EPAPER

AP, TG CM on Fake News & Trolls: ఫేక్ ప్రచారాలు మానుకోకపోతే.. తాటతీస్తాం

AP, TG CM on Fake News & Trolls: ఫేక్ ప్రచారాలు మానుకోకపోతే.. తాటతీస్తాం

చూశారుగా.. ఫేక్ మార్ఫింగ్ ముఠాలకు తెలుగు రాష్ట్రాల సీఎంల స్ట్రాంగ్ వార్నింగ్. అవును ఇప్పుడు పొలిటికల్ రివేంజ్ లలో భాగంగా కొందరు రెచ్చిపోయి సోషల్ మీడియాలో ఏదైనా చెల్లుతుందన్న ఉద్దేశంలో ఉంటున్నారు. దానికి భావ ప్రకటన స్వేచ్ఛ అనే ట్యాగ్ తగిలిస్తున్నారు. భావ ప్రకటన స్వేచ్ఛపై గతంలో సుప్రీం కోర్టు తీర్పులు స్పష్టంగా ఉన్నా.. ఒక దశ దాటితో అవతలి వారికి ఇబ్బందులే. సో ఈ సబ్జెక్ట్ కు రెండువైపులా పదునే అన్నట్లుగా పరిస్థితి ఉంది. కానీ సోషల్ మీడియా ముసుగులో ఏదైనా చెల్లుతుంది. ఏ టైటిల్ అయినా పెట్టుకుంటాం. అందరినీ తప్పుదోవ పట్టిస్తాం.. క్యారెక్టర్ హసాసినేషన్ చేస్తాం అంటే ఇకపై కుదరదు అంటున్నారు తెలుగు రాష్ట్రాల సీఎంలు.

తాజాగా కలెక్టర్ల సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు ఓ వీడియో క్లిప్ అందరికీ చూపించి మరీ క్లారిఫికేషన్ ఇచ్చారు. అటు మొన్నటికి మొన్న అసెంబ్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా మంత్రి సీతక్క విషయంలో తయారు చేసిన వీడియోలపై తీవ్రస్థాయిలో గరం అయ్యారు. పొలిటికల్ ప్రత్యర్థులు చేసే ఫేక్ ప్రచారాలను చూస్తూ ఊరుకోబోమన్నారు. తాజాగా కలెక్టర్ల సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చాలా అంశాలపై చర్చించారు. ఇందులో ప్రధానంగా పొలిటికల్ రైవల్రీ గురించి ఫోకస్ పెట్టారు. ప్రత్యర్థి పార్టీల వాళ్లు సోషల్ మీడియాను ఎలా వాడుకుంటున్నారు. ఎలాంటి అసత్య ప్రచారాలకు తెగబడుతున్నారన్న విషయంపై మాట్లాడారు.


పోలీస్ చొక్కా పట్టుకున్న టీడీపీ కార్యకర్త అన్నట్లుగా ప్రొజెక్ట్ చేసిన న్యూస్ వీడియోను కలెక్టర్లందరికీ చూపిస్తూ.. అసలు విషయం చెప్పారు. వదలండి అన్నది మాత్రమే ఉంటే మరోలా ప్రొజెక్ట్ చేసి చూపించిన విషయాన్ని చెప్పారు. ఇలాంటి వాటిని వెంటనే కౌంటర్ చేయకపోతే ప్రమాదమన్నారు. సో ఇలాంటి ఫేక్ ఫెల్లోస్ ను ఉపేక్షించేదే లేదని కలెక్టర్ల సమావేశంలో గట్టిగానే చెప్పారు చంద్రబాబు. ప్రత్యర్థులను రాజకీయంగా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండబోదన్నారు. అయితే తప్పు చేసిన వారిని వదిలి పెట్టేది లేదని క్లారిటీ ఇచ్చారు ఏపీ సీఎం. ప్రజాస్వామ్యంలో ఇలాంటివి చేయాలంటే భయపడేలా చేస్తామని గుర్తు చేశారు. చేయాల్సిన దుష్ప్రచారం అంతా చేసి తప్పించుకుంటే ప్రభుత్వ అసమర్థత అవుతుందన్న విషయాన్ని కలెక్టర్ల దృష్టికి సీఎం తీసుకొచ్చారు.

