Gundeninda GudiGantalu Today episode October 8th : శృతి రవి దగ్గరికి తాయత్తు తీసుకొని వచ్చి నాకు కూడా పిల్లలు కావాలనిపిస్తుంది ఇది కట్టుకో మీ అమ్మకు తోడుగా నువ్వు కూడా అన్నావు కదా.. తాయత్తు కట్టుకుంటే పిల్లలు పుడతారని ఇప్పుడు ఇది కట్టుకో ఇప్పటికిప్పుడే మనం పిల్లలు కనాలి అని శృతి అనగానే మీ ఒక్కసారిగా షాక్ అవుతాడు. నువ్వు ఇప్పుడు తాయత్తు కట్టుకో లేదంటే నీలో మేటర్ లేదని అనుకుంటారు అంటూ శృతి రవికి వరుసగా షాకులు ఇచ్చిన మాట్లాడుతుంది. ఆ మాట వినగానే రవి ఇది మనోజ్ కోసం తెచ్చిన తాయత్తు.. అమ్మ చూస్తే అని బాధపడుతుంది అని రవి అంటాడు. ప్రభా బయట నుంచి తాయత్తు ఎక్కడ టైం లేదు. అని ప్రభావతి టెన్షన్ పడుతుంది.
మనోజ్ కి ఎందుకు రాగానే నీకోసం అమ్మ తాగే తెచ్చింది. నువ్వు వెంటనే ఇది కట్టుకొని రెచ్చిపో అని బాలు అనగానే విడుదల ఏం పని రా నువ్వు పైకి కదా నీకు తాయత్తు కడతాను అని ప్రభావతి అంటుంది. అయితే ప్రభావతి ఆ మాట అనగానే అందరూ కూడా మనోజ్ అంటే ప్రభావతి ఎంత ఇష్టమో అని అనుకుంటారు. ఇక పైకి వెళ్ళగానే ఇంట్లోనే దరిద్రం నీకు పట్టిన దరిద్రం అన్ని వదిలి పోతాయి. దీనిపై అయితే మనసు విరిగిపోతుందో దాన్ని బయటికి పంపించేయాలి అని ప్రభావతి ఆ తాయత్తును కడుతుంది. ఇక రోహిణి తన ప్లాన్ ప్రకారం చెప్పి మరో తాయత్తుని కడుతుంది. మనోజ్ ఆ రెండు తాయతులు కట్టించుకున్న తర్వాత ఒక్కసారిగా తనలో మార్పుని చూసి తాయత్తులు పనిచేస్తున్నాయేమో అని అనుకుంటారు.. కానీ మనోజ్ మాత్రం రోహిణిని చూస్తేనే అమ్మ ఎప్పుడు కళ్ళతోనే కాల్ చేద్దామని చూస్తుంది అలాంటిది పిల్లలు పుట్టాలని తాయత్తు తెచ్చింది నాకు ఏదో డౌట్ గా ఉంది అని అనుకుంటుంది. రెండు తాయెత్తులు కట్టుకొని నేను కోటీశ్వరుని అయిపోతాను అని మనోజ్ చాలా సంతోషంగా ఉంటాడు. ఎలాగైనా సరే ఈ తాయత్తుల వల్ల నేను కోటీశ్వరుని అవ్వాలి అని మనోజ్ అనుకుంటూ ఉంటారు.
నువ్వు కోటీశ్వరుడు అవ్వడం కాదు మీ అమ్మని వదిలేసి కంప్లీట్ గా నా వైపే ఉంటావు అని రోహిణి చాలా సంతోషంగా ఉంటుంది. నేను కట్టిన తాయత్తు మహిమ వల్ల నువ్వు త్వరలోనే నా సొంతం అవుతావు ఇక మీ అమ్మ దగ్గరికి వెళ్ళవు అని రోహిణి అనుకుంటూ ఉంటుంది. మనోజ్ ఒక్కసారి నా వైపు రాగానే తనతో మళ్ళీ పాత రోజుల్లో ఇలాగే ఉండాలి. చింటూ సంగతి ఎట్టి పరిస్థితిలో బయటపడకుండా మరో బిడ్డకి జన్మనివ్వాలి అని ఏవేవో కలలు కంటూ ఉంటుంది రోహిణి. కానీ మనోజ్ మాత్రం ఎలాగైనా సరే నేను కోటీశ్వరుని అయిపోయి త్వరలోనే ఒక బిజినెస్ మాగ్నెట్ గా మారిపోవాలి అని అనుకుంటాడు.
