BigTV English

Ganta Srinivasa Rao : సగం మంది ఎమ్మెల్యేలు వైసీపీకి గుడ్ బై చెబుతారు.. గంటా జోస్యం..

Ganta Srinivasa Rao : సగం మంది  ఎమ్మెల్యేలు వైసీపీకి గుడ్ బై చెబుతారు.. గంటా జోస్యం..

Ganta Srinivasa Rao : మునిగిపోతున్న నావలాంటి వైసీపీ నుంచి సురక్షితంగా బయటపడేందుకు అనేక మంది ప్రయత్నిస్తున్నారని టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు అన్నారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సమయంలో వైసీపీపై విమర్శలు గుప్పించారు.


‘‘ఎంపీలకు కూడా జగన్‌ కలిసే అవకాశం ఇవ్వడం లేదు. సీఎం జగన్ ను రెండుసార్లే కలిసినట్టు కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్‌ చెప్పారు. పెనమలూరు సీనియర్ ఎమ్మెల్యే ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారు. అంబటి రాయుడు ఏవేవో ఊహించుకొని వైసీపీలోకి వెళ్లాడు. పరుగులు పెట్టకుండానే ఆయన బయటకు వచ్చేశారు. ఇప్పుడేమో జనసేనలో సీటు కోసం చూస్తున్నారు. ఎమ్మెల్యేల బదిలీలు ఇంత పెద్దఎత్తున ఎప్పుడూ జరగలేదు. 50 శాతం మంది ఎమ్మెల్యేలు వైసీపీని వీడే పరిస్థితి వచ్చింది. జనవరి 20న భీమిలి నుంచి జగన్‌ ప్రజాయాత్రలు ప్రారంభిస్తారట. ఆయనకు ప్రజల నుంచి ఛీత్కారాలు తప్పవు. ఉమ్మడి విశాఖలో ఒక్క స్థానంలో కూడా వైసీపీ గెలిచే అవకాశమే లేదు’’ అని గంటా శ్రీనివాసరావు చెప్పారు.


Related News

Anam Fires On YS Sharmila: ఆలయాలకు బదులుగా టాయిలెట్స్.. వైఎస్ షర్మిల వ్యాఖ్యలపై మంత్రి ఆనం ఆగ్రహం

CM Chandrababu: ఏపీని 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్దిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే స్వర్ణాంధ్ర లక్ష్యం: సీఎం చంద్రబాబు

AP Rain Alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. రేపు ఈ జిల్లాల్లో వర్షాలు.. మత్స్యకారులకు అలర్ట్

AP Government: రాష్ట్రానికి ప్రపంచ ప్రఖ్యాత కంపెనీ.. పెట్టుబడుల కోసం ప్రభుత్వం మరో ముందడుగు

AP Govt: పండుగ పూట గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం.. పెండింగ్ బిల్లులు విడుదల

Housing Permission For Rupee: ఇల్లు కట్టుకునే వారికి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. రూపాయికే నిర్మాణ అనుమతులు

Tirumala: తిరుమలలో భూతకోల నృత్య ప్రదర్శనపై వివాదం..

Tirupati: 220 కేవీ విద్యుత్ టవర్ ఎక్కి వేలాడుతూ వ్యక్తి హంగామా

Big Stories

×