National holiday June 6: కేంద్ర ప్రభుత్వం జూన్ 6న దేశ వ్యాప్తంగా సెలవు ప్రకటించింది. ఈ నిర్ణయం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలుకానుంది. విద్యా సంస్థలు, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు, వివిధ ప్రభుత్వ రంగ సేవా సంస్థలు మూతపడనున్నాయి. దేశ వ్యాప్తంగా ప్రజలు సెలవుకు అనుగుణంగా తమ ప్రణాళికలను రెడీ చేసుకోవాలని కేంద్రం సూచించింది.
⦿ పాఠశాలలు, కళాశాలలు:
అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థలు మూసివేయబడతాయి. రీషెడ్యూల్ చేయబడిన తరగతులు, పరీక్షలకు సంబంధించి విద్యార్థులు, తల్లిదండ్రులు తమ విద్యా సంస్థలు విడుదల చేసిన ఏవైనా నిర్దిష్ట సూచనలను పాటించాలని కేంద్రం సూచించింది.
⦿ బ్యాంకింగ్ సేవలు:
అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు జూన్ 6న కార్యకలాపాలను నిర్వహించవు. అయితే, ATM, ఆన్ లైన్ బ్యాంకింగ్ సేవలు యథావిధిగా పనిచేస్తాయి. డిజిటల్ పద్దతిలో అవసరమైన లావాదేవీలను పూర్తి చేసుకోవచ్చు. ఎక్కువ మొత్తంలో క్యాష్ కావాలంటే ఇవాళే బ్యాంకుకు వెళ్లడం ఉత్తమం.
⦿ ప్రభుత్వ కార్యాలయాలు:
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూసివేయబడతాయి. హెల్త్, ఫైర్, పోలీస్, జ్యుడీషియరీ లాంటి అత్యవసర సేవలు మాత్రమే కొనసాగుతాయి.
⦿ ప్రైవేట్ రంగం, కార్పొరేట్లు:
ప్రభుత్వ కార్యాలయాలు మూసివేయబడినప్పటికీ, ప్రైవేట్ కంపెనీలు తెరిచి ఉంచాలా? వద్దా? అని వ్యక్తిగతంగా నిర్ణయించుకోవచ్చు. ఉద్యోగులు సంబంధిత HR విభాగాలను అడిగి నిర్ణయం తీసుకోవాలి.
⦿ రవాణా, యుటిలిటీస్:
ప్రజా రవాణా విషయంలో కొంత వెసులుబాటు ఉంటుంది. సాధారణ రోజులతో పోల్చితే కాస్త తక్కువగా వాహనాలు నడిచే అవకాశం ఉంటుంది. రేపు ప్రయాణాన్ని ప్లాన్ చేసుకునే వాళ్లు ముందుగా స్థానిక రవాణా ప్రకటనలను తనిఖీ చేయడం మంచిది.
ఇంతకీ జూన్ 6న సెలవు ఎందుకంటే?
జూన్ 6న ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించడానికి అధికారిక కారణం బక్రీద్. ఆ రోజు దేశ వ్యాప్తంగా ముస్లీంపలు ఈ పర్వదినాన్ని జరుపుకుంటారు. అందుకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
ప్రజలు ఏం చేయాలంటే?
జూన్ 5 సాయంత్రం నాటికి ఏదైనా బ్యాంకింగ్, అధికారిక పనులు ఉంటే పూర్తి చేసుకోండి. వైద్య నియామకాలు, ప్రయాణ ప్రణాళికలు ఉన్నవారు ఆసుపత్రులు, క్లినిక్‌లు, ట్రావెల్ ఆపరేటర్లతో రేపటి సర్వీసుల గురించి తెలుసుకోండి. విద్యార్థులు షెడ్యూల్, పరీక్షలలో మార్పుల గురించి పాఠశాలలు, విశ్వవిద్యాలయాల నోటిఫికేషన్ ను చూడండి. సెలవు దినాన్ని విశ్రాంతి తీసుకోవడానికి, కుటుంబంతో సమయం గడపడానికి లేదంటే వ్యక్తిగత పనుల కోసం ఉపయోగించుకోండి.
Read Also: ప్రపంచంలోనే అతి చిన్న రైలు.. దీని పైకెక్కి మరి ప్రయాణించవచ్చు!
ఒక్క రోజు లీవ్ పెడితే 3 రోజులు సెలవు
జూన్ 6న కేంద్ర ప్రభుత్వం హాలీడే ఇచ్చింది. శనివారం నాడు లీవ్ పెట్టుకుంటే, ఆదివారం కూడా సెలవు ఉంటుంది. వరుసగా మూడు రోజులు ఎంజాయ్ చెయ్యొచ్చు. సో, ఇంకెందుకు ఆలస్యం వెంటనే శనివారం లీవ్ లెటర్ రెడీ చేసుకోండి! మూడు రోజులు ఎంజాయ్ చేయండి!
Read Also: తక్కువ ఖర్చుతో విమాన ప్రయాణం చేయాలా? సింపుల్ గా ఈ టిప్స్ పాటించండి!