BigTV English

AP Village Secretary : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..

AP Village Secretary : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..

AP Village Secretary : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో (Andhra pradesh) మొన్నటి ఎన్నికల సమయం నుంచి గ్రామ, వార్డు సచివాలయ (Sachivalayam) ఉద్యోగాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ ఉద్యోగుల కొనసాగింపు ఉంటుందా.. లేదా కొత్త ప్రభుత్వంలో తీసేస్తారా అనే సందిగ్ధత నెలకొని ఉంది. అలాంటి వ్యవస్థపై ఏపీలోని కూటమి ప్రభుత్వం (Ap Govt)  కీలక నిర్ణయం తీసుకుంది. సచివాలయ సిబ్బంది పోస్టింగులు(Postings), గ్రామాలకు కేటాయింపులపై ప్రత్యేకంగా కసరత్తు చేసి కీలక అప్ డేట్(Update) ఇచ్చింది.


ఇప్పుడు.. ఏపీలో గ్రామాల్లో (ap villages) ఏ పనులు జరగాలన్నా సచివాలయ సిబ్బంది చేయాల్సిందే. గ్రామాల్లో చిన్నచిన్న పనుల నుంచి లబ్దిదారులను(Benificiaries) గుర్తించడం, వారికి ప్రభుత్వ  పథకాలు (Schemes) అందించడం సహా అనేక కార్యక్రమాల్లో వాళ్ల పాత్ర చాలా పెరిగిపోయింది. ఈ విధానాన్ని వైసీపీ (YCP Govt) అధికారంలో ఉండగా.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి (Ys Jaganmohan Reddy) ప్రారంభించారు. 50 ఇళ్లకు ఓ పర్యవేక్షడు ఉండేలా.. భారీ స్థాయిలో నియామకాలు చేపట్టారు.

ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా.. 11,162 గ్రామ సచివాలయాలు ఉండగా, 3,842 వార్డు సచివాలయాలు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారానే.. వాటి పరిధిలోని ప్రజలకు సేవలు అందిస్తున్నారు. ఈ మొత్తం సచివాలయాల్లో 1,27,175 మంది సిబ్బంది(employees) పనిచేస్తున్నారు. గతంలో.. ఒక్కో సచివాలయం పరిధిలో పది మంది పని చేసేలా ఏర్పాట్లు చేశారు. కానీ.. మారిన పరిస్థితుల నేపథ్యంలో.. కొన్ని సచివాలయాల్లో ఎక్కువ మంది సిబ్బంది ఉండగా,  మరికొన్ని సచివాలయాల్లో చాలా తక్కువ మంది అందుబాటులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు.


సిబ్బంది సంఖ్యను ఇష్టారాజ్యంగా కేటాయించకుండా.. అవసరాల మేరకు వినియోగించుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇందుకోసం.. అవసరం అయితే సచివాలయాల సంఖ్యను కుదించాలని నిర్ణయించారు. అందులో భాగంగా.. రాష్ట్రంలోని అన్ని సచివాలయాలను మూడు కేటగిరీలుగా విభజించిన రాష్ట్ర ప్రభుత్వం.. వాటి అవసరాల మేరకు సిబ్బంది కేటాయింపు చేయనున్నారు. అందులో భాగంగా… ఇకపై 3,500 కంటే ఎక్కువ జనాభా ఉన్న సచివాలయంలో 8 మంది సచివాలయ సిబ్బంది విధుల్లో ఉండనున్నారు.

అలాగే.. 2,500 కంటే ఎక్కువ మంది జనాభా ఉన్న సచివాలయంలో 7 గురిని కేటాయించనున్నారు. ఆ జనాభా నిష్పత్తికి ఏడుగురితో సమర్థవంతంగా విధులు జరిపించవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఆ తర్వాత కేటగిరీలో.. 2,500 కంటే తక్కువ మంది జనాభా పరిధిలోని సచివాలయంలో ఆరుగురు చొప్పున సిబ్బందిని ఉంచనున్నారు.

Also Read : ఏపీలో భూముల రీ సర్వే మొదలు.. ఏ భూములు కొలుస్తారు.? ఏం ప్రయోజనం అంటే.?

వీరు మాత్రమే కాకుండా.. గ్రామాల్లో పంచాయతీ సెక్రటరీ, పట్టణాల్లో వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ హెడ్ గా విధుల్లో ఉంటారని.. మంత్రి పార్థసారథి వెల్లడించారు. శుక్రవారం నాడు ఏపీ సచివాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో వివిధ అంశాలపై చర్చించిన మంత్రి మండలి.. గ్రామ, వార్డు సచివాలయాలపై కూడా చర్చించింది. ఈ సమావేశంలోనే సిబ్బంది హేతుబద్ధీకరణపై చర్చించనట్లు మంత్రి పార్థసారథి వెల్లడించారు.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×