Pawan On Peddireddy: కూటమి ప్రభుత్వం నుంచి వైసీపీ నేతలకు కష్టాలు రెట్టింపు అవుతున్నాయా? జగన్ టీమ్‌లో కీలక నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా? ఈసారి మాజీ మంత్రి పెద్దిరెడ్డి వంతైందా? ఆయన అటవీ భూమిని ఆక్రమించినట్టు ప్రభుత్వానికి ఎందుకు అనుమానం వచ్చింది. ఇవే ప్రశ్నలు వైసీపీ నేతలను వెంటాడుతున్నాయి.
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూములపై విచారణకు ఆదేశించింది కూటమి సర్కార్. ఉమ్మడి చిత్తూరు జిల్లా మంగళంపేట సమీపంలో అడవుల భూములను కబ్జా చేసినట్టు ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై విచారణకు ఆదేశించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
ఆయా భూములపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని అటవీ అధికారులను ఆదేశించారు. భూముల కబ్జా, రికార్డుల తారుమారులో ఎవరి పాత్రైనా ఉంది? ఎవరు లబ్ది పొందారో తేల్చాలన్నారు. సత్వరమే ప్రాథమిక నివేదిక ఇవ్వాలని పీసీసీఎఫ్‌ను ఆదేశించారు డిప్యూటీ సీఎం పవన్.
మాజీ మంత్రి పెద్దిరెడ్డి అటవీ భూములను కబ్జా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే.. ఉమ్మడి చిత్తూరు జిల్లా మంగళంపేట గ్రామం అటవీ ప్రాంతంలో సువిశాల వ్యవసాయ క్షేత్రం ఉంది. మధ్యలో విలాసవంతమైన భవనం ఉంది. అటవీ, ఎసైన్డ్ భూములను ఆక్రమించి క్షేత్రాన్ని నియమించినట్టు పెద్దిరెడ్డిపై ఆరోపణలు లేకపోలేదు.
ALSO READ: ఎమ్మెల్యే గుమ్మనూరు శివతాండవం.. కొంతమందికి వార్నింగ్
ఆ గ్రామం నుంచి మార్కెటింగ్ కమిటీ నిధులతో సొంత ఎస్టేట్‌కి తారురోడ్డు నిర్మించింది. దీనిపై రకరకాలు వార్తలు వెల్లువెత్తున్నాయి. కూటమి సర్కార్ రియాక్ట్ అయ్యింది. ఆ ప్రాంతంలో పెద్దిరెడ్డి ఫ్యామిలీకి తొలుత 24 ఎకరాల భూమి ఉండేది. ఆ తర్వాత రెండున్నర దశాబ్దాల తర్వాత దాదాపు 46 ఎకరాలకు చేరింది.
ఇప్పుడు అది కాస్త 75 ఎకరాలకు పెరిగినట్టు వార్తలు జోరందుకున్నాయి. ఆయా భూములు కాకుండా మరో 30 ఎకరాలు పెద్దిరెడ్డి ఆధీనంలో ఉందని కొందరు నేతల మాట. ఈ వ్యవహారంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఆయా భూములపై నిగ్గు తేల్చాలని విచారణకు ఆదేశించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. దీంతో పెద్దిరెడ్డి వర్గీయుల్లో టెన్షన్ మొదలైంది.