Illu Illalu Pillalu Today Episode may 18th: నిన్నటి ఎపిసోడ్ లో.. నర్మదా ట్రైనింగ్ కోసమని హైదరాబాద్ కి సాగర్ తో కలిసి వెళుతుంది. ఇక ధీరజ్ ఎలాగైనా సరే వచ్చే నెల నుంచి వాళ్ళ నాన్నకి పదివేలు ఇవ్వాలని పార్ట్ టైం జాబ్ చేస్తాడు. ఫుడ్ ని డెలివరీ చేస్తూ ఉంటాడు. అయితే ఒక కస్టమర్ మాత్రం అడ్రస్ చెప్పడానికి విసుక్కుంటాడు. నేను ఆల్రెడీ అడ్రస్ కరెక్ట్ గా చెప్పాను కరెక్ట్ గా పెట్టాను నువ్వు అలానే రా అనేసి ఫోన్ పెట్టేస్తాడు. చివరికి ఎలాగోలా ఆ డ్రెస్ ని కనుక్కొని ధీరజ్ అక్కడికి వెళ్ళగానే ఆ కస్టమర్ నేను ఏ టైం కి నీకు ఆర్డర్ పెట్టాను నువ్వు ఏ టైం కి డెలివరీ చేస్తున్నావు అని సీరియస్ అవుతాడు..
ఇంట్లో గొడవలు పడి డబ్బులు ఇవ్వడం ఆపేస్తే ఇలా పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ బతుకుతున్నారు మీకు ఎంత పొగరు.. నువ్వు ఇంత లేటుగా తీసుకొచ్చినందుకు నీకు జీరో రేటింగ్ ఇచ్చి కంప్లైంట్ చేస్తాను అని అంటాడు. అలా అయితే జాబ్ పోతుందని ధీరజ్ కస్టమర్ తో మర్యాదగా మాట్లాడి క్షమాపణ చెప్తాడు. కస్టమర్ అన్న మాటలు తలుచుకొని మా నాన్న చెప్పిన మాటలు నాకు ఇప్పుడు అవసరం అవుతున్నాయి. ఆయన జీవితం గురించి ఎంతో నేర్పించాడు అని ధీరజ్ వాళ్ళ నాన్నని పొగిడేస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ప్రోమో విషయానికొస్తే.. నిన్న ప్రేమ ట్యూషన్ పెట్టడానికి ధీరజ్ ఒప్పుకుంటాడు. ఏం చేస్తున్నావ్ ఇంట్లో వాళ్లకు అమర్యాదగా అనిపించేలా చేయకు అని సలహా ఇస్తాడు. నేను ట్యూషన్ మాత్రమే చెప్తున్నాను అంతేకానీ నేను ఇంకేమీ తప్పు చేయట్లేదు అని ప్రేమ అంటుంది. నువ్వు సపోర్ట్ చేస్తున్నావ్ కదా చాలు ఇకమీదట ఎవరిని పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు అని ధీరజ్ పై తన ప్రేమను చూపిస్తుంది ప్రేమ.
ఇక వేదవతి ఎందుకో తెలియదు అని ఎదురుగా కూర్చొని దిగిలుపడుతుంది. ఏమైందో అత్తయ్య అంత దిగులు పడుతున్నారు అంటే ఏం లేదు ఏదో కోల్పోయిన నన్ను ఫీలింగ్ కలుగుతుంది అని ప్రేమతో అంటుంది. మీరు ఇంత దిగులుగా ఉండడానికి కారణం నర్మదా అక్కే.. అక్క మీకు దూరంగా వెళ్లిపోయింది కదా అందుకే మీరు ఇలా ఫీల్ అవుతున్నారు అని ప్రేమ అంటుంది.. అందుకేనా సుమీ నాకు ఏందో ఇందాక నుంచి ఎవర్నో కోల్పోయిన అంత ఫీలింగ్ వస్తుంది అని అంటుంది. మీకు అక్క మీద ఉన్న ప్రేమ అక్క మీ మీద చూపిస్తున్న అభిమానం అంతే కదా అని అంటుంది.
మరి ఆలస్యం ఎందుకు అక్కకు ఒకసారి ఫోన్ చేయండి అని ప్రేమ తన ఫోన్ ఇస్తుంది. వేదవతి నర్మదకు ఫోన్ చేస్తుంది. ప్రేమ చెప్పు అని అనగానే ప్రేమ గాదు వేదవతి అని అంటుంది. అత్తయ్య గారు మీరా ఏంటి నేను లేనని బెంగ పెట్టుకున్నారా? దిగులు పట్టుకున్నారా? అందుకే ఫోన్ చేశారా అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది నర్మదా.. నీ మీద బెంగతో ఏమి కాదు దూరంగా వెళ్లిపోయారు కదా తిన్నారో లేదో అని కనుక్కుందామని ఫోన్ చేశాను అని వేదవతి అంటుంది. పక్కనే ఉన్న శ్రీవల్లి వీళ్ళని చూసి కుళ్ళుకుంటుంది. ఎలాగైనా సరే అత్తయ్యకు ఇద్దరు కోడల్ని దూరం చేయాలి అని కంకణం కట్టుకుంటుంది.
ఇక తర్వాత రోజు ప్రేమ అనుకున్నట్లుగానే ట్యూషన్ ని మొదలు పెడుతుంది. ధీరజ్ రాగానే నేను ట్యూషన్ ని మొదలు పెట్టాను ధీరజ్ అని గొప్పగా చెప్పుకుంటుంది. ధీరజ్ ప్రేమను ఆట పట్టిస్తాడు. కానీ ప్రేమ తన కాళ్ళు పట్టుకోవడంతో ధీరజ్ లేదు లేదో నువ్వు మంచి సక్సెస్ సాధిస్తావు అని అంటాడు. ఇక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. సోమవారం ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..