BigTV English

AP Politics : జనసేనను చూసి వైసీపీ నేర్చుకోవాల్సింది ఇదేనా!

AP Politics : జనసేనను చూసి వైసీపీ నేర్చుకోవాల్సింది ఇదేనా!

AP Politics : జనసేన. నిఖార్సైన పార్టీ. పవన్ కల్యాణ్. నమ్మదగిన సేనాని. రాజకీయాలు తక్కువ.. ప్రజాసేవ ఎక్కువ. తాను తగ్గి.. కూటమి నెగ్గి.. గేమ్ ఛేంజర్‌గా నిలిచారు. ఏడాదిగా 24 బై 7 నాన్‌స్టాప్ పని చేశారు. డిప్యూటీ సీఎంగా అనేక సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీ పరంగానూ అదే దూకుడు. చేరికలతో పాటు తీసివేతలూ ఉన్నాయి. కొవ్వూరు జనసేన ఇంఛార్జ్ అయిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావుపై వేటు వేసి షాక్ ఇచ్చింది. అంతలోనే మరో బ్రేకింగ్ న్యూస్. శ్రీకాళహస్తి జనసేన ఇంఛార్జ్ వినుతను ఏకంగా పార్టీ నుంచి బహిష్కరిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది జనసేన.


జనసేన క్లియర్ కట్ మెసేజ్

కోట వినుతకు గతంలో పీఏగా పని చేసిన రాయుడు.. తమిళనాడులో అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఆ కేసులో వినుత, ఆమె భర్తను పోలీసులు అరెస్ట్ చేయడంతో వెంటనే వారిపై వేటు వేసింది జనసేన. గంటల గ్యాప్‌లోనే పార్టీ నిర్ణయం తీసేసుకుంది. ఇంకా నేరం నిరూపితం కాకపోయినా.. మర్డర్ కేసులో సస్పెక్ట్‌గా ఉన్నందుకే పార్టీ నుంచి తొలగించి క్లీన్ పాలిటిక్స్‌ అంటే ఏంటో చూపించింది జనసేన. గతంలోనూ ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. పార్టీ ప్రధాన నేత కిరణ్ రాయల్‌పై ఓ మహిళ ఆరోపణలు చేయడంతో వెంటనే ఆయన్ను సస్పెండ్ చేసి.. ఎంతవారుకానీ తేడా వస్తే డోంట్ కేర్ అనే మెసేజ్ బలంగా ఇచ్చింది. లేటెస్ట్‌గా హత్య కేసులో అనుమానితురాలిగా ఉన్నందుకు పార్టీ ఇంఛార్జ్‌గా ఉన్న వినుత కోటపై వేటు వేయడం సంచలనమే.


వైసీపీ సంగతేంటి?

ఎంత తేడా? వైసీపీకి జనసేనకు ఎంత తేడా? మూడేళ్ల క్రితం వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు.. తన దగ్గర పని చేసిన దళిత డ్రైవర్‌ను చంపేశారనే కేసు అప్పట్లో కలకలం రేపింది. కారులో డెడ్‌బాడీ డోర్ డెలివరీ చేస్తే.. అతన్ని ఆ పార్టీ కాపాడే ప్రయత్నం చేసిందనే విమర్శ ఉంది. ఆయన అప్పుడూ ఇప్పుడూ వైసీపీ కండువాతోనే దర్జాగా తిరుగుతున్నారు. జైలు నుంచి బెయిల్‌పై విడుదల అయితే వైసీపీ శ్రేణులు పార్టీ జెండాలతో భారీ ఊరేగింపుతో అనంతబాబుకు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పిన దృశ్యాలు.. జనాలు నివ్వెర్రపోయేలా చేశాయంటారు. హంతకులకు వైసీపీ ఇచ్చే ప్రయారిటీ ఇలా ఉంటుందంటూ అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ కూడా నడిచింది. ఇప్పుడు జనసేన చేసిన పని అందరితో శెభాష్ అనిపించుకుంటోంది. ఆరోపణలు వచ్చిన గంటల వ్యవధిలోనే పార్టీ ఇంఛార్జ్‌పై వేటు వేసి.. ఇలాంటి క్రిమినల్ చర్యలను ఉపేక్షించబోమంటూ స్పష్టమైన సందేశం ఇచ్చిందని అంటున్నారు. జనసేనను, వైసీపీని కంపేర్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

Also Read : ఆ బెంచీలు జగన్‌వి.. మరి, అసెంబ్లీ చంద్రబాబుదా?

జనసేనను చూసి నేర్చుకోవాాలా?

ఎమ్మెల్సీ అనంతబాబు ఎపిసోడ్ మాత్రమే కాదు.. వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కేసులోనూ వైసీపీ తీరును జనాలు అసహ్యించుకుంటున్నారని అంటున్నారు. బాబాయ్‌ని చంపేసింది ఎవరో.. అసలు నిందితులు, సూత్రధారులు ఎవరో ఏపీలో ఓపెన్ సీక్రెట్. కానీ, ఆ హంతకులకే జగనన్న కొమ్ము కాస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. సొంత బాబాయ్‌ని చంపిన వారినే పార్టీ ప్రయోజనాల కోసం నెత్తిన పెట్టుకోవడం దారుణం అంటున్నా.. వీ డోంట్ కేర్ అనేలా ఉందంటున్నారు వైసీపీ పెద్దల తీరు. జనసేన మాత్రం ఇలాంటి వాటికి పూర్తి దూరం. లేటెస్ట్ కేసులో వినుత కోటను పార్టీ నుంచి బహిష్కరించి రాజకీయాల్లో ఓ బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది జనసేన అని అంటున్నారు.

Related News

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Big Stories

×