E-Paper
Advertisement

పేపర్ లీక్ అంటూ కుట్ర రాజకీయాలు.. కోర్టు చీవాట్లు పెట్టినా, అరాచకాలను సహించబోమన్న సీఎం చంద్రబాబు

పేపర్ లీక్ అంటూ కుట్ర రాజకీయాలు.. కోర్టు చీవాట్లు పెట్టినా, అరాచకాలను సహించబోమన్న సీఎం చంద్రబాబు
Advertisement

Chirala: ఏడాదిన్నర తర్వాత డీఎస్సీ పేపర్ లీక్ అంటూ కుట్ర రాజకీయాలు వైసీపీ చేస్తోందని ఆరోపించారు సీఎం చంద్రబాబు. ఈ విషయంలో కోర్టు చీవాట్లు పెట్టినా మళ్లీ ధర్నాలు చేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని దుయ్యబట్టారు. అభివృద్ధిని అడ్డుకున్న అరాచక శక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమన్నారు. ప్రజల కోసం కఠిన చర్యలు తీసుకునేందుకు వెనుకాడమన్నారు. గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌లు, నేరాలు-ఘోరాలు చేసే వ్యక్తుల్ని ప్రోత్సహిస్తున్నారని ఘాటుగా విమర్శించారు.

వైసీపీపై విరుచుకుపడిన సీఎం చంద్రబాబు

అద్భుతమైన నగరం ఉండాలనే అమరావతిని నిర్మిస్తున్నామని, వేగంగా జరుగుతున్న పనులు చూసి రాజధాని అమరావతిపై మళ్లీ కుట్రలు పన్నుతున్నారని అన్నారు ముఖ్యమంత్రి. మావిగన్, వాటికన్ అంటూ ఏవోవో కబుర్లు చెబుతున్నారని ఆరోపించారు. మళ్లీ మూడు ముక్కలాట కావాలా? రాజధానిని విధ్వంసం చేసుకుంటామా? దేశంలో ఏ రాష్ట్రమైనా తమ రాజధానుల గురించి ఘనంగా చెప్పుకుంటాయని, గత పాలనలో రాజధాని లేకుండా చేశారన్నారు. కుటుంబానికి ఇల్లు ఎలాంటిదో, రాష్ట్రానికి రాజధాని అలాంటిదన్నారు.

చీరాలలో నేతన్న సేవలో పథకంలో సీఎం చంద్రబాబు

Advertisement

శుక్రవారం చీరాలలో నేతన్న సేవలో పథకం ప్రారంభించారు సీఎం చంద్రబాబు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ఆగస్టు 13న రాజధానిలో ప్రధాన రాజమార్గం సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభం అవుతుందన్నారు. గత ప్రభుత్వం రాష్ట్ర పరువు తీసిందని విమర్శించారు. ఏపీ బ్రాండ్ ఇమేజ్‌ను దారుణంగా దెబ్బతీసిందన్నారు. మళ్లీ కూటమి వచ్చాక ఏపీ బ్రాండ్‌ను పునరుద్ధరించామని వివరించారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చి పరిశ్రమల్ని ఏర్పాటు చేయిస్తున్నామని వివరించారు.

ఇవీ వైసీపీ రాజకీయలు-సీఎం

అదే సమయంలో వైసీపీ చేస్తున్న పనులు ఈ సందర్భంగా ప్రస్తావించారు సీఎం చంద్రబాబు. యాక్సిడెంట్ చేస్తే గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తీసుకెళ్లాలని, కానీ ఆధారాలు తారుమారు చేసి వ్యక్తులను మార్చేసి కుట్రలు చేసి కేసు మాఫీకి ప్రయత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 44 ఏళ్ల వ్యక్తి చనిపోతే ఇబ్బందేమిటని మాట్లాడుతున్నారని, ఇదెక్కడి విడ్డూరని అన్నారు. పరామర్శల పేరుతో గంటల పాటు రోడ్లను నిర్బంధించేసి వెకిలి చేష్టలు చేస్తున్నారని, శాంతి భద్రతలను కాపాడే ఓ మహిళా పోలీసు అధికారి విషయంలో అసభ్యంగా ప్రవర్తించారని చెప్పారు.

