BigTV English

AP Politics : కంపెనీని బెదిరిస్తున్న ఎమ్మెల్యే.. కడప ఫ్యాక్షనిజం?

AP Politics : కంపెనీని బెదిరిస్తున్న ఎమ్మెల్యే.. కడప ఫ్యాక్షనిజం?

AP Politics : రాయలసీమ రాజకీయాలు అదో టైప్. అక్కడ నేతలే ఎవ్రిథింగ్. ప్రజాప్రతినిధుల కనుసన్నల్లోనే ఏదైనా జరగాలి. అక్కడ నో రూల్స్. నో చట్టం. ఓన్లీ డిక్టేటర్‌షిప్. కాదూ కూడదు అంటే రక్తచరిత్రనే. దశాబ్దాలుగా అదే తీరు. గతంలో ఫ్యాక్షనిస్టులు ఇలాంటి దందాలు చేసేవారు. ఆ తర్వాత ఫ్యాక్షన్‌ ఖద్దరు చొక్కా తొడగడంతో.. రాజకీయ నేతలే రాయలసీమను శాసించారు. ఇదంతా గతం. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. చట్టం ఎవరికీ చుట్టం కాదంటోంది. కానీ, ఇప్పటికీ అక్కడక్కడా పాత వాసనలు కనిపిస్తూనే ఉన్నాయి. ఫ్యాక్షన్ మార్క్ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఉదంతం కడప జిల్లాలో చర్చనీయాంశమైంది. ఏపీలోనూ రీసౌండ్ వస్తోంది. ఇంతకీ అసలేం జరిగిందంటే….


కాంట్రాక్టులన్నీ నాకే.. లేదంటే…

BJPకి చెందిన జమ్మలమడుగు MLA ఆదినారాయణరెడ్డిపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. కడప జిల్లాలో అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌ను MLA బెదిరిస్తున్నట్టు చెబుతున్నారు. సంస్థలో ప్రతి పనికి సంబంధించిన అన్ని కాంట్రాక్టులను తనకు, తన వారికే ఇవ్వాలని MLA పట్టుబడుతున్నారని అల్ట్రాటెక్ సిమెంట్స్ యాజమాన్యం ఆరోపిస్తోంది. ఇప్పటికే ఆదినారాయణరెడ్డికి కొన్ని కాంట్రాక్టులు ఇచ్చామని, అన్ని కాంట్రాక్టులు MLAకే ఇవ్వడం సాధ్యం కాదని ఆ సంస్థ చెబుతోంది. ఆయన చెప్పినట్లు చేయకపోవడంతో తమ సిమెంట్ ఫ్యాక్టరీలకు రావాల్సిన ముడి పదార్థాల సరఫరాను ఆదినారాయణరెడ్డి అడ్డుకుంటున్నారని అల్ట్రాటెక్‌ కంపెనీ అంటోంది. సిమెంట్ పరిశ్రమలకు లారీలు వెళ్లకుండా వాహనాలు అడ్డుపెట్టి, తన మనుషులను కాపలా పెట్టారని చెబుతోంది.


కలెక్టర్‌కు కంపెనీ కంప్లైంట్

MLA తీరుతో చిలమకూరు ప్లాంట్‌లో సిమెంట్ ఉత్పత్తి ఆగిపోయిందని, యర్రగుంట్ల ప్లాంట్‌లోనూ ఉత్పత్తి ఆగిపోయే పరిస్థితి రావడంతో.. జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశామని అల్ట్రాటెక్ వెల్లడించింది. SPతో ఫోన్‌లో మాట్లాడిన కలెక్టర్‌.. వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. MLA ప్రధాన అనుచరుడు జగదీశ్వర్‌రెడ్డితో సహా పలువురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌కు ముడి పదార్థాల రవాణా పునరుద్ధరించారు.

Also Read : చేబ్రోలు కిరణ్ కేసులో పోలీసులకు ఎంత కష్టం వచ్చిందో..

వైసీపీ వాళ్లకే కాంట్రాక్టులా?

తనపై వచ్చిన ఆరోపణలపై MLA ఆదినారాయణరెడ్డి స్పందించారు. అల్ట్రాటెక్ సిమెంట్స్ యాజమాన్యం వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని MLA అన్నారు. ఎన్నిసార్లు చెప్పినా తీరు మార్చుకోవడం లేదని చెప్పారు. స్థానికులకు ఉపాధి దొరుకుతుందనే ఉద్దేశంతోనే గతంలో ఫ్యాక్టరీ నిర్మాణానికి సహకరించామని గుర్తుచేశారు. అల్ట్రాటెక్‌ సిమెంట్స్ తీరుతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారని.. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి కూడా తీసుకెళ్లానని MLA చెబుతున్నారు. విదేశీ పర్యటన నుంచి ముఖ్యమంత్రి తిరిగొచ్చాక స్వయంగా కలిసి పరిస్థితి వివరిస్తానన్నారు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×