BigTV English

Visakha Agency: విశాఖ ఏజెన్సీలో భారీ వర్షాలు.. పొంగిన వాగులు వంకలు.. గర్బిణీని ట్రాక్టర్‌పై…

Visakha Agency: విశాఖ ఏజెన్సీలో భారీ వర్షాలు.. పొంగిన వాగులు వంకలు.. గర్బిణీని ట్రాక్టర్‌పై…

Visakha Agency: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఉమ్మడి విశాఖ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతమైన గూడెం కొత్తవీధి మండలం గాలికొండ పంచాయితీ చట్రపల్లి గ్రామంలో కొండ చరియలు బీభత్సం సృష్టించాయి. ఆదివారం రాత్రి భారీగా కురిసిన వర్షానికి కొండ చరియలు ఆదివాసుల ఇళ్లపై పడ్డాయి. ఈ ఘటనలో పలు ఇల్లు ధ్వంసమయ్యాయి.


ALSO READ: విశాఖటప్నంలో వయనాడ్ పరిస్థితి.. కూలిపోయే స్థితిలో ఇళ్లు!

నలుగురు గిరిజనులు గాయపడగా, ఓ మహిళ వరద ప్రవాహంలో గల్లంతు అయ్యింది. గల్లంతు అయిన మహిళ 25 ఏళ్లు వయస్సు. గాయపడిన బాధితులను దారకొండ ఆసుపత్రికి తరలించి అక్కడ చికిత్స అందిస్తున్నారు.


ఇదిలావుండగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మండలం చెరువు నిమ్మలపాలెం వద్ద వాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. గర్బిణీ మహిళకు నొప్పులు రావడంతో ఆమెని ట్రాక్టర్‌పై వాగు దాటించారు గిరిజనులు. గర్భిణి ప్రస్తుతం ఆసుపత్రికి చేరుకుని చికిత్స పొందుతున్నారు.

మరోవైపు వై.రామవరం మండలం చామగడ్డ పంచాయితీ పనసల పాలెం – పలకజీడి కల్వర్ట్ పైనుంచి వరద ఉద్ధృతంగా ప్రవాహిస్తోంది. దీంతో ఆ ప్రాంతాల మీదుగా వెళ్లాల్సిన వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

మరోవైపు విశాఖ మేఘాద్రి గెడ్డ రిజర్వాయర్‌కి వరద నీరు పొటెత్తింది. రిజర్వాయర్‌లో 57.4 అడుగుల కు నీరు చేరుకుంది. దీని గరిష్ట పరిమితి 61 అడుగులు. గేట్లు ఎత్తే అవకాశం ఉండడంతో జీవీఎంసీ , రెవిన్యూ అధికారులు పల్లపు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. ఇప్పటికైనా గేట్లు ఎత్తే పరిస్థితి లేదన్నారు. రిజర్వాయర్‌‌ను విశాఖ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ పరిశీలించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

శ్రీకాకుళం జిల్లా కళింగపట్నానికి తూర్పున 240 కిలో మీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైంది. మంగళవారం మధ్యాహ్నానికి పూరీ తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

 

Related News

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Pawan Kalyan project: పవన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.. కోట్లల్లో ఖర్చు.. ఎందుకంటే?

Big Stories

×