E-Paper
Advertisement

CM Chandrababu: ఆ ఘటన నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది: సీఎం చంద్రబాబు

CM Chandrababu: ఆ ఘటన నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది: సీఎం చంద్రబాబు
Advertisement

Four People died in One Family: ఏపీలోని నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం చిన్నవంగలి గ్రామంలో చోటు చేసుకున్న ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మట్టె మిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురు మృతిచెందారు. ఈ ఘటన తీవ్ర ఆవేదనకు గురిచేసిందని చెప్పారు చంద్రబాబు. ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో కుటుంబంపై అర్ధరాత్రి మట్టిమిద్దె కూలడంతో తల్లపురెడ్డి గురుశేఖర్ తోపాటు ఆయన భార్య, ఇద్దరు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. గురుశేఖర్ రెండో కుమార్తె ప్రసన్న ప్రొద్దుటూరులో పదవ తరగతి చదువుతున్నది. రాత్రికి రాత్రి కుటుంబంలో తల్లిదండ్రులు సహా తోబట్టువులు మృతిచెందడంతో ప్రసన్న అనాథ అయ్యింది.

Also Read: ప్రముఖ భరత నాట్య నృత్యకారిణి యామినీ కన్నుమూత

Advertisement

ఈ ఘటనపై పూర్తి సమాచారం తెప్పించుకున్న సీఎం చంద్రబాబు.. ప్రసన్నకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం తరఫున రూ. 10 లక్షల సాయాన్ని ప్రకటించారు. ప్రస్తుతం ప్రసన్న తన నాయనమ్మ సమక్షంలో ఉంటుందని సీఎం చంద్రబాబుకు అధికారులు తెలిపారు. ప్రసన్న పేరుతో రూ. 10 లక్షలు డిపాజిట్ చేయాలని, అదేవిధంగా వృద్ధురాలైన నాగమ్మకు రూ. 2 లక్షల సాయం అందించాలంటూ అధికారులను ఆయన ఆదేశించారు. జిల్లా అధికారులు ఆ బాలికను కలిసి ఆమెకు ధైర్యం చెప్పాలని సూచించారు. అదేవిధంగా పార్టీ పరంగా కూడా ప్రసన్నకు బాసటగా ఉంటాన్నారు. బాలిక సంరక్షణ, విద్య విషయంలో పార్టీ నుంచి కూడా అండగా ఉంటూ చంద్రబాబు తెలిపారు.

Related News

సాయికృష్ణ కేసులో ట్విస్ట్.. అశోక్, వెంకటరాజు కస్టడీపై కోర్టు ఏం చెప్పిందంటే?

టీడీపీ పార్టీలో చేరాక తొలిసారి స్పందించిన చిన్న శ్రీను.. ఏమన్నారంటే?

బడికి పంపితే బానిస పనులా.. పిఠాపురం స్కూల్లో విద్యార్థులతో వెట్టిచాకిరీ కలకలం

బోరున ఏడ్చిన బొత్స సత్యనారాయణ.. ఈ సారి ఎందుకంటే?

ప్రజాస్వామ్యం ఖూనీ.. స్కామ్‌ల వల్ల ‘కాక్రోచ్లు’ పుట్టుకొస్తారు-మాజీ సీఎం జగన్

మంటల్లో ట్రావెల్ బస్సు.. స్పాట్‌లో 19 మంది, తిరుపతి జిల్లాలో ఘటన

బీసీల విషయంలో టీడీపీ భారీ స్కెచ్.. 80 కులాలపై పల్లా కీలక ప్రకటన!

చంద్రబాబును అరెస్ట్ చేసి మూడేళ్లు.. లోకేశ్ ఏమన్నారంటే?

Big Stories

Advertisement
×