E-Paper
Advertisement

భోగాపురం ఎయిర్‌పోర్టు.. అర్ధరాత్రి నుంచి విమానాల రాకపోకలు, బస్సుల ఛార్జీల మాటేంటి?

భోగాపురం ఎయిర్‌పోర్టు.. అర్ధరాత్రి నుంచి విమానాల రాకపోకలు, బస్సుల ఛార్జీల మాటేంటి?
Advertisement

Bhogapuram Airport: ఎట్టకేలకు అర్ధరాత్రి నుంచి భోగాపురం అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలు మొదలుకానున్నాయి. దీనికి సంబంధించి ఎయిర్ పోర్టు నిర్వాహకులు అన్ని ఏర్పాటు పూర్తి చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే విమానాలు అర్థరాత్రి తర్వాత నేరుగా భోగాపురం ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్ కానున్నాయి. ఇప్పటికే ఇండిగో, ఎయిర్‌ ఇండియా సంస్థలు తమ తమ సర్వీసులను సిద్ధం చేశాయి.

 

భోగాపురం ఎయిర్‌పోర్టు అర్ధరాత్రి నుంచి విమానాల రాకపోకలు

Advertisement

భోగాపురం ఎయిర్‌పోర్టు నుంచి అర్ధరాత్రి సింగపూర్‌కు తొలి అంతర్జాతీయ విమానం బయలుదేరుతుంది. ఈ విషయాన్ని ఎయిర్‌పోర్టు అధికారులు ఇప్పటికే వెల్లడించారు. దీంతో ఎయిర్‌పోర్టు పరిసరాలు సిబ్బందితో అప్పుడే కళకళలాడుతోంది. విశాఖ నుంచి భోగాపురం వెళ్లే రహదారులు అప్పుడే బిజీగా అవుతున్నాయి. ఎయిర్‌పోర్టును చూసేందుకు, దానికి సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. 17న అనగా సోమవారం ఉదయం సర్వీసులు యథాతథంగా కొనసాగనున్నాయి. భోగాపురం ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీ లేదా బెంగళూరు తొలి దేశీయ విమానం బయలు దేరనున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు.

 

అన్ని ఏర్పాట్లు పూర్తి, సోమవారం 31 సర్వీసులు నడిచే అవకాశం

Advertisement

భోగాపురం నుంచి దేశంలో ప్రధాన నగరాలైన ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై, కోల్‌కతా వంటి నగరాలకు తొలిరోజు 31 సర్వీసులు నడపడానికి ఎయిర్ లైన్స్ సంస్థలు ప్రణాళిక రెడీ చేశాయి.  భోగాపురం నుంచి బయలుదేరే విమానాలు వీటీజెడ్‌ కోడ్‌తో ప్రారంభం కానున్నాయి. ఆ కోడ్‌తో టికెట్లు బుక్‌ చేయాల్సి ఉంటుంది. రానున్న రోజుల్లో భోగాపురం నుంచి మరిన్ని విమాన సర్వీసులు మొదలుకానున్నాయి. ప్రస్తుతం భోగాపురం రెండు అంతర్జాతీయ విమానాల రాకపోకలు జరగనున్నాయి. ఒకటి సింగపూర్ కాగ, మరొకటి సౌదీకి ప్రస్తుతం నడుస్తున్నాయి.

 