మనోజ్ తాయత్తులు రెండు కట్టుకోవడం వల్ల పూర్తిగా తనలో వేరే శక్తి ప్రవేశించినట్లు గా మారిపోతూ ఉంటాడు. అయితే ఉదయం లేవగానే బాలు పసిపిల్లల సౌండ్ వినిపిస్తుంది అని ఒక్కసారిగా మీనాన్ని లేపి షాక్ అవుతాడు. అయితే అటు మీనా కూడా ఏంటండీ పొద్దు పొద్దున్నే పసిపిల్లల్లాగా ఏడిపిస్తున్నారు నన్ను ఏం పని లేదా మీకు పడుకోండి అని అంటుంది. రవి శృతి కూడా ఎక్కడో పసిపిల్లాడి గొంతు వినిపిస్తుంది కదా అని ఒక్కసారిగా షాక్ అయ్యి కిందకు వస్తారు. ప్రభావతి సత్యం కూడా ఎవర్రా చిన్నపిల్లాడు ఏమైనా వచ్చాడా ఏంటి అంతగా ఏడుస్తున్నాడు కదా అంటూ అడుగుతారు. అప్పుడే మనోజ్ రివర్స్లో కిందికి రావడంతో చూసావా అమ్మ నీ తాయత్తు రివర్స్లో పనిచేసినట్లు నాలుగు కాళ్లతో వాడు కిందికి వస్తున్నాడు అని బాలు ప్రభావతి పై సెటైర్లు వేస్తాడు..
మనోజు కిందకి రావడంతోనే ప్రభావతిని నానమ్మ అని సత్యం నీ తాతయ్య అని అనడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. అమ్మ మా అమ్మ ఎక్కడ అని మనోజ్ అడగడంతో ప్రభావతి ఏంట్రా నేను నీకు నానమ్మన ఏం మాట్లాడుతున్నావ్ రా అసలు ఏమైంది రా నీకు అంటూ కంగారు పడిపోతూ ఉంటుంది. నిజంగా నీకు ఏదో అయింది రా? నువ్వు అందుకే ఇలా ఉన్నావు అని ప్రభావతి అంటుంది. అయితే మనోజ్ మాత్రం పసిపిల్లడిలాగా ప్రవర్తిస్తూ రచ్చ రచ్చ చేస్తాడు. సత్యం నీ తాతయ్యని అనడంతో ప్రభావతి ఒక్కసారిగా షాక్అయ్యి ఎవర్రా నీకు తాతయ్య ఏం మాట్లాడుతున్నావ్ రా నువ్వు అంటూ కోపంతో రగిలిపోతుంది. నువ్వు చేసిన తాయత్తు ప్రయత్నం ఇలా అవుతుందని అసలు ఊహించలేదమ్మా చూశావా నువ్వు చేయడం వలే వాడిలా మారిపోయాడు అని ప్రభావతిని బాలు అంటాడు. సత్యం ఆ తాయత్తుకు విరుగుడు ఏమైనా ఉందేమో ఆవిడకి ఫోన్ చేసి కనుక్కో వెళ్ళు అని పంపిస్తాడు ప్రభావతిని.
బాలు మనోజ్ ని చిన్నపిల్లాడి లాగా ఆడిస్తూ ఏడుస్తూ ఉంటే బుజ్జగిస్తూ ఉంటాడు. అయితే అటు రవి కూడా మనోజ్ ని ఆడిస్తూ ఉంటాడు. ఇక బాలు మీనాలని అంకులాంటి అనడంతో ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు. అటు శృతిని కూడా ఆంటీ అని పిలవడంతో శృతి మనోజ్ ని వచ్చి తల మీద మొట్టికాయలు వేస్తుంది. మనోజ్ ఏడుస్తూ బయటికి వెళ్లిపోతాడు మనోజ్ ని ఎలాగైనా సరే మన దారిలోకి తెచ్చుకోలేని అందరూ ప్లాన్ చేస్తూ ఉండగా బయటకు వెళ్లిపోవడంతో అందరూ తన కోసం వెతుకుతూ ఉంటారు. అప్పుడే మనోజ్ ఒక కారును కొనుక్కొని లోపలికి తీసుకొని వస్తాడు. అది చూసి అందరూ ఏంట్రా ఇదంతా అని ఆలోచిస్తూ ఉంటారు అటు ప్రభావతి స్వామీజీకి ఫోన్ చేసి పరిహారం అడుగుతూ ఉంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..
Also Read :Podarillu Today Episode : కేశవ కోరిక తీరుతుందా? మహా, విక్కీ మధ్య దివ్య..మహాకు గుడ్ న్యూస్..