Tirumala News: కలియుగ వైకుంఠంగా ప్రసిద్ధి పొందింది తిరుమల. దేశంలో అత్యంత ముఖ్యమైన పుణ్యక్షేత్రాలలో ఇదీ కూడా ఒకటి. ఆహ్లాదకరమైన వాతావరణం అడుగడుగునా కనిపించే భక్తి పారవశ్యం ఆ ప్రాంతం సొంతం. స్వామిని ఒక్కసారి దర్శించుకుంటే పాపాలు తొలగిపోతాయని భావించే భక్తులు ఎక్కువమంది. అందుకే శ్రీహరిని దర్శించుకునే భక్తుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఆపరేషన్ సింధూర్ ఉద్రిక్తతల నేపథ్యంలో తిరుమలకు వెళ్లే భక్తులు తగ్గారని అనుకున్నారు. కానీ, మే నెలలో రికార్డు స్థాయిలో భక్తులు అక్కడికి విచ్చేశారు.
తిరుమలలో రద్దీ రెట్టింపు అవుతోంది. ఎటుచూసినా భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. వచ్చినవారు వస్తుంటే.. దర్శనాలు చేసుకుని వెళ్లిపోయిన వెళ్తున్నారు. మే నెలలో శ్రీవారిని రికార్డు స్థాయిలో భక్తులు దర్శించుకున్నారు. 23.77 లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్లు తెలిపాయి టీటీడీ వర్గాలు. స్వామికి హుండీ ద్వారా రూ.106.83 కోట్ల ఆదాయం వచ్చింది.
వేసవి సెలవుల నేపథ్యంలో టీటీడీ తీసుకున్న నిర్ణయాలు కూడా దీనికి కారణంగా చెబుతున్నారు. ప్రతీ ఏడాది వేసవి సెలవుల కారణంగా తిరుమలలో రద్దీ పెరుగుతోంది. కానీ, మరింత పెరిగింది. ఆపరేషన్ సిందూర్ ఉద్రిక్తత సమయంలో రద్దీ కాస్త తగ్గింది. ఆ తర్వాత కొండకు భక్తులు పొటెత్తారు. రోజుకు 80 వేల మందికి పైగా భక్తులు స్వామిని దర్శించుకోవడం గమనార్హం.
మే 24న 90 వేలు, 25న 91 వేలు, 31న 95 వేల మంది భక్తులు స్వామి దర్శనానికి వచ్చారు. ఇక మే 31న శనివారం తిరుమల శ్రీవారిని అత్యధిక స్థాయిలో అంటే దాదాపు 95 వేల దర్శించుకున్నారు. ఇకవిధంగా చెప్పాలంటే ఇదొక రికార్డు. దశాబ్దం రికార్డు స్థాయిలో స్వామిని భక్తులు దర్శించుకున్నారు. ఇదే క్రమంలో శ్రీవారి హుండీ ఆదాయం పెరిగింది.
ALSO READ: వెన్నుపోటుకి కౌంటర్‌గా పీడ విరగడైంది
సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో సిఫార్సులతో వచ్చే వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది టీటీడీ. దీంతో ఎక్కువ మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు. ఒక్క మే నెలలో మూడుసార్లు 90 వేల మందికి పైగా భక్తులు దర్శించుకోవడం కూడా ఓ రికార్డుగా చెబుతున్నాయి టీటీడీ వర్గాలు. దీనివెనుక టీటీడీ అధికారులు, సిబ్బంది శ్రమవల్లే ఇది సాధ్యమైందని అంటున్నారు.
వీఐపీ బ్రేక్‌లో శ్రీవాణి దాతలు ఉన్నా ఎక్కువ మంది భక్తులకు అవకాశం కల్పించారు. ప్రస్తుతం వేసవి సెలవులు ముగియడంతో రద్దీ క్రమంగా తగ్గే అవకాశముందని భావిస్తున్నారు. నైరుతి రుతుపవనాలు ముందుగా రావడంతో రావాల్సిన భక్తులు సైతం తన ప్రయాణాలను వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది.