Allu Arha Birthday: అల్లు అర్జున్ ప్రొఫెషనల్ లైఫ్‌పై ఫ్యాన్స్ ఎంత ఫోకస్ చేస్తారో.. తన పర్సనల్ లైఫ్‌పై కూడా ఎప్పుడూ అంతే ఫోకస్ ఉంటుంది. తన భార్య, పిల్లలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. ముఖ్యంగా అల్లు అర్హతో అల్లు అర్జున్ ఫోటోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంటాయి. అలాంటి అల్లు వారసురాలి పుట్టినరోజు సందర్బంగా సారథి స్టూడియోస్‌లో భారీ సెట్ సిద్ధమయ్యింది. ప్రస్తుతం అల్లు అర్జున్ ‘పుష్ప 2’ షూటింగ్‌లో ఇంకా బిజీగా ఉన్నా.. అల్లు అర్హ (Allu Arha) పుట్టినరోజు కోసం ఇలా స్పెషల్ ప్లానింగ్ చేసినట్టు తెలుస్తోంది.
సెట్‌లోనే పుట్టినరోజు
అల్లు అర్జున్ (Allu Arjun) చాలాసార్లు తన సినిమా ప్రమోషన్స్ సమయంలో అల్లు అర్హను హైలెట్ చేస్తూ పలు వీడియోలు చేశాడు. ఆ వీడియోలు అన్నీ నిమిషాల్లోనే వైరల్ అయ్యాయి. తండ్రి మాత్రమే కాదు.. తన తల్లి అల్లు స్నేహ కూడా ఎప్పటికప్పుడు తన పిల్లలతో దిగిన ఫోటోలను, తమ పర్సనల్ లైఫ్‌లోని విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. అలా చాలా చిన్న వయసులోనే అల్లు అర్హకు విపరీతమైన క్రేజ్ లభించింది. అందుకే తన బర్త్ డేను కూడా ఆ రేంజ్‌లో సెలబ్రేట్ చేయాలని తన కుటుంబం నిర్ణయించుకుంది. దానికోసమే ‘పుష్ప 2’ షూటింగ్ సెట్‌లోనే బర్త్ డే కోసం భారీ ప్లానింగ్ చేసింది.
Also Read: ఏంటి బన్నీ ఇలా చేస్తావని ఊహించనేలేదు.. పవన్ ఫ్యాన్స్ దారుణమైన ట్రోల్స్..
ఇద్దరి కోసం
ప్రస్తుతం సారథి స్టూడియోస్‌లో ‘పుష్ప 2’ షూటింగ్ జరుగుతోంది. ఇక ఆ షూటింగ్ ప్యాకప్ అయిపోయిన తర్వాత అల్లు అర్హ బర్త్ డే సెలబ్రేషన్ కోసం స్పెషల్ ప్లానింగ్ జరిగింది. నవంబర్ 21న అల్లు అర్హ పుట్టినరోజు సందర్భంగా ఫ్యామిలీ అంతా కలిసి అర్థరాత్రే తనతో కేక్ కట్ చేయించారు. కానీ అల్లు వారసురాలు అంటే మినిమమ్ ఉండాలని ఏకంగా సినిమా సెట్‌లోనే బర్త్ డే కోసం స్పెషల్ సెట్‌ను ఏర్పాటు చేశారు. ఈ వేడుకల్లో మరొక స్పెషల్ కూడా ఉంది. ‘పుష్ప 2’ను భారీ రేంజ్‌లో తెరకెక్కిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ అధినేత నవీన్ యేర్నేని పుట్టినరోజు కూడా నేడే కావడంతో ఈ సెట్‌లోనే ఇద్దరి బర్త్ డే సెలబ్రేషన్స్ జరగనున్నాయి.
పాజిటివ్ బేబీ
ఇప్పటికే అల్లు అర్హ పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్, స్నేహ స్పెషల్ పోస్టులను షేర్ చేశారు. ‘నా క్యూట్, స్వీట్, పాజిటివ్ బేబీకి హ్యాపీ బర్త్ డే. నిన్ను మేము చాలా ప్రేమిస్తున్నాం’ అంటూ అల్లు అర్హకు సంబంధించిన కొన్ని స్పెషల్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది అల్లు స్నేహ. ‘నా జీవితంలోనే అతిపెద్ద ఆనందానికి హ్యాపీ బర్త్ డే. నువ్వు నా ఎనిమిదేళ్ల సంతోషానివి. నీ వల్లే నా జీవితం మరింత స్వీట్‌గా మారింది. హగ్స్, కిస్సెస్, ఇంకా ఎంతో ప్రేమతో మీ నాన్న’ అంటూ క్యూట్ క్యాప్షన్‌తో ఈ వీడియోను పోస్ట్ చేశాడు అల్లు అర్జున్.