E-Paper
Advertisement

నా రూటే సెపరేటు.. ఆశ-ఆసక్తి లేదన్న బండ్ల గణేష్, తెర వెనుక అసలు ఏం జరిగింది?

నా రూటే సెపరేటు.. ఆశ-ఆసక్తి లేదన్న బండ్ల గణేష్, తెర వెనుక అసలు ఏం జరిగింది?
Advertisement

Bandla Ganesh: తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ పర్సన్ నటుడు, ప్రొడ్యూసర్, రాజకీయ నేత బండ్ల గణేష్. ఆయనకు ఫిల్మ్ ఇండస్ట్రీతోపాటు రాజకీయ పార్టీల నేతలతో మంచి సంబంధాలు ఉన్నాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఇష్టపడేవారిలో ఆయన కూడా ఒకరు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇంతకీ తెర వెనుక ఏం జరిగింది?

రాజకీయ, సినీ నిర్మాత బండ్ల గణేష్ ఆసక్తికర వ్యాఖ్యలు

తెలుగు రాష్ట్రాల ప్రజలకు బండ్ల గణేష్ గురించి చెప్పనక్కర్లేదు. అధికారంలో ఏ పార్టీ ఉన్నా, అందరినీ కలిసి ఉంటారని అంటుంటారు. స్వతహాగా కాంగ్రెస్ పార్టీకి ఆయన వీరాభిమాని. అదే సమయంలో సీఎం చంద్రబాబు అంటే మహా అభిమాని. ఆయా పార్టీలు అధికారంలో ఉన్నా, లేకున్నా ఆయన చేయాల్సిన పని చేస్తుంటారు. చెప్పాల్సిన మాటలు చెబుతుంటారు. తాజాగా నాకు పదవులు, హోదాల పట్ల ఆసక్తి లేదని కుండబద్దలు కొట్టేశారు బండ్ల గణేష్.

నా రూటే సెపరేటు.. ఆశ-ఆసక్తి లేదని బండ్ల గణేష్ వెల్లడి

Advertisement

తనకు ఎలాంటి పదవులు, హోదాలు అధికారాలపై ఎలాంటి వ్యామోహం లేదని కుండబద్దలు కొట్టేశారు. నాకు ప్రజల ప్రేమ ముఖ్యమని, ప్రజలు ఇంతకాలం అందించిన ప్రేమ, అభిమానంతో తాను సంపాదించుకున్న గౌరవం ఎంతో విలువైనదని మనసులోని మాట బయపెట్టారు. నాపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, లేనిపోని విషయాలను తన పేరుతో ముడిపెట్టవద్దని కోరారు. తన ప్రమేయం లేని విషయాల్లో తన పేరును ఉపయోగించవద్దని కూడా ఈ సందర్భంగా కోరారు.

సస్పెన్స్ లేఖల ప్రచారం వద్దని, తాను చెప్పనిది తన మాటగా తన పనేలా ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేశారు. పుకార్లు, గాలి వార్తలకు స్పందించకపోవడం కేవలం తన సంయమనం మాత్రమేనని అన్నారు. తన పేరును అనవసరమైన వివాదాలకు దూరంగా ఉంచాలని ఈ సందర్భంగా కోరుకున్నారు. తన పేరు మీద ఎలాంటి రాజకీయాలు చేయవద్దని, తన పేరును రాజకీయాలకు ఉపయోగించుకోవద్దని స్పష్టంచేశారు.

Advertisement

ALSO READ: మోదీ 25 ఏళ్ల పాలన పై వైఎస్ షర్మిల సెటైర్లు.. ఏమన్నారంటే?

గడిచిన ఆరునెలలుగా బండ్ల గణేష్ గురించి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. సినిమాల కంటే ఆయన రాజకీయాలపై ఎక్కువగా ఫోకస్ చేశారని, అందులో తెలుగు రాష్ట్రాల సీఎంలతో క్లోజ్‌గా ఉంటున్నారనే ప్రచారం మొదలైంది. అంతేకాదు ఆయన పదవులు ఆశిస్తున్నారని, అందులో భాగంగా ఈ స్కెచ్ వేశారంటూ ఇలా రకరకాల వార్తలు లేకపోలేదు. జరుగుతున్న పరిణామాలను గుర్తించిన ఆయన, నేరుగా ప్రత్యర్థులకు కౌంటరిచ్చే ప్రయత్నం చేశారు. కేవలం ఒక్కపోస్టుతో రిప్లై ఇచ్చేశారు. ఇప్పటికైనా ఆయనపై జరుగుతున్న ప్రచారానికి ఫుల్‌స్టాప్ పెడుతున్నా, ఇంకా కంటిన్యూ అవుతుందా? అనేది వెయిట్ అండ్ సీ.

Related News

మోదీ 25 ఏళ్ల పాలన పై వైఎస్ షర్మిల సెటైర్లు.. ఏమన్నారంటే?

ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆశా కార్యకర్తలకు భారీ గుడ్ న్యూస్?

నారా నట సామ్రాట్ చంద్రబాబు.. నా అల్లుడి కంటే గొప్ప నటుడు: రోజా పంచ్‌లు!

బ్రహ్మోత్సవాల సీజన్.. తిరుమలలో భక్తులకు సేవ చేసేవారికి ఛాన్స్, ఆన్‌లైన్‌లో బుకింగ్ ఈ విధంగా

నిర్మాణం ఓకే.. కానీ రిస్క్ మీదే! విశాఖ డేటా సెంటర్‌పై హైకోర్టు సంచలన తీర్పు

ద్వారకా తిరుమలలో మహిళా ఉద్యోగిపై.. సీఎం చంద్రబాబు ప్రశంసల జల్లు!

బీసీలపై ఎందుకంత కక్ష?.. ఢిల్లీ వేదికగా వైసీపీ తీరుపై మండిపడ్డ రామ్మోహన్ నాయుడు!

Big Stories

Advertisement
×