E-Paper
Advertisement

జేసీని మెంటల్ ఆస్పత్రిలో చేర్పించండి.. కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలు!

జేసీని మెంటల్ ఆస్పత్రిలో చేర్పించండి.. కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Advertisement

Ketireddy Peddareddy: అనంతపురం జిల్లా తాడిపత్రి రాజకీయాల్లో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డిల మధ్య సవాల్-ప్రతిసవాల్ల పర్వం మరోసారి హీటెక్కింది. తాజాగా కేతిరెడ్డి పెద్దారెడ్డి మీడియాతో మాట్లాడుతూ జేసీ ప్రభాకర్ రెడ్డి వైఖరిపై, స్థానిక పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

శాంతియుత దీక్షకు భగ్నం – పోలీసుల పక్షపాతం

Advertisement

తాడిపత్రిలోని గాంధీ విగ్రహం వద్ద శాంతియుతంగా దీక్ష చేపట్టేందుకు తాము అనుమతి కోరినప్పటికీ, పోలీసులు నిరాకరించడంపై పెద్దారెడ్డి మండిపడ్డారు. పోలీసుల ఆంక్షల కారణంగానే తాను ఇంటి వద్దే దీక్ష చేయాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ తనకు నిరసన తెలపడానికి అనుమతి ఇవ్వకపోవడంతోనే ఎస్పీ కార్యాలయం ఎదుట ధర్నా చేయాల్సి వచ్చిందన్నారు. ప్రస్తుతం జిల్లాలో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, వైసీపీ నాయకులు ఇస్తున్న ఫిర్యాదులపై కేసులు నమోదు చేయడం లేదని, కానీ వైసీపీ వారిపై మాత్రం అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు.

జేసీ ప్రభాకర్ రెడ్డి ఫ్యాక్షన్ సంస్కృతి

Advertisement

జేసీ ప్రభాకర్ రెడ్డి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, తాడిపత్రిలో మళ్లీ ఫ్యాక్షన్ చేస్తానంటూ రౌడీయిజానికి దిగుతున్నారని పెద్దారెడ్డి విమర్శించారు. వ్యక్తిగత దూషణలు చేయడం దుర్మార్గపు చర్య అని, జిల్లాలోని అందరూ తనలాగే దౌర్జన్యంగా వ్యవహరించాలని జేసీ ఆకాంక్షిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ ఎప్పుడూ దౌర్జన్యం చేస్తామని చెప్పలేదని, జేసీ ప్రభాకర్ రెడ్డే అనవసరంగా రెచ్చగొట్టి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలోనే ‘జేసీ చేస్తున్న ఈ దౌర్జన్యాలన్నీ సీఎం చంద్రబాబు, లోకేష్‌ల అనుమతితోనే జరుగుతున్నాయా?’ అని పెద్దారెడ్డి ప్రశ్నించారు.

Also Read: ఆడబిడ్డలకు రూ.2,500 ఇస్తే.. రాజకీయ సన్యాసం చేస్తా.. కేటీఆర్ ఓపెన్ ఛాలెంజ్

అప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు టీడీపీలో దుస్థితి

గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు జేసీ కుటుంబానికి అనంత వెంకట్రామిరెడ్డి, రఘువీరారెడ్డిలు కొండంత అండగా నిలబడ్డారని, వాళ్లే లేకుంటే ఈరోజు జేసీ కుటుంబం ఎక్కడ ఉండేదని పెద్దారెడ్డి గుర్తుచేశారు. ఒకప్పుడు ఎంతోమందికి టికెట్లు ఇప్పించిన చరిత్ర గల జేసీ కుటుంబం, ఈరోజు సొంత టికెట్ కోసం వెంపర్లాడాల్సిన దుస్థితికి చేరిందని ఎద్దేవా చేశారు. జేసీ ఆలోచనా విధానం సరిగా లేకపోవడం వల్లే ప్రస్తుతం టీడీపీ నాయకులు కూడా ఆయనకు సహకరించడం లేదన్నారు.

అధికారులపై వేధింపులు – గంజాయి సరఫరా

పోలీస్ స్టేషన్లకే తాళాలు వేసిన నల్లటి చరిత్ర జేసీ కుటుంబానిదని పెద్దారెడ్డి ధ్వజమెత్తారు. మాట వినని అధికారులను టార్గెట్ చేయడం, బూతులు తిట్టడం జేసీకి అలవాటుగా మారిందన్నారు. తాడిపత్రిలో అధికారుల కనుసన్నల్లోనే యథేచ్ఛగా గంజాయి సరఫరా జరుగుతోందని సంచలన ఆరోపణలు చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డికి మతిస్థిమితం లేదని, వెంటనే సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకుని మెంటల్ ఆస్పత్రిలో చేరాలని హితవు పలికారు. తాడిపత్రి మున్సిపాలిటీ అభివృద్ధి అంతా అబద్ధమని, జేసీ చెప్పేదొకటి చేసేదొకటని విమర్శించారు. చెంచాలతో తిట్టించడం మానుకోవాలని, తాము జేసీ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని పెద్దారెడ్డి తేల్చిచెప్పారు.

Related News

ఆధారాలు పట్టుకుని రండి.. డీఎస్సీపై చర్చకు మేము సిద్ధం.. వైసీపీకి చంద్రబాబు ఓపెన్ ఛాలెంజ్!

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు.. రాజమండ్రి కోర్టుకు హాజరైన ఎమ్మెల్సీ అనంతబాబు!

అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్.. స్టీల్ బ్రిడ్జ్ వద్ద ఆ ‘వంపు’ ఎందుకు?

అమరావతిని ఆపడం ఎవరితరం కాదు.. గ్రేట్ విజన్‌కు మొదటి సక్సెస్ మాత్రమే-సీఎం చంద్రబాబు

శ్రీకాకుళంలో టైటానియం ప్లాంట్‌.. సీఎం చంద్రబాబుతో కరణ్ అదానీ భేటీ, రూ.16 వేల కోట్లు పెట్టుబడులు

భోగాపురం ఎయిర్‌పోర్టులో రాకపోకలు.. ప్రత్యేక విమానంలో బీజేపీ ఎంపీ, టీడీపీ ఎమ్మెల్యే!

ఉప్పాడ తీర రక్షణకు.. ఐఐటీ మద్రాస్‌తో కీలక ఒప్పందం, మాట నిలబెట్టుకున్న పవన్

ఎమ్మెల్యేలకు బిగ్ షాక్! సభకు రాకపోతే జీతాల్లేవ్.. ఏపీ స్పీకర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×