BigTV English

Bigg Boss 8 Telugu Promo: బిగ్ బాస్ నమ్మకాన్ని నిలబెట్టిన అవినాష్.. అందుకే ఈ స్పెషల్ సర్‌ప్రైజ్

Bigg Boss 8 Telugu Promo: బిగ్ బాస్ నమ్మకాన్ని నిలబెట్టిన అవినాష్.. అందుకే ఈ స్పెషల్ సర్‌ప్రైజ్

Bigg Boss 8 Telugu Latest Promo: బిగ్ బాస్ సీజన్ 8 ఫినాలేకు ఇంకా కొన్నిరోజులే సమయం ఉంది. ప్రస్తుతం హౌస్‌లో టాప్ 5 కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలారు. ఇన్నిరోజుల పాటు బయట ప్రపంచం గురించి ఏ మాత్రం ఐడియా లేకుండా బిగ్ బాస్ హౌస్‌లోనే ఈ అయిదుగురు కాలాన్ని గడిపారు. ఇన్నాళ్లు వారు పడిన కష్టాన్ని మర్చిపోవడం కోసం బిగ్ బాస్ వారికి ఒక సర్‌ప్రైజ్ ఏర్పాటు చేశారు. అందరికీ విడివిడిగా తమ జర్నీని చూపించారు. బిగ్ బాస్ ఇచ్చిన ఈ సర్‌ప్రైజ్‌కు కంటెస్టెంట్స్ ఎమోషనల్ అయ్యారు. అవినాష్‌కు బిగ్ బాస్ తన జర్నీ చూపించగా తను చాలా ఎమోషనల్ అయ్యాడు. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయ్యింది.


నమ్మకాన్ని నిలబెట్టారు

ముందుగా తనకోసం ఏర్పాటు చేసిన సెటప్ చూసి అవినాష్ మురిసిపోవడంతో ఈ ప్రోమో ప్రారంభమవుతుంది. తను మెగా చీఫ్ అయిన టాస్క్‌ను గుర్తుచేసుకున్నాడు అవినాష్. తాను మొదటి ఫైనలిస్ట్ అవ్వడానికి కారణం ఎవిక్షన్ షీల్డ్ అని గుర్తుచేసుకొని, అది తనకు దక్కడానికి కారణమయిన నబీల్‌కు థాంక్యూ చెప్పుకున్నాడు. తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను ఆల్బమ్‌లో చూసుకొని ఎమోషనల్ అయ్యాడు. ఆపై అవినాష్ జర్నీ గురించి బిగ్ బాస్ మాట్లాడడం మొదలుపెట్టారు. ‘‘తెలియని సముద్రం భయాన్ని పెంచితే తెలిసిన సముద్రం అంచనాలను పెంచుతుంది. ఈరోజు మీరు ఈ స్థానంలో నిలిచి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు’’ అంటూ తను వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చి టాప్ 5కు చేరుకోవడాన్ని ప్రశంసించారు బిగ్ బాస్.


Also Read: గౌతమ్ కి బిగ్ సర్ప్రైజ్ ఇచ్చిన బిగ్ బాస్..!

మీరే ఐశ్వర్యవంతులు

‘‘మీరు చుట్టూ ఉంటే ఉష్ణోగ్రత తనకు తానే కొన్ని డిగ్రీలు కోల్పోతుంది. ఎన్ని డిగ్రీలు పొందినవారికైనా అది సాధ్యమవుతుందా? ఈ ఇంట్లో కొందరే మీ స్నేహితులు అయినా అందరూ మీ ఆప్తులే. మీ రింగుల జుట్టు మీ భార్యకు ఎంతో ఇష్టమైనప్పటికీ ఆట మీద ఉన్న ప్రేమ కోసం దానిని త్యాగం చేశారు. ఈసారి అవినాష్ కామెడీ మాత్రమే చేయగలిగే జస్ట్ కామెడియన్ మాత్రమే కాదు.. అన్ని చేయగలిగే ఎంటర్‌టైనర్‌లా మిమ్మల్ని మీరు ఆవిష్కరించారు. ఈ ప్రపంచంలో అన్ని అనారోగ్యాల నుండి ఉపశమనాన్ని ఇచ్చే ఔషదం నవ్వు ఒకటే. ఆ నవ్వును పంచే మీరు అందరికన్నా ఐశ్వర్యవంతులు’’ అంటూ అవినాష్‌ను ప్రశంసలతో ముంచేశారు బిగ్ బాస్.

బిగ్ బాస్‌పై ప్రేమ

తన గురించి బిగ్ బాస్ అంత గొప్పగా మాట్లాడడం విన్న తర్వాత అవినాష్ సంతోషానికి హద్దులు లేవు. ‘‘బిగ్ బాస్ టీమ్ మొత్తానికి చాలా థాంక్యూ. ఐ లవ్ యూ బిగ్ బాస్’’ అంటూ అరిచాడు. మొత్తానికి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా బిగ్ బాస్ 8లోకి వచ్చిన అవినాష్.. ఒక్కసారి కూడా నామినేషన్స్‌లోకి రాకుండా ఫైనల్స్ వరకు వచ్చేశాడు. తను నామినేషన్స్‌లోకి ఒకే ఒక్కసారి వచ్చి ఎలిమినేషన్ వరకు కూడా వెళ్లాడు. కానీ తను ఎలిమినేట్ అవ్వకుండా ఎలిమినేషన్ షీల్డ్ ఇచ్చి తనను కాపాడాడు నబీల్. ఆ తర్వాత ఫైనలిస్ట్ టాస్కుల్లో అందరితో పోటీపడి గెలిచి బిగ్ బాస్ 8లో మొదటి ఫైనలిస్ట్‌గా రికార్డ్ అందుకున్నాడు.

Related News

Bigg Boss 9 Elimination :ఈ వారం డబుల్ ఎలిమినేషన్… ఫస్ట్ బయటకు వచ్చింది ఎవరంటే?

Justice For Srija Dammu : శ్రీజ దమ్ము ఎలిమినేట్, హౌస్ లో ఉండాలి అంటూ నెటిజెన్స్

Bigg Boss 9 Promo : సీజన్ 9 లో కొత్త చాప్టర్ మొదలైంది, కన్నీటి కుళాయిలు ఓపెన్, ఆడియన్స్ డెసిషన్ ఏంటి?

Bigg Boss 9: ఈవారం డబుల్ ఎలిమినేషన్.. ట్విస్ట్ ఏంటంటే?

BB9 Wild Cards: నేడే హౌస్ లోకి వైల్డ్ కార్డ్స్.. ఆ 6గురు వీరే!

Bigg Boss 9: అమ్మ బాబోయ్ ఎంతకు తెగించార్రా? మోసం చేసి కెప్టెన్ అయ్యాడు, షాకింగ్ వీడియో

Bigg Boss 9 : భరణి తనూజ బాండింగ్ కు బ్రేక్ పడినట్లేనా? సంచాలక్ గా ఇమ్ము ఫెయిల్? దుమ్ము లేపిన మాస్

Bigg Boss 9 Promo: మైండ్ దొబ్బిందా.. రీతూకి హోస్ట్ స్ట్రాంగ్ కౌంటర్!

Big Stories

×