E-Paper
Advertisement

కడప గడ్డ నుంచి జగన్‌కు సీఎం చంద్రబాబు ఓపెన్ ఛాలెంజ్, రూ. 40 కోట్ల సుపారీకి సమాధానం చెప్పాలి

కడప గడ్డ నుంచి జగన్‌కు సీఎం చంద్రబాబు ఓపెన్ ఛాలెంజ్, రూ. 40 కోట్ల సుపారీకి సమాధానం చెప్పాలి
Advertisement

Proddatur: కడప గడ్డ నుంచి మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌కు సవాల్ విసిరారు సీఎం చంద్రబాబు. ధైర్యముంటే ప్రజల ముందుకొచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గడిచిన ఐదేళ్లు గొడ్డలి పార్టీ వెలగబెట్టిన చరిత్రను అర్థం చేసుకోవాలన్నారు. ఈ గడ్డ నుంచి ఆ పార్టీ అధినేతకు సవాల్ విసురుతున్నానని చెప్పారు.

కడప గడ్డ నుంచి జగన్‌కు సీఎం చంద్రబాబు ఓపెన్ ఛాలెంజ్

2019 ఏడాదిలో ప్రధాని నరేంద్రమోదీ ప్రతీ ఇంటికి నీళ్లు ఇవ్వాలన్న లక్ష్యంతో జలజీవన్ మిషన్ ప్రారంభించారని అన్నారు. 40 శాతం కేంద్రం, 60 శాతం రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఖర్చు చేయాలన్నారు. యూపీ లక్ష కోట్లు.. మధ్యప్రదేశ్‌ 83 వేల కోట్లు.. అసోం 34 వేల కోట్లు తీసుకుంటే, ఏపీలో జగన్ ఖర్చు పెట్టింది కేవలం 2600 కోట్లు మాత్రమేనని అన్నారు. చిన్న రాష్ట్రాలు ఆ స్థాయిలో ఖర్చు చేస్తుంటే, ఈ పరిస్థితికి తీసుకొచ్చిన ఎవరని ప్రశ్నించారు. దీనికి గొడ్డలి పార్టీ ప్రధాన కారణమని కుండబద్దలు కొట్టేశారు.

కడప జిల్లాల్లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ పర్యటన

Advertisement

సోమవారం కడప జిల్లాల్లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించారు. జల్ జీవన్ మిషన్ 2.0 – అమరజీవి జలధార ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. మూడేళ్లలో 35 వేల కోట్లు, 36 ప్రాజెక్టులతో క్యాలెండర్ తయారు చేశామన్నారు ముఖ్యమంత్రి. ఇది తారీఖుతో సహా రాసి పెట్టుకోవాలన్నారు. అదే రోజు జాతికి అంకితం చేస్తామన్నారు. గోదావరి పుష్కరాల కంటే ముందు పోలవరం పూర్తి చేసి ప్రధాని మోదీ చేతుల మీదుగా ఆ ప్రాజెక్టుని జాతికి అంకితం చేస్తామన్నారు. గోదావరి-కావేరీ నదుల అనుసంధానం కావాలన్నారు. ఇలాంటి కరవు సమయంలో 200 టీఎంసీలు తెచ్చుకుంటే కరువును జయించే శక్తి సీమకు ఉంటుందన్నారు.

గత ఎన్నికల్లో వైసీపీకి గట్టిగా బుద్ది చెప్పారని, ఈ పార్లమెంటు నియోజకవర్గంలో ఐదు అసెంబ్లీ సీట్లు గెలిపించారంటే జీవితంలో ఎప్పుడూ మరిచిపోనని అన్నారు. శాశ్వతంగా గుర్తు పెట్టుకుంటానని అన్నారు. కడప గడ్డపై నుంచి జగన్‌ను అడుగుతున్నానని సూటిగా ప్రశ్నలు లేవనెత్తారు. వివేకా హత్యకేసులో వాస్తవాలన్నీ బయటకు వచ్చాయని, అంతిమ లబ్ధిదారు ఎవరో తేలిపోయిందన్నారు. 40 కోట్ల సుపారీకి జగన్ సమాధానం చెప్పాలా? లేదా? అంటూ ప్రజలను ప్రశ్నించారు.

Advertisement

లిక్కర్ స్కామ్ లో వేల కోట్లు లబ్దిదారులు నువ్వేనని అన్ని వేళ్లు చూపిస్తున్నాయని అన్నారు. ప్రొద్దుటూరు నుంచి సవాల్ విసురుతున్నానని అన్నారు. నిజాలు కక్కించకపోతే ఫేక్ ప్రచారం చేస్తారన్నారు. ఏపీపీఎస్సీ గ్రూప్-1లో అక్రమాలు వెలుగుచూశాయని, డిప్యూటీ కలెక్టర్లగా పని చేయాల్సినవారు, అటెండర్ల దగ్గర సూపర్ వైజర్లు చేస్తున్నారని ప్రశ్నించారు. పిల్లల జీవితాలతో ఆడుకున్నారని, వీటికి సమాధానం చెప్పే ధైర్యముందా? అంటూ ప్రశ్నించారు. ఇసుకలో ఎవరైనా ఇన్వాల్వ్ అయి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే మేమంతా ఊరకోబోమన్నారు. ఇది పేదల హక్కు, మీ సొంతమని హామీ ఇచ్చారు.

ALSO READ: వైసీపీ ఎంపీ ఉన్నా.. అభివృద్ధిలో వివక్ష లేదన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

అసెంబ్లీకి వస్తే అన్నీ చర్చిద్దామని కోరామని, ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కోరుతున్నారని అన్నారు. అది తాను ఇచ్చేది కాదని, ప్రజలు ఇచ్చేదన్నారు. గతంలో ఆ విధంగా వ్యవహారించారని, ఆయనకు అన్నీ తెలుసన్నారు. తాను రాయలసీమ బిడ్డనని, ఇక్కడే పుట్టానని, ఇక్కడే పెరిగానని, ఈ ప్రాంతాన్ని తిరుగులేని సీమగా తయారు చేస్తామన్నారు. ఎయిర్ స్పేస్ విభాగం ఇక్కడకు వస్తుందన్నారు. ఇప్పటివరకు ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ నడిచిందని, రేపటి నుంచి ట్రిపుల్ ఇంజన్ సర్కార్ వస్తుందన్నారు. కూటమికి మద్దతుగా ఉండాలని, వారి అభ్యర్థులను గెలిపించాలన్నారు.

Related News

వైసీపీ ఎంపీ ఉన్నా.. అభివృద్ధిలో వివక్ష లేదన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

అనకాపల్లి జిల్లాలో విషాదం.. హిట్ అండ్ రన్ ఘటనలో దంపతులు మృతి!

ఏపీలో స్పెషల్ టెట్-2026 హాల్ టికెట్లు విడుదల, షెడ్యూల్ ఇదే! ఫలితాలు మాత్రం

ఏపీలో లక్షన్నర కోట్ల BPCL రిఫైనరీ ప్రాజెక్టు.. పర్యావరణ అనుమతులకు గ్రీన్‌సిగ్నల్, శంకుస్థాపనకు ప్రధాని

విజయవాడలో సైకో ప్రేమికుడు వీరంగం.. ఏం చేశాడంటే?

తిరుపతిలో ముగ్గురు వైద్యులపై ఉన్నతాధికారులు వేటు

ఏకపక్షంగా 14 ఆదేశాలా.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై వైఎస్ షర్మిల ఫైర్!

Big Stories

Advertisement
×