Divvala Madhuri: దివ్వెల మాధురి అంటే తెలియని వారుంటారా.. సోషల్ మీడియాలో ఈమె క్రేజ్ అటువంటిది మరి. వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వివాదం తెరేమీదికి వచ్చిన సమయంలో దివ్వెల మాధురి పేరు కూడా అనూహ్యంగా వినిపించింది. తాము కేవలం స్నేహ పూర్వక రీతిలో అనుబంధాన్ని సాగిస్తున్నామని ముందుగా తెలిపిన వీరు తిరుమల పర్యటన సమయంలో అసలు విషయాన్ని చెప్పేశారు. తమ కుటుంబ పరమైన న్యాయ సమస్యలు ఉన్నాయని, అవి పరిష్కారం కాగానే పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. ఇలా వీరిద్దరు నిత్యం వార్తల్లో ఏదో ఒక రూపంలో నిలుస్తున్నారు.
అది కూడా గాక తిరుమల పర్యటన సమయంలో దివ్వెల మాధురి రీల్స్ చేసినట్లు ఆరోపణలు రాగా, ఇటీవల పోలీసులు, మాధురి గృహానికి వెళ్లి నోటీసులు కూడా అందించారు. మాధురి స్వతహాగా మంచి నృత్యకారిణి. ఎందరో విధ్యార్థులకు డ్యాన్స్ కూడా తాను నేర్పించినట్లు పలుమార్లు మాధురి స్వయంగా తెలిపారు. అలాగే మాధురికి సోషల్ మీడియాలో క్రేజ్ కూడా అధికమని చెప్పవచ్చు. దువ్వాడ శ్రీనివాస్ ఉదంతం సమయం నుండి మాధురికి మరి కాస్త క్రేజ్ రాగా.. ఫాలోవర్స్ కూడా ఆమెకు పెరిగారనే చెప్పవచ్చు.
అయితే ఇటీవల వైసీపీ సోషల్ మీడియా యాక్టివిసస్టులపై పోలీసులు తీసుకుంటున్న చర్యల పట్ల ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురిలు స్పందించారు. ఏపీలో మహిళల వ్యక్తిగత హననానికి పాల్పడ్డ వారిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు కూడా తరలించారు. ఇటువంటి పరిస్థితుల్లో దివ్వెల మాధురి పేరిట సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ గా మారింది.
ఆ వీడియో లో నాటి రోజుల్లో మాధురి ఇలా డ్యాన్స్ చేసేవారని కూడా ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారంపై దివ్వెల మాధురితో పాటు దువ్వాడ కూడా సీరియస్ అయ్యారు. మాధురి మాట్లాడుతూ.. ఆ వీడియోలో ఉన్నది తాను కాదని, తన పేరిట ఇలా ప్రచారం చేయడం తగదన్నారు. తన పేరుపై అసత్య ప్రచారం చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేయాలని మాధురి ఓ ఇంటర్వ్యూలో కోరారు. దువ్వాడ శ్రీనివాస్ కూడా సోషల్ మీడియా వేదికగా.. మహిళల వ్యక్తిగత హననానికి పాల్పడితే సహించమని తెలుపుతున్న పోలీసులు, ఇలా ప్రచారం చేసే వారిని అరెస్ట్ చేయగలరా అంటూ ప్రశ్నించారు. మొత్తం మీద ఓ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఆ డ్యాన్సర్ మాత్రం తాను కాదంటూ మాధురి వివరణ ఇచ్చారు.