Also Read: డిప్యూటీ సీఎం పవన్‌కు సీఎం చంద్రబాబు న్యూ టాస్క్..

రాజకీయ ప్రత్యర్థులు చేసే విష ప్రచారాల గురించి సీఎం చంద్రబాబు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పారు. ప్రతిపక్ష నేత పేరు ప్రస్తావించకుండానే.. మొన్నటికి మొన్న ఢిల్లీ వెళ్లి 36 మందిని చంపేశారని ధర్నాలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. FIR లు ఇవ్వమని అసెంబ్లీలోనే అడిగితే ఇవ్వలేదన్నారు. రాజకీయాలు మారాయని ఆ విషయాన్ని కలెక్టర్లంతా గమనించాలని సూచించడం ద్వారా భవిష్యత్ లో ఈ ఫేక్ ప్రచారాలకు ఎలా చెక్ పెట్టబోతున్నదీ క్లారిటీగా చెప్పారు. రాజకీయ నాయకులు పేపర్లు, టీవీలు పెట్టుకుని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసి ప్రభుత్వాన్ని తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తే ఇకపై ఉపేక్షించేది లేదని గట్టిగానే చెప్పేశారు.

అంతేకాదు.. ఏపీ అసెంబ్లీలో శాంతిభద్రతలపై శ్వేతపత్రాన్ని విడుదల చేసిన సందర్భంగా ఏపీ సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం పొలిటికల్ విక్టిమైజేషనే కాదు.. ఆడబిడ్డలను ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేస్తే ఏం చేయొచ్చో.. చేసి చూపిస్తాం అన్నారు. సోషల్ మీడియా ట్రోలింగ్స్ కంట్రోల్ చేయడానికి ప్రత్యేక విభాగం పెడతామన్నారు. కక్ష సాధింపు ఆలోచన పక్కన పెట్టాలని, బాధ్యతతో వ్యవహరించాలని, ప్రజలకు సేవ చేయాలంటూ సూచనలు చేశారు. పైకి చాలా సాఫ్ట్ గా చెప్పినట్లు కనిపించినా.. సీఎం ఈ విషయంలో ఫుల్ క్లారిటీతో ఉన్నారు. ఫేక్ ఫెల్లోస్ ని కంట్రోల్ చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పడం కీలకంగా మారింది. మరి ఏపీలో తర్వాతి రాజకీయాలు ఎలా ఉంటాయన్నది చూడాలి.

 

Related News

Mumbai actress kadambari case: ముంబై నటి జెత్వానీ కేసు.. తొలి విడత ఇద్దరిపై వేటు, రెండో విడతలో..

Ys jagan: బాబుపై జగన్ వెటకారం..కాస్త ఎక్కువైంది గురూ

Prakasam Barrage boat incident: ప్రకాశం బ్యారేజ్ బోట్ల కుట్ర రివీల్.. కొత్త విషయాలు బయటపెట్టిన టీడీపీ, కాకపోతే..

Pongal Train Tickets Reservation: హాట్ కేకుల్లా సంక్రాంతి ట్రైన్ టికెట్స్.. నిమిషాల్లో రిజర్వేషన్ క్లోజ్!

Car Accident: అతి వేగం.. ఏడు పల్టీలు కొట్టిన కారు, ఆ తర్వాత..

CM Chandrababu Pays Tribute: సీతారాం ఏచూరి పార్థివ దేహానికి సీఎం చంద్రబాబు నివాళులు.. సిద్ధాంతాలకు కట్టుబడే వ్యక్తి

Andhra Woman In Kuwait Torture: ఆంధ్రా యువతిపై కువైట్ లో లైంగిక వేధింపులు.. సెల్ఫీ వీడియో ద్వారా బాధితురాలి ఫిర్యాదు..

Big Stories

×