AP Govt: ఏపీ ప్రజల సంక్షేమంపై చంద్రబాబు సర్కార్ దృష్టి పెట్టింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న పథకాలను ఏపీ అంతటా విస్తరించేలా ప్లాన్ చేసింది.. చేస్తోంది కూడా. ఒకవేళ సమయం ముగిసినా ఏదో విధంగా కన్వీన్స్ చేసి కేంద్రాన్ని ఒప్పిస్తోంది. తాజాగా ఏపీ ప్రభుత్వం సరికొత్త పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. దీనివల్ల ప్రజలకు ప్రతీ నెల విద్యుత్ బాధలు తప్పనున్నాయి. అదెలా సాధ్యమంటారా? అక్కడికే వచ్చేద్దాం.
మోదీ సర్కార్ తీసుకొచ్చింది ‘పీఎం సూర్య ఘర్’ పథకం. దీనిద్వారా ప్రజలు తమ ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవచ్చు. వీటి వల్ల బెనిఫిట్స్ అంతా ఇంతా కాదు. రెండున్నర దశాబ్దాలపాటు అంటే 25 ఏళ్ల వరకు విద్యుత్ బిల్లు కట్టాల్సిన అవసరం లేదు. ఇంటికి అవసరాల వినియోగించుకోగా మిగిలిన పవర్ ను ప్రభుత్వానికి అమ్ముకోవచ్చు.
రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల మందికి ఈ పథకాన్ని వర్తింప చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటని అనుకుంటున్నారా? కేవలం కేంద్రం నుంచే కాదు.. రాష్ట్రం కూడా కొంత రాయితీ ఇవ్వనుంది. ఏపీ వ్యాప్తంగా మూడు డిస్కంల పరిధిలో దాదాపుగా 2.02 కోట్లు వరకు విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. అందులో కోటిన్నరకు పైగానే ఇంటి కనెక్షన్లు ఉన్నాయి.
ఆయా కుటుంబాలు ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుంటే చాలు. ప్రభుత్వానికి బిల్లు ఏమోగానీ తిరిగి ప్రభుత్వం మీకు డబ్బులు ఇవ్వనుంది. ఇళ్లపై రెండు కిలోవాట్ల ప్రాజెక్టుకు రూ. 60 వేలు, మూడు కిలోవాట్ల ప్రాజెక్టుకు రూ.78 వేలు రాయితీ ఇస్తోంది కేంద్రప్రభుత్వం. అదే రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు, గ్రూప్ హౌసింగ్ సొసైటీలు, ఈవీ ఛార్జింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు.
ALSO READ: రికార్డు స్థాయిలో శ్రీవారి దర్శనం, కాసుల వర్షం కూడా
వారికి 500 కిలోవాట్ల వరకు ఆ ఛాన్స్ ఉంటుంది. విద్యుత్ బిల్లులు చాలామంది మధ్యతరగతి కుటుంబాలకు భారంగా మారింది. తక్కువలో తక్కువ వెయ్యి రూపాయల వరకు వస్తోంది. అందులో మధ్య తరగతి ప్రజలకు నెలకు 225 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగిస్తున్నారు. విద్యుత్ పంపిణీ సంస్థలు గృహ వినియోగదారులకు ఇచ్చే బిల్లుల్లో 95 శాతం నాలుగు రకాల శ్లాబులు ఉన్నాయి.
వాటిలో 30 యూనిట్ల వరకు ఒకటి, ఆ తర్వాత 75 యూనిట్ల వరకు రెండోది. ఆపైన 125 యూనిట్ల వరకు మూడోది. అక్కడి 225 యూనిట్ల లోపు ఉన్నాయి. ఈ శ్లాబుల్లో ఉన్నవారు తమ ఇంటిపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుంటే బిల్లుల సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ పథకం కింద రెండు కిలోవాట్ల సోలార్ ప్యానల్స్ యూనిట్ ఏర్పాటు చేసుకుంటే దాదాపుగా రూ. 1.10 లక్షలు ఖర్చు కానుంది.
అందులో రూ.60 వేలు కేంద్రం రాయితీ ఇవ్వనుంది. బీసీలకు అదనంగా మరో రూ.20 వేలు రాయితీ అందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ లెక్కన వినియోగదారులకు కేవలం రూ.30 వేలకు వస్తుంది. ఆ నిధులను బ్యాంక్ ద్వారా రుణం తీసుకునే సౌకర్యం కూడా ఉంది. ఈ ప్యానల్స్ 25 ఏళ్ల వరకు పని చేస్తాయి. సోలార్ ద్వారా వచ్చిన మిగులు విద్యుత్ డిస్కంలు కొనుగోలు చేయనున్నాయి.
యూనిట్‌కు రూ.2.09 చొప్పున ఇవ్వనున్నాయి. ఒకవేళ ఎక్కువ విద్యుత్ వాడితే అదనపు మొత్తానికి టారిఫ్ ప్రకారం బిల్లు వసూలు చేస్తాయి డిస్కం. పీఎం సూర్యఘర్ పథకం కింద రెండు కిలోవాట్ల సామర్థ్యమున్న సోలార్ ప్యానెల్స్‌ను 2027 మార్చి నాటికి 20 లక్షల ఇళ్లపై ఏర్పాటు చేయాలని టార్గెట్‌గా పెట్టుకుంది ఏపీ ప్రభుత్వం. దాదాపు 4వేల మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తి చేయాలన్నది ఓ అంచనా. ఇంకెందుకు ఆలస్యం దీని గురించి గ్రామ సచివాలయంలో వివరాలు తెలుసుకుని వెంటనే దరఖాస్తు అప్లై చేయండి.