BigTV English

Pawan Kalyan: పవన్‌కు అస్వస్థత, ఆ సమస్య తిరగబడిందా?

Pawan Kalyan: పవన్‌కు అస్వస్థత, ఆ సమస్య తిరగబడిందా?

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష విరమణ కోసం తిరుమలకు వెళ్ళిన విషయం తెలిసిందే. అయితే ఈ రోజు రాత్రికి తిరుమలలో బస చేయనున్న పవన్ కళ్యాణ్ అలిపిరి మెట్ల మార్గం గుండా.. కాలినడకన తిరుమలకు చేరుకుంటున్నారు. ఇప్పటికే అలిపిరి నుండి కాలినడకన తిరుమలకు సాగుతున్న పవన్.. కొంత అస్వస్థతకు గురైనా.. తన కాలినడకను మాత్రం కొనసాగించడం విశేషం.


పవన్ తిరుమల పర్యటన ముందే ఖరారు కాగా.. అందుకు తగ్గ ఏర్పాట్లను అధికారులు పకడ్బందీగా చేశారు. అసలే పవర్ స్టార్.. అందులో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డును ఏర్పాటు చేయాలి.. ఆలయాలను పరిరక్షించాలి అంటూ 11 రోజుల దీక్ష చేపట్టారు. ఇంకేముంది అన్నీ దారులు అటు వైపే అన్న రీతిలో జనసైనికులు, పవన్ అభిమానులు భారీగా తిరుమలకు చేరుకున్నారు. ఇక పవన్ అలిపిరి వద్దకు చేరుకోగానే, అభిమానుల తాకిడితో ఆ ప్రాంతం కిక్కిరిసి పోయింది. వారిని నిలువరించేందుకు పోలీసులు శ్రమించాల్సి వచ్చింది.

అయితే పవన్ అలిపిరి మెట్ల మార్గం గుండా గోవింద నామస్మరణ చేస్తూ.. ముందుకు సాగారు. వేలాదిగా వచ్చిన జనసైనికులతో కలిసి పవన్ తిరుమలకు బయలుదేరగా.. ఆ ప్రాంతమంతా.. శ్రీ శ్రీనివాసుడి నామస్మరణతో మారుమ్రోగింది. కొద్ది దూరం కాలినడక చేసిన పవన్ కొంత అస్వస్థతకు గురయ్యారు. దీనికి ప్రధాన కారణం దీక్ష చేపట్టిన సమయం నుండి.. పవన్ ఆహార నియమావళి ప్రత్యేకంగా ఉండడమేనని చెప్పవచ్చు.

అంతేకాదు అభిమానులు అధిక సంఖ్యలో ఆయనను చుట్టుముట్టే ప్రయత్నం చేయడంతో.. గాలి కూడా వీయని పరిస్థితులతో కొంత పవన్ ఇబ్బందులకు గురయ్యారు. అటువంటి స్థితిలో కూడా అలిపిరి మెట్ల మార్గంలో మోకరిల్లి.. జై శ్రీరామా, గోవిందా నామాలను స్మరిస్తూ.. పవన్ ముందుకు సాగారు.

Also Read: Pawan Klayan: వైసీపీకి ఝలక్ ఇచ్చిన పవన్.. విచారణ ఎదుర్కోవాల్సిందే.. రెడీగా ఉండండి అంటూ ప్రకటన

గతంలో వారాహి దీక్షను కూడా చేపట్టిన పవన్.. దీక్షను విజయవంతంగా పూర్తి చేశారు. అదే రీతిలో ప్రాయశ్చిత్త దీక్ష సైతం విజయవంతంగా పూర్తి చేసేలా ముందుకు సాగుతున్నారు. నేడు రాత్రి తిరుమలలో బస చేసిన అనంతరం.. రేపు తిరుమల శ్రీవారిని పవన్ దర్శించుకోనున్నారు. ఏదిఏమైనా కరోనా కాలంలో పవన్ కొంత అనారోగ్యానికి గురయ్యారని, ఆ సమయంలో ఆస్తమాకు గురైనట్లు సమాచారం. అదే ఇప్పుడు తిరగబడి ఉండవచ్చని అనుకుంటున్నారు.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×