Amaravati: ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విరాళం అందజేశారు. తన మొదటి జీతాన్ని రాజధాని నిర్మాణానికి విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు రూ. 3,01,116ను చెక్కు రూపంలో ఆయన అందజేశారు. ఈ చెక్కును సచివాలయంలో సోమవారం సీఎం చంద్రబాబును కలిసి అందజేశారు. అనంతరం మంత్రిని చంద్రబాబు అభినందించారు.
మరో విషయమేమంటే.. వచ్చే ఐదేళ్లలో ఏపీని స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దేందుకు కృష్టి చేస్తున్నట్లు మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. క్రీడాశాఖలో సమస్యలు సహా అభివృద్ధి కోం తీసుకోవాల్సిన పలు చర్యలపై అధికారులు ఈ సందర్భంగా ప్రజెంటేషన్ ఇచ్చారు.
Also Read: అన్న క్యాంటీన్ల ప్రారంభానికి ముహర్తం ఫిక్స్.. ఏ రోజున అంటే..?
ఇదిలా ఉంటే.. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తో ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ భేటీ అయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై కేంద్రమంత్రితో చర్చించారు. కేంద్ర ప్రభుత్వ పథాకలకు మార్జిన్ గ్రాంట్లు, గత ప్రభుత్వ హయాంలో వినియోగించుకోని నిధులకు సంబంధించినటువంటి విషయాలపైనా వారు చర్చలు జరిపారు. ఈ భేటీలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలుతోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.