అంతర్జాతీయ విమానాలపై మంతనాలు

అక్టోబర్ నాటికి మరో 2 అంతర్జాతీయ స్థాయి విమానాలు రానున్నట్లు సమాచారం. ఇండిగో లేకుంటే ఎయిరిండియా ద్వారా బ్యాంకాక్ సర్వీసు పరిశీలిస్తున్నారు. అకాసా ఎయిర్ సంస్థ ముంబై- బెంగళూరు సర్వీసులను జోడించే అవకాశం ఉందని తెలుస్తోంది. రాత్రివేళ పార్కింగ్ సౌకర్యం ప్రధాన మెట్రో నగరాలకు తెల్లవారుజామున విమాన సర్వీసులను ప్రారంభించేందుకు మార్గం సుగమమైంది. ఈనెల 17 నుంచి విమానాల రాకపోకలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విశాఖ సిటీలో 9 చోట్ల ప్రత్యేక లాంజ్‌లు ఏర్పాటు చేయాలని భావించారు. అయితే వాటి పనులు మొదలుకాలేదు. తొలి దశలో ఐదు చోట్ల నిర్మించాలని అనుకున్నా ఒక్క అడుగుపడలేదు. ఆటోనగర్, ఎన్‌ఏడీ కూడలి, గురుద్వారా కూడలి, వెంకోజీపాలెం, వీఎంఆర్‌డీఏ పార్క్‌ల వద్ద రూ.25 లక్షలతో ప్రత్యేక లాంజ్‌లు జీఎంఆర్‌ సంస్థ నిర్మిస్తుందని అధికారులు తెలిపారు. సమయం దగ్గరపడినా దీనిపై ఎవరూ నోరు విప్పలేదు.

ALSO READ: చికెన్ ప్రియులకు బిగ్ రిలీఫ్.. తెలుగు రాష్ట్రాల్లో భారీగా పడిన ధరలు, అదే కారణమా?

గాజువాక నుంచి ఎన్‌ఏడీ, గురుద్వారా, మధురవాడ మీదుగా పాత జాతీయ రహదారిలో వెళ్లేలా ఓ రూటు ఖరారు చేశారు అధికారులు. ఈ మార్గంలో ప్రయాణానికి దాదాపు రెండు గంటల సమయం పడుతుందని చెబుతున్నారు. ఇదికాకుండా సింధియా, రైల్వే స్టేషన్, వీఎంఆర్‌డీఏ పార్కు, గీతం కళాశాల, ఐటీ సెజ్, మారికవలస కూడలి నుంచి భోగాపురానికి వెళ్లేలా మరో రూటు ఖరారు చేసినా వాటి పనులు పూర్తి కాలేదు. విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టుకు కలిపే అన్ని రహదారులకు గూగుల్‌ ఇంటిగ్రేషన్‌ దాదాపుగా పూర్తయింది. ఏ రూట్లో వెళ్తే చేరుకుంటారో సూచించేలా సాంకేతిక వ్యవస్థకు అనుసంధానం చేశారు. విశాఖ నగరం నుంచి ఎయిర్‌పోర్టుకు వెళ్లే ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలు ఎక్కువగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కొత్త రోడ్లు తయారు కాకపోవడంతో, పాతరూట్లలో ధరలు నార్మల్‌గా ఉండవచ్చని అంటున్నారు. ఈ ఛార్జీలపై విమాన ప్రయాణికులు కాస్త తర్జన భర్జన పడుతున్నారు.

Related News

విజయవాడలో సైకో ప్రేమికుడు వీరంగం.. ఏం చేశాడంటే?

తిరుపతిలో ముగ్గురు వైద్యులపై ఉన్నతాధికారులు వేటు

ఏకపక్షంగా 14 ఆదేశాలా.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై వైఎస్ షర్మిల ఫైర్!

దేశంలో తొలిసారి ఏపీలో 3 డీ హౌసింగ్ ప్రాజెక్ట్.. సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి శంకుస్థాపన, జగన్‌పై విసుర్లు!

కదలికలు తెలుసుకుంటున్నారు.. మా వాళ్లను ట్రాప్ చేశారు, కేతిరెడ్డి పెద్దారెడ్డి హాట్ కామెంట్స్

జీడిపప్పుపై నాణ్యత పరీక్షలు.. తిరుమల నుంచి 12 టన్నుల వెనక్కి, అసలు ఏం జరిగింది?

ప్రపంచ నగరాలకు ధీటుగా.. అమరావతికి మహర్దశ, కొత్త రైల్వే లైన్ కోసం టెండర్లు ఆహ్వానం

రన్నింగ్ ట్రైన్ ఎక్కుతుండగా.. ఓ ప్రయాణికుడ్ని రక్షించిన ట్రాఫిక్ కానిస్టేబుల్, అనంతపూర్ జిల్లాలో ఘటన

Big Stories

Advertisement
×