E-Paper
Advertisement

జగన్‌ని ఓ రేంజ్‌లో ఆడేసుకున్న సీఎం చంద్రబాబు.. సర్వే వివరాలు వైసీపీలో వణుకు మొదలు

జగన్‌ని ఓ రేంజ్‌లో ఆడేసుకున్న సీఎం చంద్రబాబు.. సర్వే వివరాలు వైసీపీలో వణుకు మొదలు
Advertisement

Repalle: రాష్ట్రంలో అసలు ప్రతిపక్షం అనేది లేకుండా పోయిందన్నారు సీఎం చంద్రబాబు. ఆ దెబ్బతో అలిగి అసెంబ్లీకి రావడం మానేశారని ఓ ఆట ఆడేసుకున్నారు. అయినా పర్వాలేదని భావించామని, ప్రజలే మాకు ప్రతిపక్షమన్నారు. అసలు రాష్ట్రంలో వేరే పక్షం లేకుండా ప్రజలు చేశారన్నారు.

దీనివల్ల నాకు శక్తి పెరిగిందని, ప్రభుత్వానికి ఎక్కువ సమయం కేటాయించడం అవుతుందన్నారు. ప్రతి నిమిషం మీ కోసం పని చేస్తున్నామన్నారు. ఇటీవల కొన్ని సర్వేలు చూశామని, అపోజిషన్ పార్టీ పరపతి కిందకు పోయిందని, ఎన్డీయే పరపతి పైపైకి వెళ్తోందని ఓ రేంజ్‌లో ఆడుకున్నారు. గురువారం ఉమ్మడి గుంటూరు జిల్లా రేపల్లెలో జరిగిన ‘పేదల సేవలో’ కార్యక్రమానికి హాజరయ్యారు సీఎం చంద్రబాబు.

Advertisement

ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, గుజరాత్‌‌లో ఒకే ప్రభుత్వం కంటిన్యూ గెలుస్తూ వస్తోందని, ఇప్పుడు దేశంలో ఆ రాష్ట్రం నెంబర్ వన్‌గా నిలిచిందన్నారు. ఒకే పార్టీ ప్రభుత్వంలో ఉండడం వల్ల టాప్ పొజిషన్‌లో ఉందన్నారు. ఇవాళ మీరు చూపించే అభిమానం శాశ్వతంగా ఉండాలన్నారు. అప్పుడు ప్రపంచంలో తెలుగు జాతి నెంబర్ వన్ అవుతుందని కుండబద్దలు కొట్టేశారు.  సీఎం అంటే సెక్రటేరియేట్‌లో కూర్చోవడం కాదని, కామన్ మ్యాన్‌లా ఉండాలని, ప్రజల మధ్య ఉండాలన్నారు. వారి అవసరాలు, కష్టాలు తెలుసుకుని వాటిని పరిష్కారం చేయాలన్నారు.

అవసరమైతే ప్రభుత్వ విధానాలు మార్చి పేదల వారికి న్యాయం చేయడం బాధ్యతగా భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అందుకే నెలకు నాలుగు సార్లు మీ దగ్గరకు వస్తున్నట్లు వివరించారు. పేదల ఆర్థిక భద్రత కల్పించే పించన్లు పంపిణీ కార్యక్రమం, 9న భూ సమస్యల కోసం వస్తున్నట్లు వివరించారు. మార్చి నాటికి భూసమస్యలను పరిష్కారిస్తామన్నారు. ఈ విషయంలో నియోజకవర్గం ఎమ్మెల్యే, మంత్రిని మనస్ఫూర్తిగా అభినంధిస్తున్నట్లు వెల్లడించారు.

Advertisement

గత ప్రభుత్వం రోడ్లపై గుంతలు తవ్వారని, మేము వచ్చి పూడ్చామన్నారు. నెక్ట్స్ లెవల్లో గేర్ మారుస్తామన్నారు. గుంతలు లేని రోడ్లు ఏర్పాటు చేయడమే మా లక్ష్యమన్నారు. త్వరలో రోడ్డు డాక్టర్ కూడా వస్తున్నట్లు వివరించారు. రాష్ట్రంలో వర్షాలు లేకపోవడంతో గొడ్డలి పార్టీ ఆనందం పడిందని, తాను వరుణ దేవుడ్ని ప్రార్థించిన 24 గంటల్లో 27 సెంటీమీటర్లు వర్షం నమోదు అయ్యిందన్నారు. సంకల్పం మంచిదైతే దేవుడు మనతో ఉంటారని చెప్పారు.

సైబరాబాద్ కంటే అమరావతి మెరుగైన నగరంగా రూపుదిద్దుకుంటుందని పేర్కొన్నారు. రాజధానిగా అమరావతిని అంగీకరించారని, ఆ తర్వాత మూడు రాజధానులు తెరపైకి తెచ్చారన్నారు. అమరావతిని ఎడారి, శ్శశానం అని రకరకాలు మాటలు ఆడారని, ముక్కోటి దేవతలు కాపాడారని గుర్తు చేశారు. అమరావతిని ఒక్క ఇంచీ కదపలేరని, ఒకవేళ కదపాలని భావిస్తే, మసై పోతారన్నారు.

Related News

హైకోర్టులో వైసీపీకి ఊహించని షాక్..ఆరు వారాల్లోపు స్థానికసంస్థల ఎన్నికలు, బీసీల రిజర్వేషన్లపై జీవోల కొట్టివేత

జగన్.. అసలు ‘రెడ్డి’ కాదు.. విజయసాయి సంచలన వ్యాఖ్యలు

బాంబు పేల్చిన విజయసాయిరెడ్డి.. కాంగ్రెస్‌తో ఎన్నికలకు జగన్, నా ప్రమేయం ఏ మాత్రం లేదు

మల్లం బ్రహ్మోత్సవాల్లో తీవ్ర విషాదం.. వేడి సాంబారు పడి 12 మందికి గాయాలు

మరో వివాదంలో ఎమ్మెల్యే కొలికపూడి.. ఏకంగా టీచర్‌ వ్యవహారం, రాష్ట్ర అధ్యక్షుడికి ఫిర్యాదు

ఏపీలో ప్రజలకు బిగ్ రిలీఫ్.. కేజీ ఉల్లి కేవలం రూ.35, వాటిలో ఏది ఉన్నా సరిపోతుంది

కత్తితో యువకుడి ప్రైవేటు పార్ట్స్ కట్ చేసి.. ఆ తర్వాత ఏం చేశారంటే, నరసారావుపేటలో ఘోరం

Big Stories

Advertisement
×