BigTV English

AP Politics: లోకేష్ కి పోటీగా అంబటి.. గ్రీన్ బుక్ ఓపెన్.. పేర్లన్నీ రాస్తున్నా.. ఎవ్వరినీ వదలనంటూ కామెంట్

AP Politics: లోకేష్ కి పోటీగా అంబటి.. గ్రీన్ బుక్ ఓపెన్.. పేర్లన్నీ రాస్తున్నా.. ఎవ్వరినీ వదలనంటూ కామెంట్

Red vs Green: ఏపీ రాజకీయాల్లో బుక్ లు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. టీడీపీ రెడ్ బుక్ పేరిట వైరల్ కాగా.. వైసీపీకి చెందిన ఓ మాజీ మంత్రి కొత్తగా గ్రీన్ బుక్ రాస్తున్నట్లు ప్రకటించారు. రెడ్ బుక్ లో రాసిన పేర్లు వేరు. నేను రాసే పేర్లు వేరు.. అందరి పేర్లు రాస్తా అంటున్నారు ఈ మాజీ మంత్రి. ఇంతకు ఈయన రాసే బుక్ ఏమిటో.. అందులో ఎవరి పేర్లు రాస్తారో తెలుసుకుందాం.


ఏపీలో ఎన్నికలకు ముందు ఇప్పటి పాఠశాల విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు తాము వైసీపీ పాలనలో ఇబ్బందులు ఎదుర్కొన్నామని, తమను కావాలనే పలువురు అధికారులు కావాలనే పలు కేసుల్లో ఇరికిస్తున్నట్లు తెలిపారు. దీనిపై స్పందించిన లోకేష్.. తాను రెడ్ బుక్ రాస్తున్నట్లు, ఇబ్బందులు పెట్టిన ఏ అధికారిని, పొలిటీషియన్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హామీ ఇచ్చారు.

ఆ రీతిగానే యువగళం పాదయాత్ర సాగిన అన్నీ జిల్లాలలో రెడ్ బుక్ గురించి, లోకేష్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. తాము అధికారంలోకి వచ్చాక.. ఈ బుక్ ఓపెన్ చేస్తా అంటూ లోకేష్ పలు సభలలో సైతం ప్రకటించారు. ఎన్నికలు ముగిశాయి.. అధికారంలోకి వచ్చారు.. ఈ క్రమంలో కొందరు లోకేష్ ను డైరెక్ట్ గా రెడ్ బుక్ ఓపెన్ చేయండి అంటూ కోరగా.. లోకేష్ ఓపెన్ చేద్దాం.. ముందు పరిపాలన చూద్దాం అంటూ సమాధానం ఇచ్చారు. ఇలా టీడీపీ తరపున రెడ్ బుక్ వైరల్ కాగా.. తాజాగా వైసీపీకి చెందిన ఓ మాజీ మంత్రి కొత్త నినాదంతో ముందుకు వచ్చారు.


Also Read: SIT inquiry: తిరుమల లడ్డూ వివాదం.. ఈ వారం రంగంలోకి సిట్, తొలుత..

వైసీపీకి చెందిన మాజీ మంత్రి అంబటి రాంబాబు గురించి ఎవరికి తెలియదు. ఆయన మాట్లాడే తీరు వేరు.. ఈయన చేసే ప్రసంగానికి ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు. అటువంటి అంబటి రాంబాబు తాజాగా పోలవరం ప్రాజెక్ట్ పై స్పందిస్తూ.. పోలవరం ఎవరికీ అర్థం కాదు.. ఎందుకంటే నాకు అర్థం కాలేదు కనుక అంటూ కామిక్ టానిక్ కామెంట్ చేసి వైరల్ కూడా అయ్యారు.

తాజాగా అంబటి గుంటూరులో జరిగిన సభలో పాల్గొని తాను బుక్ రాస్తున్నట్లు తెలిపారు. అది రెడ్ బుక్ కాదని, గ్రీన్ బుక్ అంటూ మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యమేలుతుందని, తాను గ్రీన్ బుక్ రాస్తున్నట్లు ప్రకటించారు. ఈ గ్రీన్ బుక్ లో పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్త పేరు రాస్తానని, అధికారంలోకి వచ్చాక నేరుగా తమ పార్టీ అద్యక్షుడు వైయస్ జగన్ కు సమర్పిస్తానన్నారు.

కష్టకాలంలో అండగా ఉన్న ఏ కార్యకర్తను మరచి పోయేది లేదని.. వారి పేర్లన్నీ గ్రీన్ బుక్ లో ఉంటాయన్నారు. ఇక కష్టపడండి.. మీ పేరు నమోదు చేసుకోండి అంటూ అంబటి ప్రకటించారు. ఏదిఏమైనా ఏపీలో బుక్ లు వైరల్ అవుతుండగా.. టీడీపీ రెడ్ బుక్ తీసుకువచ్చి అధికారం చేజిక్కించుకుంటే.. గ్రీన్ బుక్ ఓపెన్ చేసిన వైసీపీ 2029లో అధికారం చేజిక్కించుకుంటుందో లేదో చూడాలి.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×