Advertisement

మహిళా పోలీసుల అధికారులను గొడ్డలి గ్యాంగ్ వేధిస్తోందని, ఈ విషయంలో ప్రజలు చైతన్యంతో వ్యవహరించాలన్నారు. పొగాకు రైతులను పలకరించేందుకు వెళ్లి అరాచకం సృష్టించారని, రౌడీయిజం చేస్తూ రప్పా రప్పా అంటూ రోడ్డుపైకి వచ్చి అడ్డం పడుతున్నారని చెప్పుకొచ్చారు. బ్రాందీ షాపుల్లో మద్యం తాగి బట్టలు విప్పి అరాచకం సృష్టిస్తున్నారని అన్నారు. ఓ దుకాణాన్ని ధ్వంసం చేశారని, వీళ్ల కుమ్ములాటలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి చనిపోయారని అన్నారు. సభ్యతగా వ్యవహరించాల్సిన కొన్ని రాజకీయ పార్టీలు అసభ్యంగా-బాధ్యతా రాహిత్యంతో ప్రవర్తిస్తున్నాయన్నారు. గత పాలనలో అంతా అరాచకం రాజ్యం ఏలిందని, ఇప్పుడు ప్రజలకు ఆ పరిస్థితి లేదన్నారు.

ALSO READ:ప్రజలను ఇబ్బంది పెడితే తోలు తీస్తాం.. వైసీపీ నేతలపై విరుచుకుపడ్డ పట్టాభి

చీరాల కర్చీఫ్‌లు ఒకప్పుడు విదేశాలకు ఎగుమతి చేసేవారని, మినీ ముంబైగా వర్ణించేవారని అన్నారు. అనేక చేనేత ఉత్పత్తులకు గుర్తింపు తీసుకొచ్చారని, దాదాపు 1.27లక్షల మంది ఈ రంగంపై ఆధారపడ్డారన్నారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా.. నేత కార్మికులు టీడీపీకి ఓటు వేశారని, సబ్సిడీపై చేనేతలకు విద్యుత్‌ ఇస్తామన్నామన్నారు. చేనేతలకు 50 ఏళ్లకే పింఛన్‌ ఇస్తున్నామని, ఉప్పాడలో ప్రత్యేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టు, మంగళగిరిలో హ్యాండ్లూమ్‌ పార్క్‌ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. చేనేతలకు రూ.25వేలు ఇస్తున్నామని, ఎన్డీయే ప్రభుత్వం బీసీలకు రుణపడి ఉందని, తప్పకుండా మీ రుణం తీర్చుకుంటామని మనసులోని మాట బయటపెట్టారు.

Related News

ప్రజలను ఇబ్బంది పెడితే తోలు తీస్తాం.. వైసీపీ నేతలపై విరుచుకుపడ్డ పట్టాభి

శ్రీకాకుళం జిల్లాలో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన గూడ్స్ రైలు, నిలిచిన రాకపోకలు!

చురుగ్గా నైరుతి రుతుపవనాలు.. ఏపీ-తెలంగాణల్లో వర్ష సూచన, ఆ జిల్లాలకు అలర్ట్

కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో వైసీపీ ఎంపీల భేటీ.. ఏపీ ప్రభుత్వంపై సంచలన ఫిర్యాదులు!

100 సార్లు అరెస్ట్ చేసినా తగ్గేదేలే.. ప్రజలే బుద్ధి చెప్తారు.. ఏపీ సర్కార్‌పై అంబటి ఫైర్!

ఏపీ కోఆపరేటివ్ బ్యాంకుల్లో 338 ఉద్యోగాలు..అప్లికేషన్ గడువు పెంపు

రప్పా రప్పా నాటకాలకు చెక్ పెడతాం.. వైఎస్ జగన్‌పై హోం మంత్రి అనిత ఫైర్!

Big Stories

Advertisement
×