టీటీడీ నిధులు తిరుపతి కార్పొరేషన్‌కు మళ్లిస్తున్నారన్న పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. పారిశుద్ధ్య పనులకు నిధులు విడుదల చేయొద్దని న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కు నిధులు మళ్లించొద్దని ఆదేశించింది.
టీటీడీ నిధులు దారి మళ్లిస్తున్నారని హైకోర్టులో బీజేపీ నేత భానుప్రకాశ్‌రెడ్డి ఈ పిటిషన్ వేశారు. టీటీడీ నిధులు మళ్లించడం దేవాదాయ చట్టం సెక్షన్ 111కు విరుద్ధమని పేర్కొన్నారు. రూ.100 కోట్లు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌కు మళ్లించారని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. గతంలో ఎప్పుడూ టీటీడీ నిధులు ఇలా మళ్లించలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.
వాదనలు విన్న హైకోర్టు..2 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని టీటీడీ, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌ను హైకోర్టు ఆదేశించింది. విచారణ రెండు వారాలపాటు వాయిదా వేసింది.