

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

Big Stories

Advertisement
×