E-Paper
Advertisement

చికెన్ ప్రియులకు బిగ్ రిలీఫ్.. తెలుగు రాష్ట్రాల్లో భారీగా పడిన ధరలు, అదే కారణమా?

చికెన్ ప్రియులకు బిగ్ రిలీఫ్.. తెలుగు రాష్ట్రాల్లో భారీగా పడిన ధరలు, అదే కారణమా?
Advertisement

Chicken Price Fall: తెలుగు రాష్ట్రాల్లో కొన్నాళ్లుగా కొండెక్కి కూర్చొన్న చికెన్ ధరలు అమాంతంగా దిగి వస్తున్నాయి. ఉన్నట్లుండి ఏం జరుగుతోంది. చికెన్ ధరలు పడిపోవడం వెనుక రకరకాల కారణాలు చెబుతున్నారు వ్యాపారులు. శ్రావణ మాసం నేపథ్యంలో ధరలు దిగివచ్చాయని చెబుతున్నాయి. ఆ మాటల్లో నిజమెంత? చికెట్ మార్కెట్లో ఏం జరుగుతోంది.

 

చికెన్ ప్రియులకు బిగ్ రిలీఫ్

Advertisement

ఏపీ-తెలంగాణల్లో కొన్నాళ్లుగా చికెన్-గుడ్ల ధరలు కొండెక్కాయి. చాలా రోజులు దిగి రాలేదు. దాదాపు కిలో రూ.300 పైనే పలికేది. చికెన్ ధరలపై శ్రావణమాసం ప్రభావం కనిపిస్తోంది. ఈ మాసంలో భక్తులు నాన్-వెజ్ దూరంగా ఉంటుండటంతో మార్కెట్‌లో ధరలు ఒక్కసారిగా దిగివచ్చాయి. కేవలం 10 రోజుల వ్యవధిలో చికెన్ ధరల్లో గణనీయమైన మార్పు చోటు చేసుకుంది.

 

తెలుగు రాష్ట్రాల్లో భారీగా పడిన ధరలు

Advertisement

స్కిన్‌లెస్ చికెన్ కిలో రూ.280 నుంచి రూ.310 మధ్య పలికేది. ప్రస్తుతం ఆ ధరలు భారీగా ఇప్పుడు లేవు. ముఖ్యంగా ఏపీలోని విజయవాడ, గుంటూరు, అనకాపల్లి ప్రాంతాల్లో కిలో చికెన్ రూ.220 నుంచి రూ.240 మధ్య పలుకుతోంది. తెలంగాణలోనూ చికెన్ ధరలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్, వరంగల్, నల్లగొండ, కరీంనగర, నిజామాబాద్ ప్రధాన నగరాల్లో కిలో రూ.230 నుంచి రూ.250 మధ్య అమ్మకాలు జరుగుతున్నాయి.

 

శ్రావణమాసం ధరల తగ్గుదలకు కారణమా?

గడిచిన వారం రోజులుగా డిమాండ్ పెద్దగా లేదని చెబుతున్నారు వ్యాపారులు. శ్రావణ మాసం ప్రభావం షాపులపై పడిందని చెబుతున్నారు. ఈ మాసం ముగిసే వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని పౌల్ట్రీ వ్యాపారులు చెబుతున్నారు. ఫారాలలో కోళ్ల ఉత్పత్తి నిరంతరం పెరుగుతోంది. దీనికితోడు మార్కెట్లో తగిన గిరాకీ లేకపోవడం, నిల్వ ఉంచలేక తక్కువ ధరలకే విక్రయించాల్సి వస్తోందని వాపోతున్నారు.

ALSO READ: అసెంబ్లీ సమావేశాలపై సీఎం చంద్రబాబు ఫోకస్.. వైసీపీని ఎండగడుతూ, ఏ రోజుకు ఆ రోజు

గ్రామీణ ప్రాంతాల వాసులు చాలావరకు బాయిలర్ చికెన్ దూరంగా ఉంటున్నారు కూడా. ఇక గుడ్ల విషయానికి వద్దాం. వారం కిందటి వరకు ఒక్కో గుడ్డు రూ.8 వరకు పలికేది. ఇప్పుడు వాటి ధరలు కూడా అమాంతంగా పడిపోయాయి. విజయవాడ జోన్‌లో 12 గుడ్లు రిటైల్ ధర రూ.75 లుకా ఉంది. దానికంటే ఒక రూపాయి తక్కువగా హైదరాబాద్, కరీంనగర్ జోన్ పరిధిలో ఉంది.

Related News

భోగాపురం ఎయిర్‌పోర్టు.. అర్ధరాత్రి నుంచి విమానాల రాకపోకలు, బస్సుల ఛార్జీల మాటేంటి?

అసెంబ్లీ సమావేశాలపై సీఎం చంద్రబాబు ఫోకస్.. వైసీపీని ఎండగడుతూ, ఏ రోజుకు ఆ రోజు

కాల్వలోకి దూసుకెళ్లిన కారు, నలుగురు యువతీయువకులు గల్లంతు, పశ్చిమగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

శ్రీశైలం మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కిక్కిరిసి పోతున్న వాహనాలు!

చోడవరంలో దారుణం.. భర్తను నరికి చంపి, తల వద్ద దీపం పెట్టిన భార్య!

గుండెల్లో బలమైన అజెండా ఉండాలి.. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్

తిరుపతి స్వాతంత్ర్య వేడుకల్లో మంత్రి ఆనంకు అస్వస్థత.. అప్రమత్తమైన కలెక్టర్, ఎస్పీ!

Big Stories

Advertisement
×