Rahul Mamkootathil: కేరళలోని పాలక్కాడ్ నియోజకవర్గ ఎమ్మెల్యే రాహుల్ మమ్‌కూటథిల్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో కాంగ్రెస్ పార్టీ ఆయనను ప్రాథమిక సభ్యత్వం నుంచి సస్పెండ్ చేసింది. ఈ నిర్ణయం ఆగస్టు 25, 2025న జరిగింది. రాహూల్ మమ్‌కూటథిల్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండేవాడు, కానీ ఆరోపణలు రావడంతో గత వారం ఆ పదవి నుంచి రాజీనామా చేశాడు. ఇప్పుడు పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి ఆరు నెలల పాటు సస్పెండ్ చేయడంతో ఆయనకు భారీ షాక్ తగిలింది. ఈ సస్పెన్షన్‌తో ఆయన పార్టీ కార్యక్రమాలు, లెజిస్లేటివ్ మీటింగ్‌లు, పార్లమెంటరీ పార్టీ సమావేశాల్లో పాల్గొనలేడు.
రాహుల్ మమ్‌కూటథిల్ మొదటి సారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. గత ఏడాది నవంబర్‌లో పాలక్కాడ్ బై-ఎలక్షన్‌లో గెలిచాడు. ముందు కేఎస్‌యూ (కేరళ స్టూడెంట్స్ యూనియన్)లో ఆడూర్ అధ్యక్షుడు, రాష్ట్ర జనరల్ సెక్రటరీగా పనిచేశాడు. తర్వాత యూత్ కాంగ్రెస్‌లో నాయకత్వ బాధ్యతలు చేపట్టాడు. ఆ తర్వాత ఆయన యువ నాయకుడిగా ప్రసిద్ధి చెందాడు, కానీ ఇప్పుడు ఈ ఆరోపణలు ఆయన రాజకీయ జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయి.
అయితే పలువురు మహిళల నుంచి లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. మలయాళ నటి, మాజీ టీవీ జర్నలిస్ట్ రిని ఆన్ జార్జ్ ఒక యువ రాజకీయ నాయకుడు తనకు అసభ్యకరమైన మెసేజ్‌లు పంపి, హోటల్‌కు ఆహ్వానించాడని ఆరోపించింది. ఆమె పేరు చెప్పకపోయినా, రాహూల్‌నే ఉద్దేశించి మాట్లాడినట్లు స్పష్టమైంది. దీని తర్వాత రచయిత్రి హనీ భాస్కరన్ కూడా ఆయన ఇన్‌స్టాగ్రామ్ డీఎమ్‌లలో అసభ్యకరమైన సంభాషణలు ప్రారంభించాడని ఆరోపించింది. ఒక ట్రాన్స్‌వుమన్ అవంతికా ఆయనపై మరిన్ని తీవ్రమైన ఆరోపణలు చేసింది.
Also Read: ముంచుకోస్తున్న మరో అల్పపీడనం.. నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
దీంతో కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) అధ్యక్షుడు సన్నీ జోసెఫ్, ఆపోజిషన్ లీడర్ వీడీ సతీశన్, సీనియర్ నాయకుడు రమేష్ చెన్నిథల లాంటి నాయకులు చర్చలు జరిపి సస్పెన్షన్ నిర్ణయం తీసుకున్నారు. పార్టీలోని మహిళా నాయకులు ఉమా థామస్, షానిమోల్ ఉస్మాన్ లాంటి వారు ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఆయనను పార్టీ సస్పెండ్ చేసింది.