E-Paper
Advertisement

ఒరేయ్ రిజ్వాన్, నీకు బుర్ర ఉందా…ర‌నౌట్ చేయ‌కుండా, ఆ అప్పీల్ ఎంట్రా ?

ఒరేయ్ రిజ్వాన్, నీకు బుర్ర ఉందా…ర‌నౌట్ చేయ‌కుండా, ఆ అప్పీల్ ఎంట్రా ?
Advertisement

Trolling On Rizwan:  పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ (England vs Pakistan) జట్ల మధ్య ప్రస్తుతం టెస్ట్ సిరీస్ ( Pakistan tour of England 2026 ) కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ రెండు జట్ల మధ్య మొన్న లీడ్స్ ( Headingley, Leeds) వేదికగా తొలి టెస్ట్ ప్రారంభం కాగా.. ఫస్ట్ ఇన్నింగ్స్ లోనే పాకిస్తాన్ చెత్త ప్రదర్శన కనబరిచింది. 171 పరుగులకు సగం రోజులోనే పాకిస్థాన్ ఆల్ అవుట్ అయింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేస్తోంది. ఈ మ్యాచ్ లో రెండో రోజు ముగిసే స‌మ‌యానికి ఇంగ్లాండ్ 8 వికెట్ల న‌ష్టానికి 366 ప‌రుగులు సాధించింది.

ర‌నౌట్ ఛాన్స్ ను వ‌దిలేసిన పాకిస్తాన్‌

పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య లీడ్స్ వేదికగా మొదటి టెస్ట్ జరుగుతున్న నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఓ రనౌట్ ఛాన్స్ ను మహమ్మద్ రిజ్వాన్ చేజేతులా పోగొట్టాడు. దీంతో అతనిపై దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. అసలు ఏం జరిగిందంటే… ఇంగ్లాండ్ బ్యాటర్ డాన్ లారెన్స్ ( Dan Lawrence) బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో పాకిస్తాన్ స్పిన్నర్ అలీ ఉస్మాన్ ( Ali Usman) అదిరిపోయే బంతి వేశాడు. ఈ క్రమంలో డాన్ లారెన్స్ ప్యాడ్ కు బంతి తగిలింది. దీంతో వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్, బౌలర్ అలీ ఉస్మాన్ LBW కోసం గట్టిగా అప్పీల్ చేశారు. ఆ బంతి చూసిన ప్రతి ఒక్కరూ క్లియర్ గా నాటౌట్ అని ఇట్టే చెబుతారు. కానీ అది గుర్తించకుండా మహమ్మద్ రిజ్వాన్ ఔట్ అంటూ అప్పీల్ చేయడం మొదలు పెట్టాడు.

Advertisement

SRH Batter Harry Brook On Kavya Maran: SRH జ‌ట్టులో నాకు న‌ర‌కం చూపించారు..టోర్నీ మ‌ధ్య‌లోనే పారిపోయేలా చేశారు!

రిజ్వాన్ ఓ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…న‌మాజ్ కు తప్ప వాడికి ఏదీ రాదు

అయితే ఆ సమయంలో క్రీజు వదిలి బయటకు వచ్చిన డాన్ లారెన్స్ ను స్లిప్ లో ఉన్న సల్మాన్ అలీ రనౌట్ చేయబోయాడు. దీంతో త్రో సంధించాడు. అయితే వికెట్ల దగ్గర ఉన్న మహమ్మద్ రిజ్వాన్ మాత్రం ఆ బంతిని పట్టుకునే ప్రయత్నం కూడా చేయలేదు. అతడు LBW అప్పీల్ చేసే పనిలో బిజీగా ఉండిపోయాడు. దీంతో సల్మాన్ అలీ వేసిన బంతి వికెట్లను తగలలేదు. నేరుగా మహమ్మద్ రిజ్వాన్ ( Mohammad Rizwan) కాళ్ల‌కు బంతి తగిలింది. దీంతో లారెన్స్ రనౌట్ అయ్యే ఛాన్స్ పోగొట్టుకుంది పాకిస్తాన్.

Advertisement

అటు దీనిపై రివ్యూ తీసుకోగా, నాటౌట్ అని తేలింది. అలా రివ్యూను కూడా రిజ్వాన్ కార‌ణంగా పాకిస్తాన్ కోల్పోయింది. అయితే దీనిపై దారుణంగా ట్రోల్స్ వస్తున్నాయి. మహమ్మద్ రిజ్వాన్ కు వికెట్ కీపింగ్ చేతకాదని పరువు తీస్తున్నారు. ఎల్బిడబ్ల్యు కోసం ఎక్కువగా అప్పీలు చేయకుండా… వెంటనే బంతిని తీసుకొని వికెట్లను బాదేసి ఉంటే, కచ్చితంగా లారెన్స్ అవుట్ అయ్యేవాడని చెబుతున్నారు. రిజ్వాన్ కు న‌మాజ్ చేయ‌డం త‌ప్ప‌, బ్యాటింగ్, కీపింగ్ చేత‌కాద‌ని ఇజ్జ‌త్ తీస్తున్నారు.

Shoaib Akhtar ON Mohammad Amir: ఐపీఎల్ 2027లో మహ్మద్ అమీర్ ను ఆడించండి..బీసీసీఐకి అక్త‌ర్ రిక్వెస్ట్!

 

 

 

Related News

కోహ్లీ, మెస్సి, రోనాల్డో కంటే, పాకిస్తాన్ గొప్ప ప్లేయ‌ర్లు ఉన్నారు

2007లోనే టీమిండియాను ఓడించి, ఇంటికి పంపించాం

ఆసియా క‌ప్ గెలిస్తే, అన్ని మూసుకుని న‌ఖ్వీ చేతుల మీదుగా తీసుకోవాల్సిందే

విరాట్ కోహ్లీనే రియ‌ల్ కింగ్…అత‌ను పాకిస్తాన్ లో పుట్టుంటే బాగుండేది

ఇంగ్లండ్ చేతిలో 3-0 తేడాతో పాకిస్తాన్ వైట్ వాష్ కావ‌డం ప‌క్కా

2024 టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో టెస్ట్ ప్లేయ‌ర్ కంటే దారుణంగా ఆడాడు…కోహ్లీ ప‌రువు తీసిన అక్ష‌ర్ ప‌టేల్!

బాబ‌ర్ ఆజం పెద్ద మోస‌గాడు…PCBని మోసం చేసి, ఇంగ్లాండ్ కు వెళ్లాడు

Big Stories

Advertisement
×