
Kuppam: ప్రజలకు సేవలు అందించడం కోసమే NTR ట్రస్ట్ స్థాపించామని నారా భువనేశ్వరి తెలిపారు. ఉన్నత ఆశయం కోసం తలపెట్టిన సేవలు కొనసాగించడంపై ఆనందం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా కుప్పంలో ఎన్టీయార్ సంజీవిని ఉచిత వైద్యశాలను ప్రారంభించారు.
కుప్పంలో త్వరలో ఇంటి నిర్మాణం పూర్తవుతుందని భువనేశ్వరి చెప్పారు. గృహ నిర్మాణం పూర్తైన తర్వాత పండుగలన్నీ ఇక్కడే జరుపుకుంటామన్నారు. కుప్పం ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతో ఎన్టీయార్ సంజీవిని ఏర్పాటు చేశామన్నారు.
పసుపు-కుంకుమ కార్యక్రమంలో మహిళలు చూపిస్తున్న ఆదరణ పట్ల భువనేశ్వరి ఆనందం వ్యక్తం చేశారు. NTR స్మారక నాణెం విడుదల చేయడం ఆనందంగా ఉందన్నారు. కుప్పంలో ఎన్టీయార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భవనాలు నిర్మిస్తామని భువనేశ్వరి చెప్పారు.