BigTV English

Bigg Boss 9: గంటలో కేజీ వెయిట్.. ఫోర్ హెడ్ పై పచ్చబొట్టు.. ఈ ట్విస్ట్ లు మామూలుగా లేవుగా!

Bigg Boss 9: గంటలో కేజీ వెయిట్.. ఫోర్ హెడ్ పై పచ్చబొట్టు.. ఈ ట్విస్ట్ లు మామూలుగా లేవుగా!

Bigg Boss Agnipariksha: ప్రస్తుతం తెలుగులో బిగ్ బాస్ సీజన్ 9 సెప్టెంబర్ 5 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా అగ్నిపరీక్ష అంటూ ఒక మినీ షోని నిర్వహిస్తున్నారు. ఐదు మంది సామాన్యులను హౌస్ లోకి పంపించడానికి ఈ షో నిర్వహిస్తున్నారని మొదట వార్తలు వినిపించగా…ఇప్పుడు మొత్తం తొమ్మిది మంది సామాన్యులు హౌస్ లోకి వెళ్ళబోతున్నారని.. మరో 9 మంది సెలబ్రిటీలు హౌస్ లోకి వస్తారని సమాచారం.


4వ ఎపిసోడ్ 3వ ప్రోమో రిలీజ్..

ఇదిలా ఉండగా ఇప్పటివరకు 3 ఎపిసోడ్లు ప్రసారం కాగా.. అందులో 15 మందికి వివిధ టెస్టులు నిర్వహించగా.. అందులో 6 మంది దాదాపు ఖరారు అయినట్లు సమాచారం. మరో 16 మందికి టెస్టులు నిర్వహించి అందులో నుంచి ముగ్గురిని సెలెక్ట్ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈ అగ్ని పరీక్ష షో కి సంబంధించిన మూడు ఎపిసోడ్లు పూర్తవగా.. ఇప్పుడు నాలుగవ ఎపిసోడ్ కి సంబంధించిన 3వ ప్రోమోని నిర్వహకులు విడుదల చేశారు. ఈ ప్రోమో ఆద్యంతం ట్విస్టులతో ఆకట్టుకుంటోంది.


అతడి సిక్స్ ప్యాక్ చూసి సిగ్గు పడిపోయిన శ్రీముఖి..

ప్రోమో విషయానికి వస్తే.. డేర్ ఆర్ డై టాస్క్ లో భాగంగా.. ఇద్దరు కంటెస్టెంట్లు స్టేజ్ పైకి రాగా ఫ్యాట్ పర్సంటేజ్ ఎంత అని జడ్జ్ అభిజిత్ ప్రశ్నించగా.. ఆ వ్యక్తి టీ షర్టు పైకెత్తి తన సిక్స్ ప్యాక్ చూపించాడు. ఇక శ్రీముఖి సిగ్గుపడుతూ క్యూట్ పర్సంటేజ్ 90 కావచ్చు అంటూ సిగ్గుపడిపోయింది. ఇక ఆ ఇద్దరి వ్యక్తులతో అభిజిత్ మాట్లాడుతూ.. 10 మినిట్స్ లో కేజీ వెయిట్ ఎవరైతే పెరగగలుగుతారో వాళ్లు ఈ టాస్క్ గెలిచినట్టు అంటూ జంక్ ఫుడ్ , బిర్యాని వీరి ముందు ఉంచుతారు. ఫిట్నెస్ కోసం ఆరాటపడే ఇద్దరు వ్యక్తుల మధ్య ఇలాంటి పోటీ నిజంగా అత్యంత క్లిష్టమనే చెప్పాలి.

అంత సాహసం చేస్తారా?

ఇంకో ఇద్దరు అమ్మాయిల మధ్య శ్రీముఖి పోటీ పెట్టింది. అందులో టాటూ వేయించుకోవాలని.. పైగా ఆ టాటూ ఫోర్ హెడ్ పైన వేయించుకోవాలని, అంతేకాదు ఐ యామ్ ఏ లూసర్ అనే టాటూ వేయించుకోవాలని చెప్పడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.మరి ఈ ఇద్దరిలో అంత సాహసం చేసేవారు ఎవరు అని ప్రతి ఒక్కరు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఏది ఏమైనా బిగ్ బాస్ అగ్నిపరీక్షలో ఇలాంటి ట్విస్ట్ లు నిజంగా ఎవరు ఊహించనివి అని ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తున్నారు. మరి ఇన్ని కఠిన పరీక్షలు తట్టుకొని హౌస్ లోకి వెళ్లే ఆ 9 మంది సామాన్యులు ఎవరో చూడాలి.

ALSO READ:Parineeti Chopra: తల్లి కాబోతున్న పరిణీతి చోప్రా.. పోస్ట్ వైరల్!

 

Related News

Bigg Boss 9: డేర్ అండ్ డై.. హౌస్ కి మించిన ట్విస్ట్ లు.. ఊహించలేదు భయ్యో!

Bigg Boss AgniPariksha: స్థానాన్ని ఖరారు చేసుకున్న 6గురు సామాన్యులు వీరే.. పెండింగ్లో మరో 16మంది!

Bigg Boss 9 : బిగ్ బాస్ లో సామాన్యులకు ఇచ్చేది అంత తక్కువా..?

Ankita Naidu: అగ్నిపరీక్ష స్టేజ్ పై అడుగుపెట్టకుండానే లాగేసారు.. నిజాలు బయటపెట్టిన అంకిత నాయుడు!

Bigg Boss Noel: కొత్త కారు కొన్న బిగ్ బాస్ నోయెల్.. వీడియో వైరల్!

Big Stories

×