Aruna Arrest: నాలుగు రోజులుగా వార్తల్లో నిలిచిన అరుణ ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. ఆమెని అరెస్టు చేసిన వార్త తెలియగానే కొందరు రాజకీయ నేతలు, అధికారుల్లో దడ మొదలైంది. విచారణలో తమ గురించి ఇంకేమి విషయాలు బయట పెడుతుందోనని బెంబేలెత్తుతున్నారు.
కాలం కలిసి రాకుంటే ఎలాంటివారికైనా కష్టాలు తప్పవు. ప్రస్తుతం అరుణ పరిస్థితి కూడా అంతే. గడిచిన ఆరేళ్లు ఆమెది రాజయోగం. ఆ సమయం పూర్తి కావడంతో కష్టాలు మొదలయ్యాయి. లేడీ డాన్‌గా పేరుపొందిన నిడిగుంట అరుణ లీలలు అన్నీఇన్నీ కావు. కన్నేసిందంటే క్షణాల్లో పని కావాల్సిందే. గడిచిన ఐదేళ్లు అదే చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సైలెంట్ అయిన ఆమె, ఆ తర్వాత తన అస్త్రాలను బయటకు తీసింది. చివరకు అడ్డంగా బుక్కయ్యింది.
పెరోల్ ఖైదీ, రౌడీ షీటర్ శ్రీకాంత్-అరుణ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఇప్పటికే శ్రీకాంత్ పెరోల్ రద్దు కాగా, అతడ్ని నెల్లూరు జైలుకి తరలించినట్టు తెలుస్తోంది. నెల్లూరులో మకాం వేసిన ఆమె ప్రియురాలు అరుణ అక్కడి నుంచి పారిపోయిందుకు ప్రయత్నించి అడ్డంగా పోలీసులకు చిక్కింది.
నెల్లూరు నుంచి విజయవాడ మీదగా హైదరాబాద్‌కు వెళ్తున్న సమయంలో అద్దంకి టోల్ ప్లాజా వద్ద అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. లేడీ డాన్‌గా రకరకాల ఆరోపణలు ఎదుర్కొంటున్న నిడిగుంట అరుణకు కొందరు పోలీసు అధికారులు, రాజకీయ నేతలతో సంబంధాలు ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు అరుణను అదుపులోకి తీసుకున్నారు. తనను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించింది అరుణ.
ALSO READ: అమరావతి సీఆర్డీఏ ఆఫీసు.. కళ్లు చెదిరేలా లోపల దృశ్యాలు
అరెస్టు సమయంలో నంగనాచి కబుర్లు ఆడింది. అరెస్ట్‌కు మందు కార్ డిక్కిలో దాక్కుని అరుణ సెల్ఫీ వీడియో విడుదల చేసింది. తన కారు ఓపెన్ చేయాలంటూ ఒత్తిడి చేశారని పేర్కొంది. అందులో గంజాయి పెట్టాలని పోలీసులు ఒత్తిడి చేసినట్టు పేర్కొంది. తనను అరెస్టు చేయాలని పైనుంచి ఆదేశాలు వచ్చాయని పోలీసులు చెప్పిన విషయాన్ని బయటపెట్టింది.
తనను రోడ్డు మీద నిర్భంధం చేశారని తెలిపింది. తనపై అక్రమ కేసులేంటో తెలీదని, ఎలాంటి కేసులు పెడతారో తెలియని, మీడియాకు కబురు పెట్టాలని అందులో పేర్కొంది. ఆమెని అదుపులోకి తీసుకున్న పోలీసులు, కోవూరు పోలీసుస్టేషన్ కు తరలించినట్టు తెలుస్తోంది. ఆమెపై అక్కడ పీఎస్‌లో చీటింగ్ కేసు నమోదు అయ్యింది.
వైసీపీ హయాంలో రౌడీ షీటర్ శ్రీకాంత్ సహకారంతో ఆమె సెటిల్మెంట్లు చేసిన ఆరోపణలున్నాయి. నాలుగు రోజుల కిందట ఓ సీఐకి ఫోన్ చేసిన ఆమె, హోంశాఖ ఆఫీసు నుంచి మాట్లాడుతున్నామని బెదిరించారట. ఓ పోలీసు అధికారితో మంచి సంబంధాలున్నట్లు తెలుస్తోంది.
కేవలం అధికారులే కాకుండా కొందరు రాజకీయ నేతలతో రిలేషన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీకి చెందిన కొందరు మాజీ మంత్రులతో అరుణ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన విషయం తెల్సిందే. దీంతో అరుణ లోగుట్టు బయటపెట్టే పనిలో పడ్డారు పోలీసులు. మరి విచారణలో ఇంకెన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.