Bone Stuck in Man Throat: చికెన్, మటన్, ఫిష్, ఫ్రాన్స్ ఇలా నాన్ వెజ్ వంటకాల పేర్లు వినగానే చాలామందికి నోట్లో నీళ్లూరుతాయి. ఇక మాంసం వంటకాలు రెడీ అవ్వగానే ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా లొట్టలేసుకుని తింటుంటారు. ఆయితే మాంసం తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ మధ్య కాలంలో చాలా ఘటనలు నిరూపించాయి. తాజాగా మటన్ ముక్క గొంతులో ఇరుక్కుపోయిన ఓ వ్యక్తి కొద్దిరోజులపాటు నరకయాతన అనుభవించాడు. ప్రస్తుతం ఆ వ్యక్తి గొంతులో ఉన్న ఎముకను వైద్యులు ఎండోస్కోప్క్ ద్వారా బయటకు తీశారు. అసలు ఏం జరిగిందో పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
అన్నం తినేటప్పుడు మాంసం ముక్క గొంతులో ఇరుక్కుపోయిన వ్యక్తికి గుంటూరు GGHలో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు వైద్యులు. షేక్ ఆదాం షఫీ అనే వ్యక్తి ఫ్యామిలీ ఫంక్షన్‌లో మాంసాహారం తీసుకున్నారు. ఆ సమయంలో అతని గొంతులో మాంసపు ఎముక ఇరుక్కుపోయింది.
Also Read: టీడీపీ నేత సపోర్టుతో కొలంబియాలో కేసినో.. ఎంట్రీ ఫీజు ఎంతో తెలుసా..!
గత 3 రోజులుగా ఏ ఆహారం తీసుకోకుండా ఉంటే ముక్కులో నుంచి ఆ బోన్ బయటికి వస్తుందని షఫీ కుటుంబ సభ్యులు భావించారు. అయితే షఫీ ఆరోగ్యం క్షీణించడంతో గుంటూరు GGHకి తీసుకెళ్లారు. ఎక్స్‌రే తీయగా తొలుత గొంతులోని ఎముకకు సంబంధించి వైద్యులకు కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియలేదు. చివరికి ఎండోస్కోపీ పరికరం ద్వారా ఆ ఎముక భాగాన్ని బయటకు తీయటంతో ప్రాణాపాయ నుంచి బయటపడ్డ షఫీ ప్రస్తుతం కోలుకుంటున్నారు.