BigTV English

AP Liquor Scam : నెలకు రూ.50 కోట్లు?.. మద్యం దందాలో కాఫీ లాంటి కిలాడీ!

AP Liquor Scam : నెలకు రూ.50 కోట్లు?.. మద్యం దందాలో కాఫీ లాంటి కిలాడీ!

AP Liquor Scam : ఏపీ లిక్కర్ స్కాం అనగానే రాజ్ కేసిరెడ్డి పేరే వినిపించింది ఇన్నాళ్లూ. విజయసాయిరెడ్డి సైతం కర్త, కర్మ, క్రియ అంతా కసిరెడ్డేనని ఫిక్స్ చేసేశారు. ఎట్టకేళకు కేసిరెడ్డిని సీఐడీ అరెస్ట్ చేయడంతో.. అసలు మద్యం దందా ఎలా జరిగిందనే మేటర్ బయటకు వస్తోంది. విచారణలో ఆసక్తికర విషయాలు, కొత్త పేర్లు వెల్లడవుతున్నాయి. లిక్కర్ స్కాంలో కూడా.. ఇసుక మాఫియానే కీ రోల్ ప్లే చేసిందని తెలుస్తోంది. ఇంతవరకూ ఎప్పుడూ వినిపించని బల్లం సుధీర్ అనే పేరు బయటకు వచ్చింది. కేసిరెడ్డి తర్వాత అతనే కీలక వ్యక్తి అని చెబుతున్నారు.


బల్లం సుధీర్ ఎవరంటే..

బియాండ్ కాఫీ. అదో లగ్జరీ కాఫీ షాప్. దాని ఓనరే బల్లం సుధీర్. రాజ్ కేసిరెడ్డికి చాలా క్లోజ్. ఇప్పటికే లిక్కర్ స్కాం కేసులో అవినాష్ రెడ్డి, చాణక్య రాజు, కిరణ్ పేర్లు బయటకు రాగా.. తాజాగా బల్లం సుధీర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. వీళ్లంతా కేసిరెడ్డికి అత్యంత సన్నిహితులే కావడం ఆసక్తికరం.


సిట్ చేతిలో కీలక సమాచారం!

ఏపీ సిట్ అధికారులు రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా 50 మందికి సంబంధించిన నివాసాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. అందులో కీలక ఆధారాలు లభించాయి. ఆ ఆధారాల్లో బల్లం సుధీర్ పేరు ప్రముఖంగా తెరపైకి వచ్చినట్టు సమాచారం. ఈ సోదాల్లో రాజ్ కేసిరెడ్డితో సమానంగా బల్లం సుధీర్ వ్యవహరించారని పోలీసుల విచారణలో తేలిందని అంటున్నారు.

సాండ్, లిక్కర్.. ఏపీలో దందాలు

బల్లం సుధీర్‌ను YCPలోకి ఆహ్వానించింది రాజ్ కేసిరెడ్డేనట. ఆ తర్వాత ఖనిజ, ఇసుక మైనింగ్ దందాలోకీ తీసుకొచ్చారట. అటునుంచి.. ఏపీ లిక్కర్ బిజినెస్ లోనూ కీ రోల్ పోషించారని సమాచారం. రెగ్యులర్‌గా జూబ్లిహిల్స్ ఆఫీస్ నుంచి ఈ వ్యవహారాలన్నీ బల్లం సుధీర్ పర్యవేక్షించారని చెబుతున్నారు. రాజ్ కేసిరెడ్డికి సంబంధించిన వ్యవహారాలన్నింటినీ బల్లం సుధీరే చూసేవారని అధికారులు గుర్తించారట. దీంతో ఈ స్కాంలో ఆయన పాత్ర ఏ మేరకు ఉందనే దానిపై సిట్ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

నెలకు రూ.50 కోట్ల ఆదాయం!

బల్లం సుధీర్‌కు YCP నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. సుధీర్-రాజ్ కేసిరెడ్డి కలిసి దాదాపు నెలకు రూ.50 కోట్లు వరకు ఆదాయం సంపాదించారని.. అవన్నీ ఏం చేశారనే దానిపై సిట్ అధికారులు విచారణ జరుపుతున్నట్టు సమాచారం. YCP ప్రభుత్వ హయాంలో సుమారు మూడేళ్లు APలో ఇసుక తవ్వకాలు, సరఫరా వంటి వ్యవహారాలన్నీ బల్లం సుధీర్ ఆధ్వర్యంలోనే జరిగాయని తెలుస్తోంది.

తెలంగాణ టు ఏపీ.. ఆయనే కింగ్ పిన్?

ఆంధ్ర, తెలంగాణలోని పలువురు ముఖ్య నేతలతో బల్లం సుధీర్‌కు చాలాకాలంగా అనుబంధం ఉందని విచారణలో వెల్లడైనట్టు సమాచారం. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇసుక వ్యాపారానికి సంబంధించిన వ్యవహారాల్లో బల్లం సుధీర్‌ హ్యాండ్ ఉందట. తెలంగాణలోని కీలక నేతలతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయట. అటు, కేసిరెడ్డి ద్వారా ఏపీ రాజకీయాలనూ పరోక్షంగా ప్రభావితం చేశారని తెలుస్తోంది. బల్లం సుధీర్ పాలకొల్లు ప్రాంతంలో తన కుటుంబ సభ్యులకు వైసీపీ నుంచి టికెట్ ఇప్పించుకున్నారని అంటున్నారు. ఏపీలో ఇసుక వ్యాపారాన్ని తన గుప్పిట్లో ఉంచుకున్నాడని భావిస్తున్నారు. రాజ్ కేసిరెడ్డికి సంబంధించిన అన్ని వ్యవహారాల్లో.. ఆర్థిక అంశాల్లో.. బల్లం సుధీర్ అత్యంత కీలకంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది.

Also Read : విజిల్ బ్లోయర్‌గా విజయసాయి.. కేసిరెడ్డికి చిక్కులే!

మొత్తం బల్లం సుధీర్ కనుసన్నల్లోనే సాండ్, లిక్కర్ దందాలు జరిగినట్టు సిట్ దర్యాప్తులో ప్రాథమిక అంచనాకు వచ్చినట్టు సమాచారం. త్వరలోనే సుధీర్‌కు సైతం నోటీసులు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×