MLA Gummanur Jayaram: ఏపీ రాజకీయాల్లోని వార్తల్లో నిలిచే వ్యక్తుల్లో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఒకరు. పార్టీ ఏదైనా ఆయన వ్యవహారశైలి ఒక్కటే. తోటి నాయకులైనా, అధికారులైనా, చివరకు జర్నలిస్టులైనా తన నోటికి పని చెబుతారు. ప్రస్తుతం అదే చేశారనుకోండి. తన గురించి, ఫ్యామిలీ గురించి తప్పుడు వార్తలు రాసిన కొందరు మీడియా జర్నలిస్టులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సదరు ఎమ్మెల్యే.
వైసీపీ ప్రభుత్వంలో బాగా ఫేమస్ అయ్యారు గుమ్మనూరు జయరాం. ఆ తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టీడీపీలోకి రావడం, గుంతకల్లు నుంచి గెలవడం జరిగిపోయింది. ఆయన నియోజకవర్గంలో ఏం జరిగిందో తెలీదు. ఒక్కసారిగా ఆయన శివతాండవం చేశారు.
కొందరు మీడియా జర్నలిస్టులకు వార్నింగ్ ఇచ్చారు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం. తనపై లేనిపోని వార్తలు రాస్తే రైలు పట్టాలపై పడుకోబెడతానని మండిపడ్డారు. తనకు అన్నీ తెలుసని, తాను ఏదైనా చేస్తానని కాసింత ఆవేశంతో చెప్పుకొచ్చారు. తనపై, ఫ్యామిలీపై వార్తలు రాస్తే ఖబడ్దార్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మీడియా అంటే తనకు లెక్కలేదన్నది ఆయన మాట. తాను అన్ని చేసి వచ్చానని, ఏం రాసుకుంటారో రాసుకోండంటూ రుసరుసలాడారు. తప్పు చేస్తే రాయండి.. ఆధారాలు లేకుండా రాస్తే తాటతీస్తానని అన్నారు. కొంతమంది తనకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారని, కుటుంబ పెత్తనం ఉందని అంటున్నారు.
ALSO READ: విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇకపై ప్రతి శనివారం నో బ్యాగ్స్
భూ అక్రమాలు చేశాను అని చెబుతున్నారు.. వీటన్నింటినీ నిరూపించాలని, లేదంటే రైలు పట్టాలపై పడుకోబెట్టి చంపుతానని వార్నింగ్ కాసింత జోరు జారారు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం. ఏపీలో కూటమి సర్కార్ వచ్చి ఆరునెలలు పైగానే గడిచింది. ఇంతలోనే జయరాం ఈ స్థాయిలో ఫైరయిన సందర్భాలు లేవన్నది ఆయన మద్దతుదారుల మాట. రాబోయే రోజుల్లో ఆయన గురించి ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.
మీడియా అంటే నాకు లెక్కలేదు: ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం
తనపై లేనిపోనివి రాస్తే రైలు పట్టాలపై పడుకోబెట్టి చంపడానికైనా సిద్ధం
నేను అన్నీ చేసి వచ్చినవాడిని.. రాసుకోండి.. ఏం రాసుకుంటారో
తప్పు చేస్తే రాయండి.. ఆధారాలు లేకుండా రాస్తే తాట తీస్తా
– ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం pic.twitter.com/fTNGGkNutM
— BIG TV Breaking News (@bigtvtelugu) January 29, 2025