
KA Paul latest news(Andhra pradesh today news):
అసలే కేఏ పాల్. ఏం మాట్లాడుతారో తెలీదు. ఏం చేస్తారో అంతకన్నా అర్థంకాదు. అలాంటి ఆయన తన ప్రజాశాంతి పార్టీ తరఫున దీక్షకు దిగారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయొద్దని డిమాండ్ చేస్తున్నారు. సోమవారం సాయంత్రం నుంచి విశాఖలో ఆమరణ దీక్షకు కూర్చున్నారు. కేంద్రం దిగొచ్చే వరకూ తగ్గేదేలే అన్నారు.
కేంద్రం దిగిరాలేదు కానీ, పోలీసులు అయితే రానే వచ్చారు. మంగళవారం సాయంత్రం పాల్ దీక్షా శిబిరంపై దాడి చేశారు. శాంతిదూతను బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. దీక్షను భగ్నం చేశారు. ఆయనతో పాటు పాల్ కోడలిని కూడా అదుపులోకి తీసుకున్నారు.
ఎంతమంది పోలీసులు పట్టుకున్నా పాల్ ఆగలేదు. వారి నుంచి విడిపించుకుంటూ.. నెట్టివేస్తూ.. అరుస్తూ నానాహంగామా చేశారు. పోలీసులపై ఫుల్‌గా రెచ్చిపోయారు పాల్. ఈ సందర్భంగా ఓ పోలీస్‌ను చొక్కా పట్టుకుని లాగడం కలకలం రేపింది.
పాల్ తీరుపై కాప్స్ ఫైర్ అవుతున్నారు. ఆయనపై కఠినమైన సెక్షన్లు ప్రయోగించేందుకు రెడీ అవుతున్నారు.
Dogs: కుక్కల దాడి కేసులో హైకోర్టు మొట్టికాయలు.. నగరంలో కుక్కల వేట షురూ..