Prashant Kishor: పొలిటికల్ స్ట్రాటజిస్టు నుంచి రాజకీయాల్లోకి అగుడు పెట్టారు పీకె అలియాస్ ప్రశాంత్ కిషోర్. ఆ ఎలాగైనా బీహార్‌ను పాలించాలని కొన్నాళ్లుగా ప్లాన్ చేస్తున్నారు. అయినా అక్కడి ప్రజలను ఆకట్టు కోలేకపోతున్నారు. తాజాగా బీపీఎస్పీ అభ్యర్థుల వ్యవహారాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే పనిలో పడ్డారు.
అభ్యర్థుల నిరసనలు, ఆపై పోలీసుల లాఠీఛార్జ్ వంటి ఘటనలతో పాట్నా ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో ఆయనపై కేసు కూడా నమోదు అయినట్టు సమాచారం. దీన్ని మరింత జఠిలం చేయాలని భావిస్తున్నారు. అభ్యర్థుల ఆవేశాలను తనకు అనుకూలంగా మార్చుకునే పనిలో పడ్డారు.
జనవరి రెండు నుంచి ఆమరణ నిరాహార దీక్షకు దిగుతున్నట్లు స్టేట్‌మెంట్ చేశారు పీకె. దీనిపై మానవహక్కుల కమిషన్‌ను ఆశ్రయిస్తానన్నారు. బీహార్ పబ్లిక్ సర్వీస్ పరీక్ష పేపర్లు లీక్‌పై పోరాటం చేస్తున్న యువతకు మద్దతు ప్రకటించారాయన. అభ్యర్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడం సరైనది కాదని వ్యాఖ్యానించారు.
రాజకీయాల్లోకి రావాలనే ఎప్పటి నుంచో వ్యూహాలు రచిస్తున్నారు ప్రశాంత్ కిషోర్. ఈ క్రమంలో బీహార్‌లో తొలిసారి ‘జన సురాజ్’ పేరిట పార్టీ పెట్టారు. ఆ తర్వాత పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. అదే సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో ఆ పార్టీ కనీసం సత్తా చాట లేకపోయింది. కొద్దిరోజులుగా నితీష్‌కుమార్‌పై రకరకాలుగా ఫైట్ చేస్తున్నా, ప్రజలను పెద్దగా ఆకట్టుకోలేదు. అభ్యర్థుల ఆందోళన అంశాన్ని ఎత్తుకున్నారు.
ALSO READ: పోలీసులపై దాడి చేసిన బిహార్ విద్యార్థులు.. ప్రశాంత్ కిషోర్‌పై కేసు నమోదు
వచ్చే ఏడాదిలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2005 నుంచి ఇప్పటివరకు బీహార్‌ను నితీష్ కుమార్ పాలిస్తున్నారు. మధ్యలో ఏడాది తప్పితే అంతా జేడీయూ పాలన కంటిన్యూ అవుతూ వచ్చింది. అయితే బీజేపీ, లేదంటే ఆర్జేడీతో జత కట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారాయన. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తనకు అనుకూలంగా మలచుకునే పనిలో పడ్డారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తాను కింగ్ మేకర్ కావాలని భావిస్తున్నారు పీకె.