BigTV English

Tirumala: ఏడుకొండల స్వామి చెంతకు ఏడు మార్గాలు.. ఆ వింతలు, విశేషాలు..

Tirumala: ఏడుకొండల స్వామి చెంతకు ఏడు మార్గాలు.. ఆ వింతలు, విశేషాలు..

Tirumala: కలియుగ వైకుంఠం శ్రీ శ్రీనివాసుడి లీలలు మహా అద్భుతం. గోవిందా అనే నామస్మరణ నోరార పలికినా చాలు.. ఆ స్వామి కరుణ కటాక్షం మనకు కలుగుతుందన్నది భక్తుల విశ్వాసం. అందుకే రోజుకు సుమారు 70 వేలకు పైగానే భక్తులు శ్రీవారిని దర్శించి తమ కోరికలు విన్నవించుకుంటారు. అంతేకాదు తమ తలనీలాలు సమర్పించి భక్తులు తమ భక్తిని చాటుకుంటారు. అటువంటి కలియుగ దైవం వెలసిన తిరుమల వింతలు విశేషాలు ఎన్నో ఎన్నెన్నో. అటువంటి విశేషాలలో గొప్పగా చెప్పుకోదగ్గవి ఏడు నడక మార్గాలు. ప్రస్తుతం 2 నడక మార్గాలు ఉన్నా, పూర్వం ఏడు నడకమార్గాలలో శ్రీవారిని భక్తులు దర్శించేవారట.


తిరుమల శ్రీవారి దర్శనార్థం నడక మార్గంలో వెళ్లి దర్శిస్తే పుణ్యఫలం మరింతగా దక్కుతుందన్నది భక్తుల విశ్వాసం. అందుకే భక్తులు ఎక్కువగా అలిపిరి మెట్ల మార్గం నుండి కాలినడకన తిరుమలకు చేరుకుంటారు. ఈ మెట్ల మార్గం ఎప్పుడు చూసినా గోవింద నామస్మరణతో మారుమ్రోగుతుంది. అలిపిరి మార్గంలో మొత్తం 3650 మెట్లు ఉన్నాయి. ఒక్కొక్క మెట్టుకు పసుపు కుంకుమతో బొట్లు పెడుతూ.. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ తమ భక్తిని చాటుకుంటారు. శ్రీ రామానుజ చార్యులు ఈ మెట్ల మార్గం నుండే శ్రీవారిని దర్శించుకున్నారట.

తిరుమలకు చేరే మరో కాలినడక మార్గం.. శ్రీవారి మెట్టు. తిరుమలకు చేరే కాలినడక మార్గాలలో ఈ మార్గం, ఎంతో ప్రాచీనమైనది. శ్రీ వేంకటేశ్వర స్వామి వారు ఈ మార్గం ద్వారానే, తిరుమల చేరుకున్నారని పురాణాలు చెబుతున్నాయి. అయితే అలిపిరితో పోలిస్తే ఇక్కడి నుండి తిరుమలకు చేరే మెట్ల సంఖ్య తక్కువ. అందుకే ఈ మెట్ల మార్గం నుండి కూడ భక్తులు తిరుమలకు చేరుకుంటారు.


అలాగే కుక్కలదొడ్డి అనే మరో మార్గం ద్వార కూడ పూర్వం తిరుమలకు చేరుకొనేవారు. ఈ మార్గం శ్రీవారి పార్వేట మండపం దారి. ముందుగా తుంబుర తీర్థం చేరుకొని అక్కడ నుండి పాపవినాశనం మీదుగా స్వామివారి ఆలయం వద్దకు చేరుకొనేవారు. పదకవితా పితామహుడు అన్నమయ్య ఈ మార్గం గుండానే తిరుమల శ్రీవారి చెంతకు చేరినట్లు చరిత్ర.

శ్యామల కోన అనే మరో నడక మార్గం కూడ శ్రీవారి ఆలయానికి ఉంది. కళ్యాణి డ్యామ్ నుండి కొన్ని కిలోమీటర్లు నడిచి తూర్పువైపు తిరిగి మరికొంత దూరం ప్రయాణిస్తే, తిరుమలలోని ఎత్తైన నారాయణ గిరి వస్తుంది. అలాగే అవ్వచారీ కోన దారి అనే మరో నడక మార్గం కూడ ఉంది. రేణిగుంట నుండి కడప – తిరుపతి మార్గంలో ఆంజనేయపురం అనే గ్రామం వద్ద ఓ లోయ ఉంది. ఈ లోయలో ఉన్న అవ్వచారీ కోన దారి గుండా, పడమర వైపుకి నడక సాగిస్తే, మోకాళ్ళ పర్వతం వస్తుంది. అక్కడ నుండి తిరుమలకు చేరుకోవచ్చు.

అంతేకాదు మరో మార్గం తలకోన. తలకోన నుండి కూడ భక్తులు పూర్వం తిరుమలకు చేరుకొనేవారు. తలకోన అనే పేరు ఎలా వచ్చిందంటే.. తిరుమల కొండకు తల భాగంలో ఈ కోన ఉండడంతో తలకోన అనే పేరు వచ్చింది. ఇక్కడి జలపాతం నుండి నడుచుకుంటూ.. జెండాపేటు దారి నుండి తిరుమలకు భక్తులు పూర్వం చేరుకొనేవారు.

చివరగా ఏడో దారి మామండూరు దారి. శ్రీవారి మెట్టు తర్వాత ఒకప్పుడు బాగా రద్దీగా ఉన్న నడక దారి ఇది. తిరుమలకు ఈశాన్యం వైపు నుండి వచ్చే భక్తులకు ఈ దారి అనుకూలం. విజయనగర రాజులు ఈ దారి గుండానే శ్రీవారి దర్శనార్థం వచ్చేవారట. ఇలా ఏడుకొండల స్వామి దర్శనానికి ఏడు కాలినడక మార్గాలు ప్రసిద్ది. కానీ మారిన కాలానుగుణంగా అలిపిరి మెట్ల మార్గం, శ్రీవారి మెట్టు మార్గం మాత్రమే ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్నాయి.

Also Read: ISRO 100th Mission: ఇస్రో వందో రాకెట్ ప్రయోగం సక్సెస్.. నింగిలోకి దూసుకెళ్లిన GSLV-F 15

మిగిలిన 5 మార్గాలు పూర్వం భక్తులు నడక సాగిస్తూ తిరుమలకు చేరుకొనేవారు. కానీ అడవులు విస్తారంగా విస్తరించి ఉండడం, జంతు సంరక్షణ చర్యలు, భక్తుల రక్షణ వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని ఈ మార్గాలను మూసివేశారు. మొత్తం మీద నిశ్చలమైన భక్తితో గోవిందా అంటూ నామస్మరణ సాగిస్తే పలికే శ్రీ శ్రీనివాసుడు కరుణకటాక్షం భక్తులందరిపై ఉండాలని మనసారా కోరుకుందాం.. స్వామి వారి దర్శనభాగ్యం మనకు కలగాలని కోరుకుందాం.

Related News

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Big Stories

×