Paddy Upton: దొమ్మరాజు గుకేశ్.. ఈ కుర్రాడు సాధించిన విజయంతో యావత్ భారతావని పులకరించిపోతుంది. కేవలం 18 ఏళ్ల వయసులోనే చదరంగ రారాజుగా అవతరించిన గుఖేశ్ {Dommaraju Gukesh} పై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. దేశమంతా గుకేశ్ గురించే మాట్లాడుకుంటున్నారు. సింగపూర్ వేదికగా జరిగిన వరల్డ్ ఛాంపియన్ టోర్నీ ఫైనల్ లో ఈ 18 ఏళ్ల గుకేశ్.. డిఫెండింగ్ ఛాంపియన్ చైనా స్టార్ డింగ్ లిరెన్ ని ఓడించి విజేతగా నిలిచాడు.
Also Read: Sunil Gavaskar: హోటల్‌లో పడుకోవడం మానేయండి…టీమిండియా ప్లేయర్లకు వార్నింగ్ !
దీంతో వరల్డ్ చెస్ ఛాంపియన్ టైటిల్ ని గెలిచిన అతి చిన్న వయస్కుడిగా దొమ్మరాజు గుకేశ్ {Dommaraju Gukesh} చరిత్ర సృష్టించాడు. సింగపూర్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఛాంపియన్షిప్ టోర్నీలో గురువారం జరిగిన ఆఖరిదైన 14వ రౌండ్ లో లిరిన్ ఘోర తప్పిదాన్ని గుకేశ్ పూర్తిగా సద్వినియోగం చేసుకొని టైటిల్ కైవసం చేసుకున్నాడు. లిరెన్ తో జరిగిన 14 గేమ్ ల పోరులో గుకేశ్ 7.5 – 6.5 పాయింట్ల తేడాతో గెలుపొందాడు. 58 ఎత్తుల్లో 32 ఏళ్ల లిరెన్ ఆటకు చెక్ పెట్టాడు. దీంతో విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండవ భారత ఆటగాడిగా గుకేశ్ {Dommaraju Gukesh} గుర్తింపు పొందాడు.
Also Read: Mohammed Shami – Rohit Sharma: టీమిండియాలో అంతర్గత గొడవలు..రోహిత్ శర్మ వర్సెస్ షమీ ?
ఈ గెలుపుతో గుకేశ్ తెలుగు వాడే అన్న చర్చ కూడా జరుగుతుంది. గుఖేశ్ తల్లిదండ్రులు తెలుగు వాళ్లే. కానీ అతడు చెన్నైలో పుట్టి, పెరిగాడు. అతని తల్లిదండ్రులు ఇద్దరూ వైద్యులే. ఇప్పుడు అతను ఛాంపియన్ గా గెలుపొందడంతో అతని పూర్వికుల అంశంపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఇదిలా ఉంటే.. గుకేశ్ విజయంలో టీమిండియా మాజీ కోచ్ ప్యాడి ఆఫ్టన్ {Paddy Upton} కీలక పాత్ర పోషించారు. ప్యాడి ఆఫ్టన్ కి మెంటల్ కండిషనింగ్ కోచ్ గా మంచి గుర్తింపు ఉంది. చదరంగం అంటేనే మైండ్ గేమ్. అలాంటి ఆటలో అతని ఏకాగ్రత దెబ్బతినకుండా ప్యాడి అతనికి ఎంతో అండగా నిలిచాడు.
Also Read: Gautam Gambhir: టీమిండియా ఓటమికి కుట్రలు..గంభీర్ పై ట్రోలింగ్ ?
ఫైనల్ లో గుకేశ్ ఏకాగ్రతను దెబ్బతీసేందుకు చైనా ప్లేయర్ డింగ్ లిరెన్ ఎంతగానో ప్రయత్నించాడు. కానీ గుకేశ్ మాత్రం అతని ట్రాప్ లో పడలేదు. ప్యాడి ఇచ్చిన శిక్షణతో గుకేశ్ మానసిక బలాన్ని పెంచుకున్నాడు. ఆప్టన్ శిక్షణలో గుకేశ్ అంతలా రాటుదేలారు. 2011 వరల్డ్ కప్ గెలిచిన టీమ్ ఇండియాకి, ప్యారిస్ ఒలంపిక్స్ లో మెడల్ సాధించిన ఇండియా హాకీ టీం వెనక ఉంది కూడా ఆఫ్టనే {Paddy Upton}. ఇక ప్రపంచ చెస్ ఛాంపియన్ టైటిల్ గెలిచిన గుకేశ్ కి ట్రోఫీతో పాటు రూ. 11.45 కోట్ల ప్రైస్ మనీ గెలిచాడు. రన్నరప్ గా నిలిచిన లిరెన్ రూ. 9.75 కోట్లు అందుకున్నాడు. ఇక రాబోయే రోజుల్లో గుకేశ్ మరిన్ని విజయాలు నమోదు చేయాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.