Salman Butt hits back at Stuart Broad: పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ (England vs Pakistan) మధ్య ప్రస్తుతం టెస్ట్ సిరీస్ (Pakistan tour of England 2026) జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు జట్ల మధ్య లీడ్స్ వేదికగా తొలి టెస్ట్ ప్రారంభమైన క్రమంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గాయం కారణంగా బాబర్ ఆజం తొలి టెస్ట్ కు దూరమయ్యాడు. దీంతో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 48.2 ఓవర్లు ఆడి 171 పరుగులకు కుప్పకూలింది. అటు ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ లో చాలా దాటిగానే ఆడుతోంది. రెండో రోజు ముగిసే సమయానికి 8 వికెట్లు నష్టపోయిన ఇంగ్లాండు 366 పరుగులు సాధించింది. ప్రస్తుతం రాబిన్సన్ తో పాటు జోఫ్రా ఆర్చర్ బ్యాటింగ్ చేస్తున్నారు. ఇద్దరు కలిసి 400 వరకు స్కోర్ తీసుకునే వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఈ తరుణంలోనే మాజీలు స్టువర్ట్ బ్రాడ్, సల్మాన్ భట్ మధ్య మాటల యుద్ధం మొదలైంది.
పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య సిరీస్ రెండు రోజుల కిందట ప్రారంభం కాగా.. రెండు దేశాల మాజీ క్రికెటర్ల మధ్య కూడా మాటల యుద్ధం మొదలైంది. ఈ టెస్ట్ సిరీస్ ప్రారంభం కాకముందే పాకిస్తాన్ జట్టుకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు స్టువర్టు బ్రాడ్. ఇంగ్లాండ్ పైన పాకిస్తాన్ గెలిచే ఆస్కారం లేదన్నారు. కచ్చితంగా పాకిస్తాన్ జట్టు చిత్తుగా ఓడిపోతుందని పేర్కొన్నారు. 3-0 తేడాతో కచ్చితంగా పాకిస్తాన్ ను ఇంగ్లాండ్ వైట్ వాష్ చేయడం గ్యారెంటీ అన్నారు. పాకిస్తాన్ చాలా బలహీనమైన జట్టు అంటూ వెల్లడించారు.
పాకిస్తాన్ పై విమర్శలు చేస్తున్న ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్లకు సల్మాన్ భట్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పాకిస్తాన్ జట్టును కించపరిచే ముందు నీ స్థాయి ఏంటో తెలుసుకో అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మీ ఇంగ్లాండ్ కూడా ఆస్ట్రేలియా గడ్డపై 5-0 తేడాతో వైట్ వాష్ అయిందని గుర్తు చేశారు. మీ సొంత గ్రౌండ్లలోనే గెలవడం చేతకాదని ఇజ్జత్ తీశారు. ఈ విషయాలు మర్చిపోయి స్టువర్టు బ్రాడ్ లాంటివాళ్ళు పాకిస్తాన్ జట్టును విమర్శించడం దారుణం అన్నారు.
దమ్ముంటే యాషెస్ సిరీస్ లో ఆస్ట్రేలియాను ఓడించాలని ఛాలెంజ్ విసిరారు. మాపైన కాదు, మీ మగతనం… ఆస్ట్రేలియాను ఓడించి చూపించండి అంటూ సవాల్ చేశారు. టోర్నమెంట్ ప్రారంభం కాకముందే పాకిస్తాన్ జట్టుకు జట్టును చిత్తు చేస్తామని స్టువర్ట్ బ్రాడ్ విర్రవీగడం దారుణం అన్నారు. ఒకవేళ ఇంగ్లాండ్ పైన పాకిస్తాన్ విజయం సాధిస్తే మాత్రం అతడిని వదిలిపెట్టబోనని హెచ్చరించారు. ఆ దిశగా పాకిస్తాన్ క్రికెటర్లు రాణించాలని కోరారు. పరువు తీసిన వాళ్లకు మైదానంలోనే ఆన్సర్ ఇవ్వాలి అన్నారు.