Nara Lokesh Posted Comment on X against Jagan Mohan Reddy: ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి లోకేశ్ తాజాగా మరోసారి తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. వరద ముంపునకు కూటమి ప్రభుత్వమే కారణమంటూ వైసీపీ నేతలు విష ప్రచారం చేస్తున్నారంటూ సోషల్ మీడియా వేదికగా ఆయన మండిపడ్డారు. వైసీపీ నేతలు చేసిన కుట్రలు ఎక్కడ బయటపడుతాయోనని ఈ విధంగా విష ప్రచారం చేస్తున్నారని ఫైరయ్యారు. లక్షలాది మంది జలసమాధి అయ్యేలా సైకో జగన్ పన్నిన కుట్ర బట్టబయలైందంటూ లోకేశ్ మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో పోస్ట్ పెట్టారు.
Also Read: పల్నాడులో ఉద్రిక్తత.. టీడీపీ కేడర్‌ని రెచ్చగొట్టిందెవరు? మాజీ ఎమ్మెల్యే వాహనంపై దాడి
ఎక్స్‌లో లోకేశ్ ఏమన్నారంటే..?
ప్రకాశం బ్యారేజ్ కూల్చి లక్ష మంది పైనే ప్రజలను చంపటం జగన్ లక్ష్యం అని పేర్కొంటూ జగన్, పడవలు ఉన్నటువంటి ఫొటోను జత చేస్తూ.. దాని కామెంట్ పోస్ట్ చేశారు. ఆ కామెంట్ లో ఈ విధంగా పేర్కొన్నారు. ‘అధికారం అండగా సైకో జగన్ తన ఇసుక మాఫియా కోసం అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయేలా చేసి 50 మందిని చంపేసి, ఐదు ఊర్లు పూర్తిగా నామరూపాలు లేకుండా చేశారు. ఇదే ప్లాన్ ను అనుసరించి ఇనుప పడవలతో ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టి, దానిని కూల్చివేసి విజయవాడతోపాటు పదుల సంఖ్యోల లంక గ్రామాలను నామ రూపాలు లేకుండా చేసి లక్షలాది మంది ప్రజలు జల సమాధి అయ్యేలా సైకో జగన్ పన్నిన కుట్ర బట్టబయలైంది. ప్రకాశం బ్యారేజీని పడవలతో కూల్చేయాలనే కుట్ర ప్లాన్ చేసింది సైకో జగన్ అయితే, ప్లాన్ అమలు చేసింది వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం, వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్. తమ కుట్రలు బయటపడకుండా వరద ముంపునకు ప్రభుత్వమే కారణమంటూ విషప్రచారం చేస్తుంది సైకో జగన్ ముఠా’ అంటూ లోకేశ్ అందులో పేర్కొన్నారు.
Also Read: తాడేపల్లికి జగన్.. బోట్ల ఘటనపై కౌంటర్ ప్లాన్.. ఆ తర్వాతే ఫారెన్ టూర్?
ఇటు హోంమంత్రి అనిత కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రకాశం బ్యారేజీ కూల్చివేతకు జగన్ కుట్ర పన్నారని, అందుకు సహకరించిన వాళ్లపై కూడా దేశ ద్రోహం కేసు పెట్టాలన్నారామె. ఒక క్రిమినల్ రాజకీయ నాయకుడైతే ఎటువంటి పరిణామాలు ఉంటాయో అనేది ఇప్పుడు స్పష్టంగా ప్రజలకు అర్థమవుతుందంటూ ఆమె పేర్కొన్నారు. మాజీ ఎంపీ నందిగాం సురేష్ ఇసుక లూటీ కోసం వాడిన బోట్లనే ప్రకాశం బ్యారేజీ ధ్వంసం చేయడానికి వాడారంటూ ఆమె మండిపడ్డారు. కౌంటర్ వెయిట్స్ కు కాకుండా పిల్లర్స్ కూలిపోయి ఉంటే నష్టం మాటలకు అందేది కాదన్నారు. బోట్లు పోయాయంటూ ఒక్కరు కూడా ఫిర్యాదు చేయలేదన్నారు. ఉద్దడంద రాయుడు పాలెం దగ్గర ఉండాల్సిన బోట్లు బ్యారేజ్ ఎగువకు ఎలా వచ్చాయంటూ అనిత ప్రశ్నించారు.
‘దీనిపై పూర్తి విచారణ జరిపిస్తాం. ఘటన వెనుక ఉన్న బాధ్యులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించం. ప్రకాశం బ్యారేజీ వద్ద మొత్తం ఐదు బోట్లు వదిలితే అందులో రెండు మునిగిపోయాయి. మరో మూడు పడవలు కౌంటర్ వేయిట్స్ దెబ్బతీశాయి. ఆ బోట్లు ఎవరివో తేల్చి బాధ్యులందరిపైనా చర్యలు తీసుకుంటాం. మొరిగేవాళ్లను మేం పట్టించుకోం. వైసీపీ నేతలు హ్యుమానిటీ లేకుండా ప్రవర్తిస్తున్నారు. చంద్రబాబు పనితీరు, క్రైసిస్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుందో ఆ పార్టీలో రాజకీయాలు ప్రారంభించిన మాజీ మంత్రి అమర్నాత్ కు తెలియదా?. రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లేందుకు సోషల్ మీడియాలో వక్రీకరించి ప్రయత్నాలు చేస్తున్నారు. వరదలకు సీఎం, హోంమంత్రి, జగన్ మోహన్ రెడ్డి ఇల్లా అనే తేడా ఉండదు. వైసీపీ నేతలు ఏ మాత్రం సిగ్గు లేకుండా… రాష్ట్రంలో కొనసాగుతున్న సహాయక చర్యలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
విజయవాడలో వచ్చిన వరదలను ఓ కేసు స్టడీగా తీసుకుని సహాయక చర్యలపై ప్రణాళికా బద్ధంగా ముందుకువెళ్తున్నాం. నదులు, వాగుల పరివాహక ప్రాంతాల్లో అక్రమాలపై విచారించి చర్యలు తీసుకుంటాం. ఇందుకు సంబంధించిన ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇటు ఏలేరు వరదలలో సహాయక చర్యలు విస్తృతంగా కొనసాగుతున్నాయి. అటు విశాఖ నగరంలో కొండవాలు ప్రాంతాల పరిరక్షణ కోసం ప్రభుత్వం చర్యలను చేపట్టింది’ అంటూ అనిత పేర్కొన్నారు.