BigTV English

Manchu Manoj: మంత్రి లోకేష్‌తో మంచు మనోజ్ భేటీ.. అందుకేనా..?

Manchu Manoj: మంత్రి లోకేష్‌తో మంచు మనోజ్ భేటీ.. అందుకేనా..?

Manchu Manoj: నారావారిపల్లిలో మంత్రి నారా లోకేష్‌తో నటుడు మంచు మనోజ్ దంపతులు భేటీ అయ్యారు. మంత్రి లోకేష్‌కు మనోజ్ దంపతులు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. తాను ఎదుర్కొంటున్న సమస్యలపై మంత్రితో మనోజ్ చర్చించినట్లు తెలుస్తోంది. మరోవైపు మోహన్ బాబు యూనివర్సిటీకి రావొద్దంటూ పోలీసులు మనోజ్‌కు నోటీసులిచ్చారు. లోకేష్ తో భేటీ అనంతరం మనోజ్ ఎటు వెళ్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.


అయితే గత కొన్ని రోజుల నుంచి మంచు కుటుంబంలో జరిగిన పరిణామాలు తీవ్ర రచ్చకు దారి తీశాయి. నిన్న నారావారిపల్లె నుంచి మోహన్ బాబు కాలేజీ వరకు మంచు ఫ్యామిలీ సంబంధించిన ఫ్లెక్సీలను ఏర్పాటుచేశారు. ఓ వైపు మనోజ్, విష్ణు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా.. రాత్రికి రాత్రే మంచి మనోజ్ కు సంబంధించిన ఫ్లెక్సీలను తొలగించారు. అయితే, మోహన్ బాబు కాలేజీకి మంచు మనోజ్ వస్తారన్న సమాచారంతో అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రస్తుతం మోహన్ బాబు, విష్ణు కాలేజీ వద్దే ఉన్నారు. దీంతో మంచి మనోజ్ అక్కడకు వస్తే తీవ్ర పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉండడంతో పోలీసులు గట్టి భద్రతను ఏర్పాటు చేశారు.

ఇప్పటికే మంచు మనోజ్‌కు మోహన్ బాబు కాలేజీలోకి అనుమతి లేదని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. న్యాయస్థానంలో కేసు ఉన్న కారణంగా కాలేజీ ప్రాంగణంలోకి మనోజ్‌కు అనుమతి లేదని కోర్టు ఉత్తర్వులు మనోజ్‌కు పోలీసులు అందజేశారు. పోలీసులు నోటీసులు ఇవ్వడంతో కాలేజీలోకి వెళ్లకుండానే మనోజ్ నారావారీ పల్లెకు వెళ్లారు. లోకేష్‌తో భేటీ అనంతరం తిరిగి రంగంపేటలో జల్లికట్టు జరగనున్న ప్రాంతంకీ మనోజ్ వెళ్లనున్నట్లు సమాచారం.


Also Read: GRSEL Recruitment: ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాతపరీక్ష లేదు.. భారీ శాలరీ.. జస్ట్ ఈ అర్హతలుంటే చాలు..!

మరోవైపు మంచు మనోజ్ కాలేజ్‌లోకి రావొద్దంటూ మోహన్‌ బాబు ఇప్పటికే కోర్టులో ఇంజెక్షన్ పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌ను కోర్టు పరిగణలోకి తీసుకుని అనుమతినిచ్చింది. దీంతో మనోజ్ కాలేజ్‌ వద్దకు వెళ్లిన సమయంలో పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. కాలేజ్‌కు ఉన్న నాలుగు గేట్ల వద్దకు మనోజ్ వెళ్లి.. అక్కడి పోలీసులతో మాట్లాడారు. వారి వద్ద నుంచి సమాచారం తీసుకున్నారు. ఈ వ్యవహారం మొత్తాన్ని తన ప్రైవేటు సెక్యూరిటీ, కెమెరామెన్‌లతో వీడియో తీయించారు. మనోజ్‌ పాటు ఆయన భార్య మౌనిక కూడా కాలేజీ వద్దకు వెళ్లారు. అయితే కాలేజ్‌లోకి అనుమతి లేకపోవడంతో అక్కడి నుంచి నారావారిపల్లెకు వెళ్లిన మనోజ్.. భార్యతో కలిసి మంత్రి లోకేష్‌ను కలిశారు.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×