E-Paper
Advertisement

అసెంబ్లీ సమావేశాలపై సీఎం చంద్రబాబు ఫోకస్.. వైసీపీని ఎండగడుతూ, ఏ రోజుకు ఆ రోజు

అసెంబ్లీ సమావేశాలపై సీఎం చంద్రబాబు ఫోకస్.. వైసీపీని ఎండగడుతూ, ఏ రోజుకు ఆ రోజు
Advertisement

Amaravati: ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి మొదలుకానున్నాయి. ఎప్పడూ లేని విధంగా ఈసారి తక్కువ సమయం కేటాయించింది ప్రభుత్వం. దేశంలో జెన్ జీ ఉద్యమాల నేపథ్యంలో అసెంబ్లీ వేదికగా వైసీపీని ఎండగట్టే ప్రయత్నం చేస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. శనివారం రాత్రి ముఖ్యమంత్రి.. మంత్రులతో టెలికాన్ఫరెన్సు నిర్వహించారు. సమావేశాల్లో ఏ రోజు ఎలా వ్యవహరించాలనే దానిపై క్లియర్ మ్యాప్ ఇచ్చేశారు.

 

అసెంబ్లీ సమావేశాలపై సీఎం చంద్రబాబు ఫోకస్

Advertisement

ఏపీలో అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈసారి కూడా అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని వైసీపీ డిసైడ్ అయ్యింది. కేవలం మండలికి మాత్రమే వైసీపీ సభ్యులు వెళ్లనున్నారు. మండలి సమావేశాలు జరగకుండా డీఎస్సీపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని సభ్యులకు మాజీ సీఎం జగన్ సంకేతాలు ఇచ్చారు. ఈ విషయంలో అధికార పార్టీకి ఏ మాత్రం మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా, వాయిస్ బలంగా ఉండే నేతలను ఎంపిక చేశారు. డీఎస్సీపై సభ్యులు అందులోని అంశాలను లేవనెత్తి ప్రభుత్వాన్ని ఇరుకాటంలో పడేయాలని సంకేతాలు ఇచ్చారు. దీనిపై ఇప్పటికే మేటర్ సేకరించి, డీటేల్స్ తెలుసుకునే పనిలో పడ్డారు.

 

రాత్రి మంత్రులతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్

Advertisement

వైసీపీ ఎత్తుగడలను ముందే పసిగట్టారు సీఎం చంద్రబాబు. ఈ క్రమంలో శనివారం రాత్రి మంత్రులతో టెలికాన్పురెన్స్ నిర్వహించారు. సమావేశాలు తక్కువ రోజులు కావడంతో కీలకమైన సబ్జెక్టులపై మంత్రులకు.. ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. తొలిరోజు అంటే సోమవారం 17న డీఎస్సీ, ఎల్‌నినో ప్రభావం, వ్యవసాయ రంగాలపై చర్చించాలని ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. ఎల్‌నినో కారణంగా వర్షాభావం, తాగునీటి కొరతపై సభలో చర్చించనుంది ప్రభుత్వం. అలాగే ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వ తీసుకున్న చర్యలను సభలో చర్చించనున్నారు. దీనిపై సభ్యుల నుంచి సమాచారం తీసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. మంళవారం రోజు అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లపై చర్చ జరగనుంది. కేబినెట్‌లో డెడికేటెడ్ కమిషన్ నివేదికకు ఆమోదం తెలపనుంది. బీసీ రిజర్వేషన్లపై సభలో తీర్మానం లేకుంటే బిల్లు ప్రవేశపెట్టే అవకాశమున్నట్లు సమాచారం.

 

మూడోరోజు వైసీపీని ఎండగట్టడం ఖాయం

ఇక మూడోరోజు అనగా బుధవారం సభలో ఆసక్తికర చర్చ జరగనుంది. జగన్ ప్రభుత్వంలో గ్రూప్-1 నియామకాల్లో అక్రమాలపై చర్చ పెట్టనుంది. దీనికి సంబంధించి సిట్ నివేదిక ఇవ్వడం, ఆ సమయంలో ఎంపికైనవారికి ఇంకా సరైన పోస్టింగ్ ఇవ్వలేకపోవడం, ఆనాడు జరిగిన అవకతవకలను సభలో ఎండకట్టనుంది. అందుకోసం సభలో పాయింట్ టు పాయింట్ వివరించనున్నారట సీఎం చంద్రబాబు, లేకుంటే విద్యాశాఖ మంత్రి లోకేష్. దాని తర్వాత శాంతిభద్రతల నిర్వహణపై అసెంబ్లీలో చర్చ జరగనుంది. ఇప్పటికే కేసుల తీరు, తీసుకొచ్చిన చట్టాలపై చర్చించనుంది.

ALSO READ: కాల్వలోకి దూసుకెళ్లిన కారు, నలుగురు యువతీయువకులు గల్లంతు, పశ్చిమగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

ఇక చివరిరోజు సూపర్-6 పథకాల అమలు, రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులపై సభలో చర్చ జరగనుంది. దీనిపై సభ్యుల నుంచి సమాచారం తీసుకోనుంది ప్రభుత్వం. ఎందుకంటే విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుపై కొన్ని‌వర్గాల ఆందోళనను సభ ద్వారా తిప్పికొట్టే ప్రయత్నం చేయనుందట ప్రభుత్వం. పథకాల్లో ఇంకా పెండింగ్ అంశాలు, హామీలు ఇవ్వకుండా చేసినవ ఈ సందర్భంగా మంత్రులు సభ దృష్టికి తీసుకురానున్నారు. అమరావతి నిర్మాణం, అక్కడికి వచ్చే పెట్టుబడులను సభలో ప్రస్తావించే అవకాశముందని సమాచారం.

Related News

ఏపీలో స్పెషల్ టెట్-2026 హాల్ టికెట్లు విడుదల, షెడ్యూల్ ఇదే! ఫలితాలు మాత్రం

ఏపీలో లక్షన్నర కోట్ల BPCL రిఫైనరీ ప్రాజెక్టు.. పర్యావరణ అనుమతులకు గ్రీన్‌సిగ్నల్, శంకుస్థాపనకు ప్రధాని

విజయవాడలో సైకో ప్రేమికుడు వీరంగం.. ఏం చేశాడంటే?

తిరుపతిలో ముగ్గురు వైద్యులపై ఉన్నతాధికారులు వేటు

ఏకపక్షంగా 14 ఆదేశాలా.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై వైఎస్ షర్మిల ఫైర్!

దేశంలో తొలిసారి ఏపీలో 3 డీ హౌసింగ్ ప్రాజెక్ట్.. సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి శంకుస్థాపన, జగన్‌పై విసుర్లు!

కదలికలు తెలుసుకుంటున్నారు.. మా వాళ్లను ట్రాప్ చేశారు, కేతిరెడ్డి పెద్దారెడ్డి హాట్ కామెంట్స్

జీడిపప్పుపై నాణ్యత పరీక్షలు.. తిరుమల నుంచి 12 టన్నుల వెనక్కి, అసలు ఏం జరిగింది?

Big Stories

Advertisement
×