E-Paper
Advertisement

ఇంటికి ఎదురుగా ముసుగేసుకుని కూర్చొనే మహిళ… దగ్గరయ్యే కొద్దీ పెరిగే భయం… సూపర్‌నేచురల్ హారర్ థ్రిల్లర్

ఇంటికి ఎదురుగా ముసుగేసుకుని కూర్చొనే మహిళ… దగ్గరయ్యే కొద్దీ పెరిగే భయం… సూపర్‌నేచురల్ హారర్ థ్రిల్లర్
Advertisement

Horror Thriller Movie: భర్త చనిపోయిన తర్వాత ఇద్దరు పిల్లలతో ఒంటరిగా జీవించాల్సి వస్తుంది ఓ తల్లికి. ఇప్పటికే జీవితమే భారంగా ఉన్న సమయంలో ఆమె ఇంటి బయట ఓ గుర్తుతెలియని మహిళ కనిపిస్తుంది. ఆమె కదలకుండా కూర్చుంటుంది. దగ్గరికి రావడానికి ప్రయత్నించిన కొద్దీ పరిస్థితి మరింత భయంకరంగా మారుతుంది. ఆమె ఎవరు, అక్కడికి ఎందుకు వచ్చింది ? అనే విషయం కంటే… ఆ మహిళ కనిపించిన తర్వాత ఇంట్లో జరుగుతున్న మార్పులే కుటుంబాన్ని వణికిస్తాయి. క్రమంగా ఇది బయట ఉన్న ప్రమాదం కాదని, ఆ ఇంట్లోని విషాదంతో ముడిపడి ఉన్నదని అర్థమవుతుంది. ఇదే స్టోరీతో రూపొందిన మూవీ ‘ది వుమన్ ఇన్ ది యార్డ్’ (The Woman in the Yard). మరి ఈ సినిమాను ఎక్కడ చూడవచ్చో తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

రమోనా భర్త మరణించిన తర్వాత ఇద్దరు పిల్లలు టేలర్, అన్నీతో కలిసి ఇంట్లో ఉంటుంది. భర్తను కోల్పోయిన బాధ నుంచి పూర్తిగా బయటపడక ముందే పిల్లల బాధ్యత ఆమెపై పడుతుంది. ఆ పరిస్థితుల్లోనే ఇంటి బయట ఓ నల్లటి దుస్తులు ధరించిన, ముఖం స్పష్టంగా కనిపించని మహిళ కూర్చుని ఉండటం గమనిస్తుంది. ఓ రకంగా చెప్పాలంటే బురఖా వేసుకుని కూర్చుంటుంది. మొదట ఆమెను సాధారణంగా పట్టించుకోకపోయినా, ఆ మహిళ అక్కడి నుంచి వెళ్లకుండా ఉండటం రమోనాలో భయాన్ని పెంచుతుంది.

Advertisement

ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేసినా సమాధానాలు సాధారణంగా ఉండవు. ఆ మహిళ పలికే మాటల్లో ఏదో హెచ్చరిక దాగి ఉన్నట్లు అనిపిస్తుంది. ముఖ్యంగా ఆమె ఇంటి వైపు కదులుతున్న కొద్దీ రమోనాకు ఏం జరుగుతుందో అర్థం కాకుండా పోతుంది. పిల్లలను ఆమె నుంచి దూరంగా ఉంచేందుకు రమోనా ప్రయత్నిస్తుంది. కానీ ఇంట్లోనే కొన్ని వింత సంఘటనలు మొదలవుతాయి. రమోనా గతం, భర్త మరణం, తన మానసిక స్థితి, ఇంటి చుట్టూ కనిపిస్తున్న ఆ మహిళ మధ్య సంబంధం ఏమిటనేది కథలో కీలకంగా మారుతుంది.

బయట కనిపిస్తున్న భయం నిజంగానే అతీంద్రియ శక్తికి సంబంధించినదా ?, లేక రమోనా అనుభవిస్తున్న మరో వాస్తవానికి ప్రతిబింబమా ? అనే అనుమానం కూడా కలుగుతుంది. పిల్లలను కాపాడుకోవాలనే తల్లి పోరాటం, తనకు ఎదురవుతున్న వింత అనుభవాల మధ్య కథ ముందుకు సాగుతుంది. ఆ మహిళ దగ్గర పడుతున్న కొద్దీ రమోనా కుటుంబం సురక్షితమైన ఇంట్లో ఉన్నామనే నమ్మకాన్ని కోల్పోతుంది. ఇంటి తలుపులు, బయట ప్రదేశం, రాత్రి సమయం అన్నీ భయాన్ని పెంచే అంశాలుగా మారతాయి. చివరకు ఆ మహిళ వెనుక ఉన్న రహస్యం బయట పడుతుందా ? చివరికి ఆ కుటుంబాన్ని ఆ దెయ్యం ఏం చేసింది ? అన్నది సినిమాలో చూడాల్సిందే.

ఎక్కడ చూడొచ్చు ?

Advertisement

డేనియల్ డెడ్‌వైలర్ (Danielle Deadwyler), ఓక్వి ఓక్పోక్వాసిలి (Okwui Okpokwasili), రస్సెల్ హార్న్స్‌బీ (Russell Hornsby) నటించిన ఈ సినిమాకు జౌమ్ కొలెట్ – సెర్రా (Jaume Collet-Serra) దర్శకత్వం వహించారు. ఇది JioHotstarలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంగ్లీష్, హిందీ ఆడియోలు అందుబాటులో ఉన్నాయి. తెలుగు డబ్బింగ్ అందుబాటులో లేదు.

Read Also: పాడుబడిన భవంతిలో దెయ్యం… భయంతో పాటు కడుపుబ్బా నవ్వించే హారర్ కామెడీ

Tags

Related News

ఇన్ఫినిటీ క్యాసిల్‌లో డెమాన్స్‌పై ఫైనల్ వార్… తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతున్న సూపర్ హిట్ యాక్షన్ యానిమే

ఉద్యోగం కోసం పోరాటం… కానీ ఆఫీస్‌లో ఎవరినీ నమ్మలేని పరిస్థితి… చైనీస్ వర్క్‌ప్లేస్ డ్రామా

నెట్ ఫ్లిక్స్ లోకి రాబోతున్న ‘రోమాంచకం’ .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

యాక్సిడెంట్లో యూనికార్న్ డెత్… రక్తం కోసం మనుషులే రాక్షసులైతే? క్రేజీ హారర్ థ్రిల్లర్

ఇట్స్ అఫీషియల్ ఓటీటీలోకి కార్తీ సర్దార్ 2.. ఎప్పుడంటే?

ఓటీటీలోకి మెగాస్టార్ చిరంజీవి..హోస్ట్ గా కొత్త బాధ్యతలు?

ఓటీటీలో రికార్డ్ సృష్టించిన ఇరుముడి.. ఎన్నో స్థానం అంటే?

Big Stories

Advertisement
×