Duvvada Srinivas – Divvala Madhuri: దివ్వెల మాధురి అంటే తెలియని వారుండరు. వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వివాదం సమయంలో మాధురి పేరు తెర మీదికి వచ్చింది. అప్పటి నుండి దువ్వాడ శ్రీనివాస్, మాధురి నిరంతరం వార్తల్లో నిలుస్తున్నారు. అలాగే తిరుమల పర్యటన సమయంలో తమకు గల న్యాయపరమైన చిక్కులు తొలగిన వెంటనే, పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా వీరిద్దరూ ప్రకటించారు.
ఇటీవల దువ్వాడ శ్రీనివాస్ బర్త్ డే ను మాధురి ఎలా నిర్వహించారో అందరికీ తెలుసు. ఏకంగా లక్షల విలువ గల వాచీని దువ్వాడ కు బహుకరించి, మాధురి షాకిచ్చారు. అలా దువ్వాడ బర్త్ డే నిర్వహించి వార్తల్లో నిలిచిన మాధురి బర్త్ డే కూడా రానే వచ్చింది. ఇంకేముంది వేడుకలు సంబరంగా జరిగాయి. దువ్వాడ శ్రీనివాస్, స్థానిక వైసీపీ నేతలు పాల్గొని మాధురికి బర్త్ డే విషెస్ చెప్పారు. అంతేకాదు విందు భోజన కార్యక్రమం కూడా నిర్వహించారు. అలాగే బహుమతులు కూడా ఊహించనంత స్థాయిలో మాధురికి వచ్చాయంటే, ఆ వేడుకలు ఎలా జరిగి ఉంటాయో ఊహించవచ్చు.
మాధురి బర్త్ డే సంధర్భంగా భారీ కేక్ ను కూడా ఏర్పాటు చేయగా, కేక్ కట్ చేసి మాధురి కేక్ ను దువ్వాడ శ్రీనివాస్ కు తినిపించారు. టెక్కలి లోని తన నివాసంలో దివ్వెల మాధురి జన్మదిన వేడుకలు జరగగా, ఆ ఇంట సందడి నెలకొంది. అయితే మాధురి బర్త్ డే సంధర్భంగా దువ్వాడ లవ్ ప్రపోజ్ చేయగా, మాధురి కూడా అదే స్థాయిలో రిప్లై ఇచ్చారు. దీనితో వీరిద్దరి ప్రేమ కబుర్లను చూసిన అక్కడి ప్రజానీకం చప్పట్లను మారు మ్రోగించారు. మాధురి బర్త్ డే సంధర్భంగా ఏర్పాటు చేసిన విందు భోజనాన్ని వారిద్దరూ కలిసి ప్రజలకు వడ్డించారు. ఈ జంట మాట్లాడితే వైరల్ అవుతుండగా, మాధురి బర్త్ డే ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే మాధురికి ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. దువ్వాడ ఉదంతం వెలుగులోకి వచ్చే వరకు అరకొర ఫాలోవర్స్ గల మాధురికి, ఆ తర్వాత ఫాలోవర్స్ కూడా భారీగా పెరిగారు. ఎన్ని విమర్శలు వచ్చినా స్ట్రాంగ్ ఉమెన్ గా వాటిని ఎదుర్కొంటూ.. ముందుకు సాగుతున్న మాధురి అంటూ నెటిజన్స్ ఆమెకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. మొత్తం మీద మాధురినా మజాకా.. బర్త్ డే వేడుకలు ఆ మాత్రం ఉండాలిలే అంటున్నారు మరి కొందరు నెటిజన్స్.
దివ్వెల మాధురి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న దువ్వాడ శ్రీను
టెక్కలి లోని తన నివాసంలో దివ్వెల మాధురి జన్మదిన వేడుకలు జరిగాయి
ఈ వేడుకల్లో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను, వైసీపీ నేతలు పాల్గొన్నారు
జన్మదినం సందర్భంగా దువ్వాడ శ్రీను, దివ్వెల మాధురి కలిసి కేక్ కట్ చేశారు
అనంతరం అందరికీ… pic.twitter.com/tCV1Ty2OjQ
— BIG TV Breaking News (@bigtvtelugu) December 12, 2024